Jump to content

కల్లోజు గోపాలక్రిష్ణమాచార్యులు

వికీపీడియా నుండి

ఒజ్జు, ఒజి, ఓజు శబ్దాలన్నింటికి ఉపాధ్యాయులు, గురువులు అనే అర్థం వున్నదని పండితులు అంటారు. ఆంధ్రదేశంలో ముఖ్యంగా విశ్వకర్మ బ్రాహ్మణ వంశీయులలో కొందరి ఇంటి పేర్లలో ఈ ఓజు, ఒజి శబ్దాలు వినిపిస్తూ వుంటాయి. ఆ వంశం వారు గురు స్థానంలో లబ్ధ ప్రతిష్ఠులైన మహా పురుషులున్నారని, అది అన్వర్తకమై ఉండవచ్చని కూడా చెప్పవచ్చు. అలా ఉహించడానికి ఆధారం ఆ ఇంటిపేరు గల కుటుంబాలలో గొప్ప గొప్ప పండితులు జన్మించడం, గురుపీటం అధిష్టించిన వారు ఉండటమే ! అలంటి పుజనియులిన పండితులున్నా గ్రామాలకు కూడా ఆ వంశం పేరు ఉండడం సాధారనంగా కనిపిస్తున్నది. ఇది పండితులను గౌరవించిన ఒకనాటి మన సంస్కృతికి నిదర్శనం. అలాంటి గ్రామాలలో ప్రసిద్దమైన నెల్లూరు జిల్లా కల్లోజు. ఆ గ్రామానికి కల్లోజు గోపాలక్రుష్ణమాచార్యుల వంశం వల్ల ఆ పేరు వచ్చినట్టు ఆ వంశీకుల చరిత్రతో రూడి అవుతున్నది.

విరాద్విశ్వకర్మ దివ్యశక్తి ప్రసారం కొందరిపైన, కొన్ని వంశాల పైన అపారంగా ఉంటుందేమో ! కల్లోజు వంశం సుకృతం వల్ల ఆ వశానికి యశస్సు సంపాదించి పెట్టిన మహా మహులు ఎందరో ఉన్నారు. వారిలో గోపాలక్రుష్ణమాచార్యులు ఒకరు. ఆ వంశంలో దాదాపుగా అంతా సనాతనులలో అత్యంత సనాతనులని, ఆధునికులలో అత్యాదునికులని చెప్పతగిన నిజమైన అభ్యుదయభావ సంపన్నులు ఎందరో ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే 19 వ శతాబ్దం ద్వితియార్థం నుంచి 20 వ శతాబ్దం ప్రథమ పాదం వరకు రామారవి 75 సంవత్సరాల పాటు ఆంధ్ర విశ్వకర్మ వంశీయుల కీర్తి పతాకను చేపట్టిన వారిలో కల్లోజు వంశీయులు అగ్రగాములంటే అతిశయోక్తి కాదు.

ఈ వ్యాసం కల్లోజు గోపాల కృష్ణమాచార్యుల జీవితానికి సంబధించింది. ఆయన. 1884 వ సంవత్సరం సెప్టెంబరు 5 వ తేదిన మద్రాసు నగరంలో జన్మించారు. తండ్రి చెంగాల్వరాయాచార్యులు. తల్లి మద్రాసులోనే (చేపాక్) నివసిస్తున్న గుడ్లూరు మున్నయాచార్యులు గారి కుమార్తె మన్నారమ్మ.

ప్రాథమిక విద్య గోవిందప్ప నాయకర్ స్ట్రీట్ లోని మిడిల్ స్కూలులోని, పచ్చియప్పకలేజిలోను నేర్చారు. ఆ చదువు వ్యాపార వర్గాల కుటుంబాల పిల్లల మధ్య జరిగినందువల్ల, తండ్రి కూడా ఆభరణాల వ్యాపారం చేస్తునందువల్ల, తండ్రి అడుగు జాడలలోనే వృద్ధిలోకి రావాలన్న సంస్కారం ఉన్నందువల్ల ఆ కోర్సులు పూర్తీ చేసుకొన్నారు. చదువుకొంటున్న రోజుల్లోనే తండ్రి దగ్గర వ్యాపార మర్మాలు తెలుసుకోనడమే గాక స్వయంగా తానొక చిన్న వెండి వస్తువుల షాపు ప్రారంభించి ఉదయం, సాయంత్రం వేళల్లో నడిపేవారు