కళ్యాణ వెంకటేశ్వర ఆలయం, శ్రీనివాసమంగపురం
కళ్యాణ వేంకటేశ్వర దేవాలయం తిరుపతిలోని శ్రీనివాసమంగాపురంలో ఉన్న పురాతన హిందూ దేవాలయం . ఈ ఆలయం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని తిరుపతి జిల్లాలో ఉంది. [1] ఈ ఆలయం విష్ణు స్వరూపమైన వేంకటేశ్వర దేవునికి అంకితం చేయబడింది . దీనిని కల్యాణ వేంకటేశ్వర గుడి అని పిలుస్తారు. ఈ ఆలయం జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నాలు లో ఒకటి. [2]
భారత పురాతత్వ సర్వేక్షణ ఆధీనంలో ఉన్న కల్యాణ వేంకటేశ్వర ఆలయం 1967 నుండి తిరుమల తిరుపతి దేవస్థానంచేత నిర్వహించబడుతోంది ఈ ఆలయంలో 1981 నుండి ప్రతి సంవత్సరం జాతర ఉత్సవాలు జరుగుతాయి.
తిరుమల వెంకటేశ్వర ఆలయం పక్కనే ఉన్న కళ్యాణ వేంకటేశ్వర దేవాలయాన్ని హిందువులు పరమ పవిత్రంగా భావిస్తారు. కొన్ని కారణాల వలన తిరుమలకు వెళ్లలేని వారు కల్యాణ వేంకటేశ్వరుని దర్శనం చేసుకుని తమ కోరికలు తీర్చమని అడగవచ్చు. ఈ గుడిలో ఎక్కువగా నూతన వరుడు వధువులకు వివాహాలు జరుగుతాయి. వివాహమైన మొదటి ఆరు నెలలు వేంకటేశ్వరుడు తన సతీమణి పద్మావతితో కలిసి ఉన్న ప్రదేశం కనుక ఈ ఆలయంలో నూతన వధూవరులు ముందుగా ప్రార్థనలు చేస్తారు.
పరిపాలన
[మార్చు]ఈ ఆలయం 1967 నుండి 1981 వరకు భారత పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. 1981లో ఈ ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి అప్పగించారు. ప్రస్తుతం ఈ ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్వహిస్తోంది. [1]
గుడిలో దేవతలు
[మార్చు]ఆలయ ప్రధాన దేవుడు వేంకటేశ్వరుడు ( విష్ణువు రూపం) వెంకటేశ్వర స్వామిని ఈ గుడిలో కల్యాణ వేంకటేశ్వరుడుగా అభివర్ణిస్తారు. ఈ గుడిలో వెంకటేశ్వర స్వామి విగ్రహం తూర్పు ముఖంగా ఉంది నాలుగు చేతులతో నిలబడి ఉన్న భంగిమలో ఉంటుంది: ఒక కుడి చేతి వరద ముద్రలో మరొకటి చక్రాన్ని ఒక ఎడమ చేతిని కటి ముద్రలో మరొకటి శంఖాన్ని పట్టుకొని ఉంటుంది.
ఈ ఆలయంలో విష్ణువు యొక్క రెండు రూపాలైన లక్ష్మీ నారాయణ రంగనాథ దేవతలు కూడా ఉంటారు.
ప్రాముఖ్యత
[మార్చు]తిరుమలలోని వేంకటేశ్వరాలయం పక్కనే ఉన్న ఈ ఆలయం పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. [1] ఈ ఆలయాన్ని భారత పురావస్తు సర్వే జాతీయ ప్రాముఖ్యత కలిగిన పురాతన స్మారక చిహ్నంగా గుర్తించింది. [3]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 "SRI KALYANA VENKATESWARA SWAMY TEMPLE, SRINIVASA MANGAPURAM". Tirumala Tirupati Devastanams. Archived from the original on 10 మార్చి 2016. Retrieved 19 February 2016.
- ↑ "Centrally Protected Monuments". Archeological Survey of India (in ఇంగ్లీష్). Archived from the original on 26 June 2017. Retrieved 27 May 2017.
- ↑ "Alphabetical List of Monuments – Andhra Pradesh". ASI. Archived from the original on 25 June 2014. Retrieved 19 February 2016.