కవికోకిల గ్రంథావళి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దువ్వూరి రామిరెడ్డి (నవంబర్ 9, 1895సెప్టెంబర్ 11, 1947) కవికోకిల అని ప్రసిద్ధుడైన తెలుగు కవి. రైతు, కవి అయిన ఇతనిని "సింహపురి సిరి"గా పండితులు కొనియాడారు. దువ్వూరి రామిరెడ్డి ప్రస్తుత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, గూడూరులో 09-11-1895న జన్మించాడు. 23 సంవత్సరాలనాటికే ఎన్నో రచనలు చేశాడు. స్వయంకృషితోనే అనేక భాషలలో పండితుడయ్యాడు. 11-09-1947న మరణించాడు. ఆయన సాహిత్యాన్ని కవికోకిల గ్రంథావళిగా వివిధ సంపుటాల్లో ప్రచురించగా, ఈ నాల్గవ సంపుటిలో సాహిత్య వ్యాసాలు ముద్రించారు.

దీని మొదటి ముద్రణము 1935లో చేయగా (రెండవ ముద్రణ 1945లో; మూడవ ముద్రణ 1946లో; నాల్గవ ముద్రణ 1955లో; ఐదవ ముద్రణ 1959లో) 1967లో ఇది ఆరవ ముద్రణము పొందినది. దీనిని కవికోకిల గ్రంథమాల, నెల్లూరు వారు ప్రచురించారు.

ఇందులోని వ్యాసములు[మార్చు]

1. సారస్వత వ్యాసములు
 1. కవి
 2. కవిత్వావతరణము
 3. కవిత్వతత్త్వము
 4. కావ్యజీవితము
 5. కవిత్వశిల్పము - అనుకరణము
 6. రసరామణీయకములు
 7. శిల్పసీమలు
 8. కవిత్వప్రయోజనము
 9. కావ్యము నీతి
 10. మర్మ కవిత్వము
 11. నాటక కళాసంస్కరణము
 12. అల్లసాని పెద్దన సమకాలీన భావప్రతినిధి
 13. నాటకము చరిత్రము
 14. అలంకార తత్త్వము
2. తెలుగు కవితలో క్రొత్త తెన్నులు
 1. తెలుగు కవితలో క్రొత్త తెన్నులు
 2. అభినవాంధ్ర సాహిత్యము
 3. చిత్ర లక్షణము
 4. సాహిత్యములో రమ్యత
 5. నేటి కవిత - ప్రకృతి పూజ
 6. సాహిత్యంలో వైచిత్రి
 7. నా కవితానుభవములు
 8. తిక్కన
 9. విషాదాంత నాటకము - మీరాబాయి

మూలాలు[మార్చు]