కవీందర్ గుప్తా
కవీందర్ గుప్తా | |||
| |||
జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి
| |||
పదవీ కాలం 30 ఏప్రిల్ 2018 – 19 జూన్ 2018 | |||
గవర్నరు | నరీందర్ నాథ్ వోహ్రా | ||
---|---|---|---|
ముందు | నిర్మల్ కుమార్ సింగ్ | ||
తరువాత | రాష్ట్రపతి పాలన | ||
జమ్మూ కాశ్మీర్ శాసనసభ స్పీకర్
| |||
పదవీ కాలం 18 మార్చి 2015 – 29 ఏప్రిల్ 2018 | |||
గవర్నరు | నరీందర్ నాథ్ వోహ్రా | ||
ముందు | ముబారక్ గుల్ | ||
తరువాత | నిర్మల్ కుమార్ సింగ్ | ||
పదవీ కాలం 23 డిసెంబర్ 2014 – 2018 | |||
గవర్నరు | నరీందర్ నాథ్ వోహ్రా | ||
ముందు | రామన్ భల్లా | ||
తరువాత | ఖాళీ | ||
నియోజకవర్గం | గాంధీనగర్ | ||
జమ్మూ మేయర్
| |||
పదవీ కాలం 2005 – 2010 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | జమ్మూ, జమ్మూ కాశ్మీర్, భారతదేశం | 1959 డిసెంబరు 2||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
కవీందర్ గుప్తా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన 2014లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో గాంధీనగర్ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికై,[2] 18 మార్చి 2015 నుండి 29 ఏప్రిల్ 2018 వరకు జమ్మూ కాశ్మీర్ శాసనసభ స్పీకర్‌గా,[3] 30 ఏప్రిల్ 2018 నుండి 19 జూన్ 2018 వరకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పని చేశాడు.[4][5]
రాజకీయ జీవితం
[మార్చు]కవీందర్ గుప్తా పదమూడేళ్ల వయసులో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో చేరి ఎమర్జెన్సీ సమయంలో పదమూడు నెలలు జైలు శిక్ష అనుభవించాడు. ఆయన 1978 నుండి 1979 వరకు విశ్వ హిందూ పరిషత్ పంజాబ్ విభాగానికి కార్యదర్శిగా, 1993 నుండి 1998 వరకు భారతీయ యువ మోర్చా జమ్మూ కాశ్మీర్ విభాగానికి అధ్యక్షుడిగా, 2005 నుండి 2010 వరకు మూడు సార్లు జమ్మూ మేయర్‌గా వివిధ హోదాల్లో పని చేశాడు.
కవీందర్ గుప్తా 2014లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో గాంధీనగర్ నియోజకవర్గం నుండి తొలిసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికై, 18 మార్చి 2015 నుండి 29 ఏప్రిల్ 2018 వరకు జమ్మూ కాశ్మీర్ శాసనసభ స్పీకర్‌గా, 30 ఏప్రిల్ 2018న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 30 ఏప్రిల్ 2018 నుండి 19 జూన్ 2018 వరకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పని చేశాడు.[6][7] ఆయనకు 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో పోటీ చేసే అవకాశం దక్కలేదు.[8]
మూలాలు
[మార్చు]- ↑ "Who is Kavinder Gupta?". The Indian Express. 30 April 2018. Retrieved 1 May 2018.
- ↑ India Today (23 December 2014). "Jammu and Kashmir Assembly election winners list" (in ఇంగ్లీష్). Retrieved 16 October 2024.
- ↑ "BJP Legislator Kavinder Gupta elected as the Speaker of the 12th Jammu & Kashmir Assembly". India Today. 19 March 2015. Retrieved 2 May 2018.
- ↑ National Herald (2 May 2018). "'A proud RSS man': Meet the new J&K Deputy Chief Minister" (in ఇంగ్లీష్). Retrieved 16 October 2024.
- ↑ "Kavinder Gupta, who joined RSS at age of 13, is Jammu and Kashmir Deputy Chief Minister". New Indian Express. 30 April 2018. Retrieved 2 May 2018.
- ↑ "Jammu and Kashmir cabinet reshuffle today, Kavinder Gupta to replace Nirmal Singh as deputy CM". 30 April 2018. Retrieved 16 October 2024.
- ↑ Financial Express (30 April 2018). "Jammu and Kashmir cabinet reshuffle: Speaker Kavinder Gupta to replace Nirmal Singh as Deputy CM as BJP undertakes major rejig" (in ఇంగ్లీష్). Retrieved 16 October 2024.
- ↑ The Indian Express (8 September 2024). "BJP releases 6th list for Jammu and Kashmir polls, drops ex-deputy CM Kavinder Gupta" (in ఇంగ్లీష్). Retrieved 16 October 2024.