కాకతీయ మ్యూజికల్ గార్డెన్
కాకతీయ మ్యూజికల్ గార్డెన్ | |
---|---|
స్థానం | హన్మకొండ, హన్మకొండ జిల్లా, తెలంగాణ |
సమీప పట్టణం | వరంగల్ |
అక్షాంశరేఖాంశాలు | 17°59′27″N 79°35′19″E / 17.9909°N 79.5886°E |
విస్తీర్ణం | 15 ఎకరాలు |
కాకతీయ మ్యూజికల్ గార్డెన్, తెలంగాణ రాష్ట్రం హన్మకొండ జిల్లాలోని భద్రకాళి దేవాలయానికి సమీపంలో ఉన్న ఒక మ్యూజికల్ గార్డెన్.[1][2] ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. కుటుంబం మొత్తం ఆనందంగా సందర్శించే ప్రదేశం ఇది.
ప్రారంభం
[మార్చు]2017, నవంబరు 18న తెలంగాణ రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈ గార్డెన్ కు శంకుస్థాపన చేశాడు.[3]
గార్డెన్ వివరాలు
[మార్చు]ఈ గార్డెన్ 15 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. రంగురంగుల లైట్లతో కూడిన మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్ ఈ గార్డెన్ కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఈ ఫౌంటెన్ ప్రతిరోజూ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఇక్కడున్న సరస్సులో బోటింగ్ అవకాశం కూడా ఉంది. రాతి బొమ్మల విగ్రహాలు, ఇతర విగ్రహాలు, వివిధ రకాల పుష్పాలు ఉన్నాయి, గ్రీన్హౌస్ చుట్టూ షికారు చేయవచ్చు.[4] ఈ రాతి నిర్మాణంలో మముత్ షేక్, క్యాస్కేడ్ గార్డెన్ పునాదిగా ఉంచబడ్డాయి. హెడ్‌లైనర్, మెలోడిక్ వెల్‌స్ప్రింగ్‌లు మొదలైనవి రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయి.
- ల్యాండ్ స్కేపింగ్
- డక్ పాండ్
- ఫౌంటెన్ వాటర్ ఫాల్స్
- పెడల్, పడవల చెరువు, వాటర్ స్క్రీన్
- చిల్డ్రన్ గేమ్స్ పార్క్
- కాక్టస్ గార్డెన్
- ఫ్రాక్ రాక్ పాయింట్ డైనోసార్
- సన్ సెట్ వ్యూ పాయింట్
- ఇండోర్ చిల్డ్రన్స్ పార్క్
- విశ్రామ్ కాటేజ్
ఇతర వివరాలు
[మార్చు]రూ .13.5 కోట్ల అంచనా వ్యయంతో ఈ గార్డెన్ పునర్నిర్మాణం చేపట్టబడింది.[5]
రవాణా
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడికి రవాణా సౌకర్యం ఉంది. ఇక్కడికి 13 కి.మీ.ల సమీపంలో కాజీపేట రైల్వే స్టేషన్ కూడా ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ "Kakatiya musical garden sightseeing". www.holidify.com. Retrieved 29 October 2017.
- ↑ "Kakatiya Musical Garden Warangal, History, Timings -". Temples In India Info. 2016-10-18. Retrieved 2021-08-29.
- ↑ India, The Hans (2017-11-17). "KTR to visit Warangal tomorrow". www.thehansindia.com. Retrieved 2021-08-29.
- ↑ "Kakatiya Musical Garden". Times of India Travel. Retrieved 2021-08-29.
- ↑ India, The Hans (2017-12-08). "Ropeway to link Bhadrakali, Padmakshi temples soon". www.thehansindia.com. Retrieved 2021-08-29.