కాక్‌పిట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సాధారణముగా విమానం ముందుండే కాక్‌పిట్ లేదా ఫ్లైట్ డెక్ అనే స్థలం, పైలట్‌కు విమానాన్ని నియంత్రించడానికి ఉపయోగపడే స్థలం. చాలా ఆధునిక విమానాలలో కొన్ని చిన్న విమానాలను మినహాయించి, కాక్‌పిట్లు చుట్టూ మూయబడి ఉంటాయి, పెద్ద విమానాలలో కూడా కాక్‌పిట్లు కాబిన్ ‌నుండి వేరు చేయబడి ఉంటాయి. విమానాన్ని భూమి మీదనూ మరియు గాలిలోను నియంత్రించే పని కాక్‌పిట్‌లో నుండి జరుగుతుంది.

విమానంలో పైలట్ యొక్క గదికి కాక్‌పిట్ అనే పదం మొదట 1914లో దర్శనమిచ్చింది. 1935 నుండి, కాక్‌పిట్ అనే పదాన్ని వాడుకగా, కార్ యొక్క డ్రైవర్ సీటుకు ఆపాదించడం జరుగుతోంది, ముఖ్యంగా ఒక ఉన్నతమైన కార్యదక్షత కలిగిన కారుది. ఫార్ములా వన్‌లో ఇది అధికారిక పరిభాష. రాయల్ నేవి షిప్‌లోని కోక్స్‌వైన్ స్టేషను అనబడే నౌకాయాన పరిభాషకు చెందిన పదానికీ, తరువాత, షిప్పు యొక్క చుక్కానిని నియంత్రించే భాగాలు ఉండే స్థానానికీ ఈ పదం అతి దగ్గర సంబంధం కలిగి ఉంది.

ఎయిర్‌బస్ 380 కాక్‌పిట్చాలా ఎయిర్‌బస్ కాక్‌పిట్లు ఫ్లై-బై-వైర్ సాంకేతికతను కలిగి ఉన్న కంప్యూటరైజ్డ్ గ్లాస్ కాక్‌పిట్లుకంట్రోల్ కాలమ్న్‌ను ఎలెక్‌ట్రానిక్ సైడ్‌స్టిక్ భర్తీ చేసింది.
స్విస్స్ HB-IZX సాబ్ 2000 కాక్‌పిట్
రాబిన్ DR400/500
1936 డి హావిల్లాండ్ హార్నెట్ మోత్ కాక్‌పిట్

విమానపు కాక్‌పిట్‌లో ఒక ఇన్‌స్ట్రుమెంట్ పానెల్ మీద ఫ్లైట్ పరికరాలు మరియు పైలట్ విమానాన్ని గాలిలో ఎగురవేయడానికి అవసరమయ్యే కంట్రోల్స్ ఉంటాయి. చాలా విమానాలలో, ప్రయాణికుల విభాగం నుండి కాక్‌పిట్‌ను ఒక ద్వారం వేరుచేస్తుంది. 2001 సెప్టెంబరు 11 తీవ్రవాద దాడుల తరువాత, అన్ని పెద్ద విమాన సంస్థలు కాక్‌పిట్లను హైజాకర్లకు ప్రవేశావకాశం లేకుండా చేసి కోటకట్టి కట్టుదిట్టం చేసాయి.

సాధారణంగా, విమానం మీద, కాక్‌పిట్‌ను ఫ్లైట్ డెక్ అని కూడా పిలుస్తారు. పెద్ద ఎగిరే పడవలలో, వేరుగా ఉండి పైలట్ మరియు కో-పైలట్ కూర్చునే స్థలమయిన అప్పర్ ప్లాట్‌ఫారంని ఉద్దేశించి RAF ఉపయోగించే పదం నుండి ఈ పదం పుట్టింది.

కార్య సిద్ధాంత శాస్త్రం[మార్చు]

పరివేష్ఠిత కాబిన్ ఉన్న మొదటి విమానం, ఇగర్ సికోర్‌స్కి యొక్క విమానం ది గ్రాండ్, 1913లో కనపడింది. 1920వ దశాబ్దంలో విమాన సిబ్బంది బహిర్గతంగా గాలిలో ఉండి ప్రయాణీకులు కాబిన్‌లో కూర్చుని ఉండే పాసింజర్ విమానాలు చాలా ఉండేవి. రెండవ ప్రపంచ యుధ్ధంలో రెండు జతల రెక్కలున్న మిలిటరి బైప్లేన్లు, మొదటి సింగిల్-ఇంజన్‌డ్ ఫైటర్లు మరియు దాడికి ఉద్దేశించిన విమానాలన్నీ కూడా బహిర్గత కాక్‌పిట్లు కలిగి ఉండేవి. 1924 ఫోకర్ ట్రై-మోటర్, ది 1926 ఫోర్డ్ ట్రై-మోటర్, ది 1927 లాక్‌హెడ్ వేగ, ది స్పిరిట్ ఆఫ్ St. లూవిస్, ది 1931 టేలర్ కబ్, మిలిటరి రవాణాకి ఉపయోగించబడిన జర్మన్ జంకర్లు మరియు డౌగ్లస్ అండ్ బోయింగ్ కంపనీలు 1930వ దశాబ్దపు సగంలో ఉత్పత్తి చేసిన పాసింజర్ విమానాలు - ఇవన్నీ కూడా అంతర్గత కాక్‌పిట్లు ఉన్న మొదటి విమానాలు. శిక్షణ విమానాలు మరియు, పొలాల మీద పురుగు మందులు మొదలగునవి జల్లు విమానాలు మినహాయించి 1950 దశాబ్దపు మధ్య భాగానికి బహిర్గత కాక్‌పిట్లు ఉండే విమానాలు కనపడకుండా పోయాయి.

ఇంగ్‌లాండ్‌లోని లండన్ హీత్రూ ఎయిర్‌పోర్ట్‌లో ఈ కాంటినెంటల్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 777-200 టేక్ ఆఫ్ పాయింట్ దగ్గరికి వెళ్తుండగా, ఫ్లైట్ డెక్ మీద ఒక పైలట్‌ను చూడవచ్చు.

కాక్‌పిట్ కిటికీలు సూర్య కవచం (సన్ షీల్డ్) కలిగి ఉండవచ్చు. చాలా కాక్‌పిట్లకు విమానం నేల మీద ఉన్నపుడు తెరచుకునే కిటికీలు ఉన్నాయి. పెద్ద విమానాలలోని దాదాపు అన్ని గాజు కిటికీలకు సూర్యరశ్మి నియంత్రణ పొర, మంచు, హిమము కరిగించడానికి అంతర్గత ఉష్ణ నియంత్రణ యంత్రం ఉంటాయి. చిన్న విమానాలు పారదర్శకమైన ఎయిర్‌క్రాఫ్ట్ కనోపి కలిగి ఉండవచ్చు.

కొన్ని మిలిటరి ఫాస్ట్ జెట్లలో మరికొన్ని వాణిజ్య విమానాలలో పైలట్ సైడ్-స్టిక్ ఉపయోగించినప్పటికీ (సాధారణంగా ఔట్‌బోర్డ్ వైపు మరియు/లేదా ఎడమ వైపు ఉంటుంది), చాలా కాక్‌పిట్లలో పైలట్ యొక్క కంట్రోల్ కాలమ్న్ లేదా జాయ్‌స్టిక్ మధ్యలో (సెంటర్ స్టిక్) ఉంటుంది.

కాక్‌పిట్ యొక్క నిర్మాణ ప్రణాళిక, వివిధ విమాన ఉత్పత్తిదారుల లోపల మరియు ఉత్పత్తిదారుల మధ్యలోనూ, ఇంకా వివిధ దేశాల మధ్యా, ముఖ్యంగా మిలిటరి ఫాస్ట్‌జెట్‌లో, పరిమాణ క్రమాన్ని సంతరించుకుంది. "బేసిక్ సిక్స్" విధానము అనేది అతి ముఖ్యమైన పరిణామాలలో ఒకటి. తరువాతది, పైలట్ పరికరాల సూక్ష్మ పరిశీలన కోసం 1937లో రూపకల్పన చేసిన రాయల్ ఎయిర్‌ఫోర్స్ అభివృధ్ధి చేసిన "బేసిక్ టి".

ఆధునిక కాక్‌పిట్లను రూపకల్పన చేయటంలో కార్య సిధ్ధాంత శాస్త్రం మరియు మానవ ప్రేరిత కారణాలు చాలా ముఖ్యమైనవి. కాక్‌పిట్ డిస్‌ప్లేస్ మరియు కంట్రోల్స్ యొక్క నిర్మాణ ప్రణాళిక మరియు కార్య విధివిధానము సమాచారం అధిక భారాన్ని కలిగించకుండా పైలట్ యొక్క స్థాన, స్థితి చేతనను పెంచేదిగా ఉండేలా రూపకల్పన చేయబడ్డవి. గతంలో ఎన్నో కాక్‌పిట్లు, ముఖ్యంగా ఫైటర్ విమానాలలోవి, వాటిలో పట్టగలిగే పైలట్ల పరిమాణాన్ని నియంత్రించేవి. ఇప్పుడు, కాక్‌పిట్లు మొదటి పెర్సంటైల్ స్త్రీ శరీర పరిమాణం నుండి 99వ పర్సంటైల్ పురుష శరీర పరిమాణం దాకా కూడా పట్టగలిగే విధంగా రూపకల్పన చేస్తున్నారు.

మిలిటరి ఫాస్ట్‌జెట్ కాక్‌పిట్ రూపకల్పనలో, కాక్‌పిట్‌తో సంబంధం కలిగిన సాంప్రదాయకమైన """గుబ్బలూ మరియు వేగసూచక యంత్రాలూ" ("knobs and dials") ముఖ్యంగా కనపడవు. ఇన్‌స్ట్రుమెంట్ పానెల్స్ స్థానంలో ఇప్పుడు ఎలెక్‌ట్రానిక్ డిస్‌ప్లేస్ వచ్చాయి, అవి వాటంతట అవే తరచు ఆకృతి మార్చుకుంటూ కాక్‌పిట్లో స్థలాన్ని ఆదా చేస్తాయి. భద్రత మరియు పూర్ణత్వం కోసం, కొన్ని హార్డ్-వైర్డ్ డెడికేటెడ్ స్విచెస్ ఇంకా ఉపయోగించే అవసరం ఉన్నప్పటికీ, చాలా సాంప్రదాయిక నియంత్రణల స్థానంలో ఆకృతిని నియంత్రించగలిగే వివిధోపయోగ నియంత్రణలు లేదా ఊతంగా అనబడే "సాఫ్ట్ కీస్" వాడుకలోకి వచ్చాయి. పైలట్ తల ఎత్తి, కళ్ళు బయటకు పెట్టగలిగే స్థానంలో ఉండటం కోసం, స్టిక్ మరియు థ్రాటిల్‌లలో నియంత్రణలు పొందుపరచడం జరిగింది - దానినే వాడుకగా హాండ్స్ ఆన్ థ్రాటిల్ అండ్ స్టిక్ అనీ, HOTAS కాన్‌సెప్ట్ అనీ అంటారు. ఈ నియంత్రణలను నూతన నియంత్రణా మాధ్యమాలైన శిరస్సు దిశను సూచించే హెల్మెట్ మౌంటెడ్ సైటింగ్ సిస్టం లేదా డైరెక్ట్ వాయిస్ ఇన్‌పుట్ (DVI) తోను మున్ముందు అభివృధ్ధి చేయచ్చు. శబ్ద సంబంధ సూచకాలలో నూతన ఆవిష్కరణలు, విమాన వ్యవస్థకు సంబంధించిన మెరుగు పడిన పర్యవేక్షణ కోసం ప్రమాద శబ్దాల స్పేషియల్ లోకలిజేషన్‌ను, విమాన స్థితి సమాచారానికి సంబంధించిన డైరెక్ట్ వాయిస్ ఔట్‌పుట్‌కి కూడా దోహదం చేస్తాయి. డిసైన్ అయ్ పొజిషన్ లేదా "DEP" అనునది కాక్‌పిట్ రూపకల్పనలో ముఖ్య భావన.

పరిశ్రమలో, ఆధునిక విమానాలలో ఉండే కంట్రోల్ పానెల్స్ యొక్క నిర్మాణ ప్రణాళిక విరివిగా సమరూపం సంతరించుకున్నది. చాలా మటుకు వ్యవస్థా-సంబంధిత నియంత్రణలు (విద్యుత్తు, ఇంధనం, జలయంత్ర శాస్త్రము మరియు వత్తిడి పెంచే ప్రక్రియ) ఉదాహరణకి, సాధారణంగా సీలింగ్‌లోనూ, ఓవర్‌హెడ్ పానెల్‌లోనూ ఉంటాయి. రేడియోలను సాధారణంగా, పైలట్ యొక్క సీట్ల మధ్య ఉండే పెడెస్టల్ అనబడే పానెల్ మీద ఉంచుతారు. ఆటోపైలట్ లాంటి స్వయంచాలక విమాన నియంత్రణలు సాధారణంగా విండ్‌స్క్రీన్‌కి కొద్దిగా క్రింద, మరియు గ్లేర్‌షీల్డ్ పైన ఉండే ముఖ్య ఇన్‌స్ట్రుమెంట్ పానెల్ పైనా ఉంచుతారు.

విమాన పరికరాలు[మార్చు]

IAF ఇల్యూషిన్ I1-76లో పని చేస్తోన్న USAF మరియు IAF ఎయిర్‌మెన్

ఆధునిక ఎలెక్‌ట్రానిక్ కాక్‌పిట్లో, అత్యవసరాలుగా గుర్తించే విమాన పరికరాలు, MCP, PFD, ND, ETCAS, FMS/CDU మరియు బాక్-అప్ పరికరాలు.

MCP[మార్చు]

సాధారణంగా పైలట్ ముందుండే ఒక పొడవాటి సంకుచితమైన పానెల్ అయిన మోడ్ కంట్రోల్ పానెల్‌ను, హెడింగ్‌ని (HDG), వేగాన్ని (SPD), ఎత్తుని (ALT), ఊర్ధ్వ వేగాన్ని (V/S), ఊర్ధ్వ విమానయానాన్ని (VNAV) మరియు పార్శ్వ విమానయానాన్ని (LNAV), నియంత్రించడానికి ఉపయోగిస్తారు. దానిని, ఆటోపైలట్ మరియు ఆటోథ్రాటిల్‌లను పనిలో పెట్టడానికీ, పనిలోనుండి విముక్తి చేయడానికి కూడా ఉపయోగిస్తారు. పానెల్‌ను సాధారణంగా "గ్లేర్‌షీల్డ్ పానెల్" అని సంబోధిస్తారు. MCP అనే బోయింగ్ పేరు (యూనిట్/పానెల్‌కు ఆ పేరుని ఒక సాధారణ నామంగా వాడుకగా ఉపయోగంలోకి తీసుకువచ్చారు) వివిధ ఆటోఫ్లైట్ కార్యవిధులకు, పరిమితుల రూపకల్పన మరియు ఎన్నికకు దోహదపడే యూనిట్, దానినే ఎయిర్‌బస్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో FCU (ఫ్లైట్ కంట్రోల్ యూనిట్) అంటారు.

PFD[మార్చు]

ప్రైమరి ఫ్లైట్ డిస్‌ప్లే అనేది సాధారణంగా ఒక ప్రముఖ స్థానంలో ఉంటుంది, మధ్యస్థంగానో లేదా కాక్‌పిట్‌కు ఇరువైపులా ఎటైనా ఉండే విధంగా ఉంటుంది. చాలా సందర్భాలలో అది, ఆటిట్యూడ్ (తీరు) ఇండికేటర్, ఎయిర్‌స్పీడ్ (వాయువేగం) మరియు అల్టిట్యూడ్ (ఎత్తు) ఇండికేటర్స్ (సాధారణంగా టేప్ డిస్‌ప్లే లాంటివి) మరియు వర్టికల్ స్పీడ్ (ఊర్ధ్వవేగ) ఇండికేటర్ యొక్క డిజిటైజ్డ్ ప్రెసెంటేషన్ కలిగి ఉంటుంది. చాలా సందర్భాలలో అది ఒక రకమైన హెడింగ్ ఇండికేటర్ మరియు ILS/VOR డీవియేషన్ ఇండికేటర్స్‌ను కలిగి ఉంటుంది. చాలా సందర్భాలలో, ఒక విధమైన ఎత్తు, వేగం, ఊర్ధ్వవేగం మరియు ముందుకుపోయే తీరుకి సంబంధించిన ఎన్నుకోబడిన విలువల సూచనతో పాటు పనికల్పించబడిన మరియు సాయుధ ఆటోఫైట్ వ్యవస్థా రీతుల సూచన కూడా కలిగి ఉంటుంది. అది NDకి బదులుగా ఉపయోగించడానికి పైలట్ ఎన్నుకోదగినది కావచ్చు.

ND[మార్చు]

PFDకి పక్కగా ఉండే నావిగేషన్ డిస్‌ప్లే, ప్రస్తుత మార్గము మరియు మార్గంలో తరువాతి స్థానానికి సంబంధించిన సమాచారం, ప్రస్తుత గాలి వేగం మరియు వాయు గతిని సూచిస్తుంది. PFDకి బదులుగా ఉపయోగించడం కోసం దానిని పైలట్ ఎన్నుకోగలడు.

VC-10 (1960s) పాత-రీతి పరికరాలతో ది విక్కర్స్ VC10 ఎయిర్‌లైనర్ ఒక అనలోగ్ కాక్‌పిట్‌ను ప్రదర్శించింది
హాకర్ సిడ్డెలీ ట్రైడెంట్ ఎయిర్‌లైనర్‌కు చెందిన తరువాతి అనలోగ్ కాక్‌పిట్ (1970s)

EICAS/ECAM[మార్చు]

ఇంజన్ ఇండికేషన్ మరియు క్ర్యూ అలర్టింగ్ సిస్టం (బోయింగ్‌కు ఉపయోగించేది) లేదా ఎలెక్‌ట్రానిక్ సెంట్రలైజ్డ్ ఎయిర్‌క్రాఫ్ట్ మానిటర్ (ఎయిర్‌బస్‌కు), ఈ క్రింది సమాచారాన్ని పర్యవేక్షించడంలో పైలట్‌కు దోహద పడుతుంది: N1, N2 మరియు N3, ఇంధన ఉష్ణోగ్రత, ఇంధన ప్రవాహం, విద్యుత్ వ్యవస్థ, కాక్‌పిట్ లేదా కాబిన్ యొక్క ఉష్ణోగ్రత మరియు ఒత్తిడి, కంట్రోల్ సర్ఫేసెస్ ఇంకా ఇతరములు. బటన్‌ను నొక్కడం ద్వారా పైలట్ సమాచార ప్రదర్శనను ఎన్నుకోవచ్చు.

FMS[మార్చు]

ఫ్లైట్ మేనేజ్‌మెంట్ సిస్టం/కంట్రోల్ యూనిట్‌ను పైలట్ ఈ క్రింది సమాచారాన్ని ప్రవేశించి మరియు తణిఖీ చేయడానికి ఉపయోగించవచ్చు: విమాన ప్రణాళిక, వేగ నియంత్రణ, ఆకాశయాన నియంత్రణ ఇత్యాదులు.

బాక్-అప్ పరికరాలు[మార్చు]

కాక్‌పిట్‌లోని తక్కువ ప్రాముఖ్యత కలిగిన భాగంలో, ఇతర పరికరాలు పనిచేయని సందర్భంలో, ఒక బాక్-అప్ పరికరాల సమూహం, వేగం, ఎత్తు, ముందుకు పోయే విధానం, విమాన తీరుకు సంబంధించిన ప్రాథమిక విమాన సమాచారాన్ని తెలియచేయడానికి ఉంటుంది.

ఏరోస్పేస్ పరిశ్రమ యొక్క సాంకేతిక శాస్త్రాలు[మార్చు]

U.S.లో ఫెడెరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) మరియు నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA) కాక్‌పిట్ రూపకల్పనకు సంబంధించిన కార్య సిధ్ధాంత శాస్త్ర రీతులపై పరిశోధనలు చేసింది. ఇంకా విమానయాన పరిశ్రమకు సంబంధించిన ప్రమాదాల పై దర్యాప్తులు జరిపింది. కాక్‌పిట్ రూపకల్పనకు సంబంధిచిన అధ్యయన శాఖలలో, కాగ్నిటివ్ సైన్స్, న్యూరోసైన్స్, హ్యూమన్ కంప్యూటర్ ఇంటర్ఆక్షన్, హ్యూమన్ ఫాక్టర్స్ ఇంజినియరింగ్, ఆంథ్రొపొమెట్రి మరియు ఎర్గోనోమిక్స్ (కార్య సిధ్ధాంత శాస్త్రం) ఉన్నాయి.

పూర్తిగా డిజిటల్ అయిన "గ్లాస్ కాక్‌పిట్"ను ఎయిర్‌క్రాఫ్ట్ రూపకల్పనలు ప్రమాణంగా స్వీకరించాయి. అలాంటి రూపకల్పనలలో, పరికరాలు మరియు కొలెచే సాధనాలలో, నావిగేషనల్ మాప్ డిస్‌ప్లేస్‌తో సహా, ARINC 661 అనబడే ఒక యూసర్ ఇంటర్‌ఫేస్ మార్కప్ లాంగ్వేజ్‌ను ఉపయోగిస్తారు. ఈ పరిమాణం ఒకే ఉత్పత్తిదారుడు ఉత్పత్తి చేసిన ఒక స్వతంత్ర కాక్‌పిట్ డిస్‌ప్లే వ్యవస్థకు, వివిధ ఉత్పత్తిదారులు తయారు చేసిన, డిస్‌ప్లేస్ మరియు కంట్రోల్స్ ద్వారా మద్దతునివ్వడానికి ఉపయోగపడే ఏవియానిక్స్ ఎక్విప్‌మెంట్ మరియు యూసర్ అప్ప్లికేషన్స్‌కీ మధ్య పరస్పర సంబంధాన్ని నిర్వచిస్తుంది. ఓవరాల్ డిస్‌ప్లే వ్యవస్థ మరియు దానిని నడిపించే అప్ప్లికేషన్స్ మధ్య వేర్పాటు, చెప్పుకోదగ్గ ప్రత్యక నిపుణతకీ మరియూ స్వాతంత్ర్యానికీ దోహద పడుతుంది.

వీటిని కూడా చూడండి[మార్చు]

  • గ్లాస్ కాక్‌పిట్
  • విమాన పరికరాలు

మూలాలు[మార్చు]

బాహ్య లింకులు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.