కాటూరి రవీంద్ర త్రివిక్రమ్
కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ తెలుగు కథా రచయిత, న్యాయవాది.[1]
జీవిత విశేషాలు
[మార్చు]ఆయన కృష్ణా జిల్లా లోని విజయవాడలో జూన్ 15 1946 న జన్మించాడు. ఆయన తొలికథ 1974 నవంబరు 10న ప్రచురితమైనది. ఆయన విజయవాడలో విద్యాభ్యాసం చేసి ఎయిర్ ఫోర్స్ లోఉద్యోగం నిర్వహించారు.[2] ఆయన 1955 నుండి సాహితీ ప్రస్థానం ప్రారంభించారు. 600 కు పైగా కథానికలు ప్రచురితమైనాయి. ఆయన "అంతర్యామి" శీర్షిక ద్వారా సుపరిచితులు. కథానిక, నాటిక, నాటకం, నవలిక, నవల, గీతాలు, హరికథలు వగైరా సాహిత్య ప్రక్రియల్లో విశేష కృషిచేసారు. ఆకాశవాణిలో నూరుకి పైగా నాటకాలు ప్రసారమైనాయి. దూరదర్శన్లో ప్రగతి భారతం సీరియల్, గ్రీష్మం, అమ్మలగన్నుఅమ్మ డాక్యుమెంటరీలు, "అంతర్నేత్రం" ఆధ్యాత్మిక ప్రవచనాలు, నాటికలు, ప్రసంగాలు. స్వీయ జీవన రేఖలు ప్రసారమైనాయి. ప్రముఖ పత్రికలు విశాలాంధ్ర, నది, చినుకు, వండర్ వరల్డ్, విజయవాడ ఛాంబర్, కథాకేళిల్లో లీగల్ కాలమ్స్ నిర్వహించారు. వందే గోమాతరం మాసపత్రికకు కన్సల్టెంట్ ఎడిటరుగా పనిచేసారు. అనేక సంస్థలకు న్యాయ సలహాదారుగా పనిచేసాడు. ఆయన 16 సంవత్సరాలు భారతీయ వైమానిక దళంలో (1965, 1971 యుద్ధాల్లో పాల్గొన్నారు) పనిచేసారు. 20 సంవత్సరాలు పంజాబ్ నేషనల్ బ్యాంక్లో సేవలందించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లాయరుగా జీవిత సభ్యునిగా ఉన్నారు. అంతర్జాతీయ సంస్థ లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ దుర్గ చార్టర్ ప్రెసిడెంటుగా అంతర్జాతీయ బహుమతిని పొందారు. మాజీ సైనిక జాతీయస్థాయి ఫెడరేషన్ కి వ్యవస్థాపక అధ్యక్తులుగా ఉన్నారు. జాతీయస్థాయి వినియోగదారుల ఫెడరేషన్ కి వ్యవస్థాపక అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు[3]
కథలు
[మార్చు]ఆయన కథలు వివిధ పత్రికలలో ప్రచురితమైనాయి. కథానిలయంలో కథలు లభిస్తాయి.
వివిధ పత్రికలలో ప్రచురించబడిన కథలు
[మార్చు]కథ | పత్రిక | పత్రిక అవధి | ప్రచురణ తేది |
---|---|---|---|
అక్షరాల పందిరి | రచన | మాసం | 1992-02-01 |
అరచేతిలో స్వర్గం | ఆంధ్రజ్యోతి | వారం | 1968-11-15 |
ఆద్యంతాల మధ్య ప్రేమికుడు | జ్యోతి | మాసం | 1982-09-01 |
ఆపరేషన్ విజయ్ | కథాకేళి | మాసం | 2009-07-01 |
ఇల్లాలు | ఆంధ్రపత్రిక | వారం | 1974-04-05 |
ఈ మనసేం కావాలి | జ్యోతి | వార్షిక | 1978-11-10 |
ఋణం | యువ దీపావళి | వార్షిక | 1977-11-10 |
ఎగిరే పక్షులు | జ్యోతి | వార్షిక | 1983-11-10 |
ఎన్నిక | యువ | మాసం | 1968-06-01 |
ఎర | యువ | మాసం | 1982-01-01 |
ఎవరితో లేచిపోను | చినుకు | మాసం | 2009-06-01 |
ఓం యమాయనమః | నవ్య | వారం | 2004-11-03 |
ఓన్లీ వన్ మర్డర్ | విజయ | మాసం | 1977-03-01 |
కలలుకనే కళ్లున్నాయి | ఆంధ్రప్రభ | వారం | 1973-03-07 |
కల్తీ | జ్యోతి | వార్షిక | 1979-11-10 |
కిటికీ | నవ్య | వారం | 2005-01-12 |
కోరలు | యువ | మాసం | 1985-06-01 |
కోరిక | స్వాతి | మాసం | 1984-04-01 |
గాయపడిన ఆత్మలు | ప్రభవ | మాసం | 1978-11-01 |
గాలిమనిషి | ఆంధ్రప్రభ | వారం | 1972-06-14 |
గీత కటూ ఇటూ | యువ దీపావళి | వార్షిక | 1982-11-10 |
గుడ్ బై | జ్యోతి | మాసం | 1978-04-01 |
గూడు బయట పక్షులు | విజయ | మాసం | 1981-01-01 |
గొడుగు | ఆంధ్రపత్రిక | వారం | 1976-10-29 |
గొడుగులో వాన | విశాలాంధ్ర | రోజూ | 2008-03-23 |
గ్రీన్ లైట్ | చినుకు | మాసం | 2009-05-01 |
చుట్టమై వచ్చి | ఆంధ్రపత్రిక | వారం | 1972-04-21 |
చెట్టునీడ | జాగృతి | వార్షిక | 1994-11-06 |
జగన్నాటకం | చతుర | మాసం | 1979-06-01 |
జననీ, జన్మభూమి | యువ | మాసం | 1984-03-01 |
జీవితం చేప్పిన కథలు | మల్లెతీగ | మాసం | 2008-08-01 |
జోళ్లు | ఆంధ్రపత్రిక | వారం | 1974-06-28 |
టోలోలింగ్ | కథాకేళి | మాసం | 2006-04-01 |
డప్పు | ఆంధ్రప్రభ | వారం | 1993-09-01 |
డబ్బు చెట్టు | నడుస్తున్న చరిత్ర | మాసం | 1998-08-01 |
డబ్బుకి కూడా హెచ్చుతగ్గులు! | ఆంధ్రప్రభ | వారం | 1980-12-31 |
తెల్లకాకి | జాగృతి | వార్షిక | 1984-07-12 |
దశావతారాలు | యువ దీపావళి | వార్షిక | 1980-11-10 |
దిక్సూచి | యువ దీపావళి | వార్షిక | 1983-11-10 |
దుప్పటి | విజయ | మాసం | 1980-03-01 |
నగ్నశిఖరాలు | యువ దీపావళి | వార్షిక | 1981-11-10 |
నన్ను ప్రేమించకు | జ్యోతి | మాసం | 1986-01-01 |
నవ్వు | ఆంధ్రప్రభ | వారం | 1985-05-01 |
నాలుగో కోతి | యువ దీపావళి | వార్షిక | 1978-11-10 |
నాసీటు గోవిందా | క్రోక్విల్ హాస్యప్రియ | పక్షం | 1982-11-01 |
నిర్ణయం | యువ దీపావళి | వార్షిక | 1979-11-10 |
నిలువెత్తు నిజాయితీ | ఆంధ్రప్రభ | వారం | 1973-03-28 |
నివురుగప్పిన నిజాయితీ | యువ | మాసం | 1970-01-01 |
నీళ్లు | ఆంధ్రప్రభ | వారం | 1974-10-30 |
నీళ్ళు (నాకు నచ్చిన నా కథ) | యువ | మాసం | 1983-06-01 |
పాపం అరుణ | ప్రగతి | వారం | 1969-12-19 |
పాలగ్లాసు | యువ | మాసం | 1968-10-01 |
పిడికిట్లో నీళ్లు | జ్యోతి | వార్షిక | 1980-11-10 |
పుత్రికా కామేష్టి | చినుకు | మాసం | 2009-04-01 |
పునాది | ఆంధ్రపత్రిక | వారం | 1969-04-04 |
పేదవాని పెదవి | సృజన | మాసం | 1969-11-01 |
ప్రతిబింబాలు | ఆంధ్రప్రభ | వారం | 1975-11-05 |
బతుకుబండి | విశాలాంధ్ర | రోజూ | 2008-07-06 |
బిచ్చగాళ్లు | యువ | మాసం | 1981-09-01 |
బుల్లి పేషంట్ | విపుల | మాసం | 2005-11-01 |
బూచబ్బాయ్ | నీలిమ | మాసం | 1977-11-01 |
భార్య | ప్రగతి | వారం | 1970-07-31 |
మనసు మనిషి | ఆంధ్రప్రభ | వారం | 1971-01-06 |
మనసుచెప్పిన కథ | జ్యోతి | మాసం | 1979-09-01 |
మనిషి మమత | ఆంధ్రప్రభ | వారం | 1974-03-20 |
మనిషిలో మనిషి | విపుల | మాసం | 2004-10-01 |
మనిషీ మనిషీ మధ్య | జ్యోతి | మాసం | 1973-06-01 |
మలిగిన దీపాలు | ఆంధ్రప్రభ | వారం | 1981-05-06 |
మలుపు | యువ దీపావళి | వార్షిక | 1985-11-10 |
మహాయోధుడు | యువ | మాసం | 1977-10-01 |
మాతెలుగు తల్లికి మల్లెపూదండ | జాగృతి | వార్షిక | 1993-11-08 |
మేము బానిసను కాను | కథాకేళి | మాసం | 2006-08-01 |
మైదానం | చినుకు | మాసం | 2010-01-01 |
రాజు-పేద | జ్యోతి | వార్షిక | 1974-11-10 |
రుక్మిణి మొగుడు | జ్యోతి | మాసం | 1972-12-01 |
రెక్కలు | ఆంధ్రప్రభ | ఆదివారం | 1993-01-10 |
రేపటి సూర్యుడు | స్వాతి | మాసం | 1998-11-01 |
రేపు | ఆంధ్రప్రభ | వారం | 1980-11-26 |
వడ్డీకాసులు | ప్రత్యేక సంచికలు | ప్రత్యేకం | 1989-01-01 |
వాంటెడ్... | ప్రగతి | వారం | 1970-01-09 |
విజేత | యువ | మాసం | 1982-12-01 |
వెన్నెల కాటు | ఉదయం | వారం | 1989-09-15 |
వెన్నెల కోవెల | జాగృతి | వార్షిక | 2001-11-12 |
వేలం | జ్యోతి | మాసం | 1982-02-01 |
శవాలు | స్వాతి | మాసం | 1970-11-01 |
సుజాత | ప్రగతి | వారం | 1972-08-11 |
సూటులో మనిషి | ఆంధ్రప్రభ | వారం | 1975-01-22 |
స్నేహలత | అభిసారిక | మాసం | 1989-01-01 |
హాట్ హోమ్ | జ్యోతి | మాసం | 1969-05-01 |
హాలికులైననేమి | యువ | మాసం | 1969-03-01 |
హీరో | చినుకు | మాసం | 2009-02-01 |
మూలాలు
[మార్చు]- ↑ "కినిగెలో ఆయన పుస్తకాల వివరాలు". Archived from the original on 2017-03-26. Retrieved 2016-11-18.
- ↑ రచయిత: కాటూరి రవీంద్ర త్రివిక్రమ్
- ↑ Katuru Ravindra Trivikram Kathanikalu పుస్తకంలో వివరాలు[permanent dead link]