కాట ఆమ్రపాలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాట ఆమ్రపాలి
జననంనవంబర్ 4,1982
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
వృత్తిIAS అధికారిణి
భార్య / భర్తసమీర్ శర్మ. ఐఏఎస్
తల్లిదండ్రులుకాటా వెంకట్ రెడ్డి, పద్మావతి

కాట ఆమ్రపాలి తెలంగాణ కేడర్ కు చెందిన 2010 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్‌) అధికారిణి. ఆమె "యువ డైనమిక్ ఆఫీసర్"గా పేరుగాంచింది. ఆమె వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ గా నియమించబడిన తొలి మహిళ ఐఏఎస్‌ అధికారిణి.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆమ్రపాలి 1982, నవంబరు 4న ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో కాట వెంకట్ రెడ్డి, పద్మావతి దంపతులకు జన్మించింది.[2] ఆమె తండ్రి ఒక విశ్రాంత ప్రొఫెసర్. ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర బోధకుడిగా పనిచేశారు.[3] ఆమె పాటశాల విద్యాభ్యాసమంతా విశాఖపట్నంలోని సాయి సత్య మందిర్ స్కూల్ లో జరిగింది. తర్వాత ఆమె చెన్నైలోని "ఐఐటి మద్రాస్" నుండి ఇంజనీరింగ్ లో పట్టభద్రురాలైంది. "IIM” బెంగుళూరు నుండి మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో పట్టభద్రురాలైంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఆల్ ఇండియా 39 వ ర్యాంక్ ను సాధించి, ఐఏఎస్ కు ఎంపికైన అతి పిన్నవయస్కుల్లో ఒకరు ఆమె.

ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో పరిపాలనా శిక్షణను పూర్తి చేసిన తరువాత ఆమె తన పరిశీలనలో శిక్షణ పొందింది. ఆ తర్వాత ఆమె ముందుగా వికారాబాద్ సబ్‌కలెక్టర్‌గా పనిచేసి, ఆ తరువాత స్త్రీ, శిశు సంక్షేమ శాఖ హైదరాబాద్‌లో పనిచేశారు. 2015 జనవరి నుంచి ఆమె రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత 2016లో తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆమెకు పదోన్నతి కల్పిస్తూ వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల కలెక్టర్‌గా పని చేసింది.

ఆమ్రపాలి ఆ తరువాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నగర కమిషనర్‌గా, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ లో జాయింట్ సీఈవోగా బాధ్యతలు నిర్వహించి ఆ తరువాత కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి వద్ద ప్రైవేట్ సెక్రటరీగా పని చేసి ఆ తర్వాత 2020 నుండి ప్రధాని కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా ఎంపిక చేసింది.

ఆమ్రపాలి 2023 తెలంగాణ ఎన్నికల అనంతరం కేంద్ర సర్వీస్ నుంచి రిలీవ్ అయ్యి మళ్లీ తెలంగాణకు వచ్చి 2023 డిసెంబర్ 14న హెచ్ఎండీఏ (HMDA) కమిషనర్‌గా, మూసీ అభివృద్ధి సంస్థ ఇన్‌చార్జ్‌ ఎండీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.[4][5] ఆమె 2024 జూన్ 24న ఐఏఎస్ అధికారుల బదిలీలలో భాగంగా ఆమెను జీహెచ్ఎంసీ కమిషనర్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[6]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (14 September 2020). "ఐఏఎస్‌ అధికారిణి 'ఆమ్రపాలి' కుటుంబ నేప‌థ్యం..స‌క్సెస్ జ‌ర్నీ ఇలా." www.sakshieducation.com. Archived from the original on 1 జూన్ 2021. Retrieved 1 June 2021.
  2. Sakshi Education (1 January 2022). "Amrapali, IAS : ఆమ్రపాలి స‌క్సెస్ జ‌ర్నీ.. స్వగ్రామం.. కుటుంబ నేప‌థ్యం ఇదే..?". Archived from the original on 14 December 2023. Retrieved 14 December 2023.
  3. సాక్షి, ఆంధ్రప్రదేశ్, ప్రకాశం (31 January 2018). "ఆమ్రపాలి మన ఆడపడుచే!". Retrieved 21 March 2018.{{cite news}}: CS1 maint: multiple names: authors list (link)
  4. TV9 Telugu (14 December 2023). "IAS Amrapali: తెలంగాణకు ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి.. కీలక పదవి ఇచ్చిన రేవంత్ సర్కార్." Archived from the original on 14 December 2023. Retrieved 14 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. Andhrajyothy (14 December 2023). "ఐఏఎస్‌లకు పదోన్నతులు, బదిలీలు.. HMDA కమిషనర్‌గా ఆమ్రపాలి". Archived from the original on 14 December 2023. Retrieved 14 December 2023.
  6. Eenadu (24 June 2024). "తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలి". Archived from the original on 24 June 2024. Retrieved 24 June 2024.

ఇతర లింకులు

[మార్చు]