కాదల్ సంధ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాదల్ సంధ్య
జననం
రేవతి

(1988-09-27) 1988 సెప్టెంబరు 27 (వయసు 35)[1]
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2004–2016
జీవిత భాగస్వామి
అర్జున్
(m. 2015)
పిల్లలు1

సంధ్య (జననం 1988 సెప్టెంబరు 27), ఆమె ఒక భారతీయ మాజీ నటి. ఆమె ప్రధానంగా తమిళ చిత్ర పరిశ్రమలో, కొన్ని మలయాళం, తెలుగు, కన్నడ చిత్రాలలో నటించింది. ఆమె, తన మొదటి సినిమా పేరుతో కాదల్ సంధ్యగా ప్రసిద్ధి చెందింది.

ప్రారంభ జీవితం[మార్చు]

ఆమె 1988 సెప్టెంబరు 27న కేరళలోని త్రివేండ్రంలో జన్మించింది. ఆమె తండ్రి అజిత్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఉద్యోగి, కాగా తల్లి మాయ బ్యూటీషియన్. ఆమెకు రాహుల్ అనే అన్నయ్య ఉన్నాడు.[2] ఆమె 9వ తరగతి పూర్తిచేసే వరకు చెన్నైలోని విద్యోదయ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో చదివింది.

కెరీర్[మార్చు]

తమిళ ప్రేమకథా చిత్రం కాదల్‌ (2004)లో నటించినప్పుడు ఆమె ఇంకా చదువుకుంటోంది.[3][4][5] ఆ సినిమా విజయం తర్వాత, 2004లో, ఆమె నటుడు జయరామ్ సోదరిగా ఆలిస్ ఇన్ వండర్‌ల్యాండ్ అనే మలయాళ చిత్రంలో నటించింది. ఆ తర్వాత జీవాతో సంగీత రొమాన్స్ డిష్యుమ్ (2006) వచ్చింది. ఆమె మూడవ తమిళ చిత్రం, వల్లవన్‌లో, ఆమె ఒక చిన్న పాత్ర మాత్రమే చేసింది, ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించింది.

ఆమె భరత్‌తో కలిసి కూడల్ నగర్‌లో కూడా నటించింది. సైకిల్ (2008) విజయం తర్వాత ఆమె మలయాళ సినిమాపై దృష్టి సారించింది. ఆమె మంజల్ వేయిల్ చిత్రానికి నేపథ్య గాయకురాలిగా రంగప్రవేశం చేసింది.[6] 2010లో, పి. వాసు దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం ఆప్తరక్షకలో విష్ణువర్ధన్ సరసన ఆమె ఒక పాత్రలో కనిపించింది.

ఆమె తరుణ్ గోపి సూధాతం చిత్రంతో చాలా కాలవ విరామం తరవాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.[7][8] ఆమె ఆసియానెట్‌లోని కామెడీ స్టార్స్, లిటిల్ స్టార్స్‌తో సహా అనేక రియాలిటీ షోలలో న్యాయనిర్ణేతగా వ్యవహరించింది.

వ్యక్తిగత జీవితం[మార్చు]

సంధ్య 2015 డిసెంబరు 6న చెన్నైకి చెందిన ఐటీ ఉద్యోగి అర్జున్‌ని వివాహం చేసుకుంది. ఈ వేడుక గురువాయూర్ ఆలయంలో జరిగింది. ఈ దంపతులకు 2016 సెప్టెంబరు 27న ఒక కుమార్తె జన్మించింది.[9]

ఫిల్మోగ్రఫీ[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర భాష నోట్స్
2004 కాదల్ ఐశ్వర్య రాజేంద్రన్ తమిళం ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు – తమిళం

తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు ప్రత్యేక బహుమతి

2005 ఆలిస్ ఇన్ వండర్ల్యాండ్ ఆలిస్ మలయాళం
2006 డిష్యుమ్ సింథ్యా జయచంద్రన్ తమిళం తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు ప్రత్యేక బహుమతి

ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు – తమిళం - నామినేట్ చేయబడింది

2006 ప్రజాపతి మాలు మలయాళం
2006 వల్లవన్ సుచిత్ర తమిళం
2006 అన్నవరం వరలక్ష్మి (వరం) తెలుగు ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు – తెలుగు
2007 కూడల్ నగర్ తమిళ్ సెల్వి తమిళం
2007 కన్నమూచి యేనాడ దేవసేన ఆరుముగం
2008 సైకిల్ మీన్కాశీ కౌష్టుభన్ మలయాళం
2008 తూండిల్ అంజలి శ్రీరామ్ తమిళం
2008 వెల్లి తిరై ఆమెనే అతిధి పాత్ర
2008 మహేష్, శరణ్య మాత్రం పలర్ శరణ్య
2009 నంద కావ్య కన్నడ
2009 మంజల్ వేయిల్ గాయత్రి తమిళం
2009 ఒడిపోలామా అంజలి
2010 ఆప్తరక్షకుడు గౌరీ కన్నడ
2010 ఇరుంబుక్కోట్టై మురట్టు సింగం తుంబి తమిళం
2010 హాసిని హాసిని తెలుగు
2010 కాలేజ్ డేస్ అను మలయాళం
2010 సహస్రం సుప్రియ, శ్రీదేవి
2011 ట్రాఫిక్ అదితి
2011 త్రీ కింగ్స్ మంజు
2011 D - 17 సంధ్య
2012 మాస్టర్స్ నియా పొన్నూస్
2012 వీండం కన్నూర్ రాధిక
2012 పద్మశ్రీ భరత్ డాక్టర్ సరోజ్ కుమార్ నటి ప్రత్యేక ప్రదర్శన
2012 హిట్‌లిస్ట్ గౌరీ విక్రమ్
2013 బెంకి బిరుగాలి సంధ్య కన్నడ
2013 పైసా పైసా కుముదం మలయాళం
2013 యా యా కనక తమిళం
2013 ఫర్ సేల్ డయానా మలయాళం
2013 సూదత్తం తమిళం
2013 సెకండ్ ఇన్నింగ్స్ మలయాళం
2014 మై డియర్ మమ్మీ
2014 లాంగ్ సైట్
2014 పారిస్ పయ్యన్స్
2014 పూజయుం కన్నడియుమ్
2015 తునై ముధల్వార్ రుక్మణి తమిళం
2015 కత్తుక్కుట్టి ఐటం డాన్సర్ ప్రత్యేక ప్రదర్శన
2015 వెరి: తిమిరు 2
2016 వెట్టా షెరిన్ మెల్విన్ మలయాళం
2016 అవరుడే వీడు వీణ
2016 రుత్రావతి తమిళం

మూలాలు[మార్చు]

  1. Arjun (25 December 2009). "Merry days are here". The Hindu. Chennai. Retrieved 21 December 2011.
  2. "'കുട്ടികാജോള്‍' പേശ്‌റേന്‍ , Interview - Mathrubhumi Movies". Mathrubhumi (in మలయాళం). Archived from the original on 19 December 2013. Retrieved 2013-12-19.
  3. "DIRECTOR BALAJI SAKTHIVEL INTERVIEW - Behindwoods.com - Interview Director Balaji Sakthivel Balaji Sakthivel Directed Movies Samurai Kaadhal Kalloori Rajinikanth starrer Sivaji The Boss Directing 2004 film Kaadhal Balaji Sakthivel an assistant director S.Shankar Samurai for Vikram Kaadhal S Pictures banner Production house of Shankar Native is Dindugal Images". Behindwoods.com. Retrieved 2022-08-09.
  4. "Varalaxmi Sarathkumar opens up about her movies before Podaa Podi". 4 May 2020.
  5. Rangarajan, Malathi (31 March 2012). "Awaiting the monsoon". The Hindu.
  6. "Hot News". Cine South. 14 March 2007. Archived from the original on 17 March 2007.
  7. Raghavan, Nikhil (7 October 2013). "Shotcuts: Gaining experience". The Hindu. Chennai, India.
  8. George, Vijay (11 April 2013). "Turning a new leaf". The Hindu. Chennai, India.
  9. "Kadhal Sandhya gives birth to baby girl on birthday". The Times of India. 29 September 2016. Retrieved 2023-01-11.