Jump to content

కానిస్టేబుల్ కూతురు

వికీపీడియా నుండి
(కానిస్టేబులు కూతురు నుండి దారిమార్పు చెందింది)

కానిస్టేబుల్ కూతురు ,1963 మే31 విడుదల.కాంతారావు,కృష్ణకుమారి , జంటగా నటించిన ఈ చిత్రంకు, తాపీ చాణక్య దర్శకత్వం వహించారు.సంగీతం ఆర్.గోవర్దన్ అందించారు.

కానిస్టేబులు కూతురు
(1963 తెలుగు సినిమా)
దర్శకత్వం తాపీ చాణక్య
నిర్మాణం చెళ్ళపిళ్ళ సత్యం
కథ బి.ఎస్‌.రామయ్య
తారాగణం కాంతారావు,
కృష్ణకుమారి,
కొంగర జగ్గయ్య,
గుమ్మడి,
చిత్తూరు నాగయ్య,
రాజబాబు,
రాజశ్రీ,
రమణారెడ్డి,
శాంతకుమారి,
సురభి బాలసరస్వతి
సంగీతం గోవర్ధన్‌
నేపథ్య గానం ఘంటసాల,
పి.బి.శ్రీనివాస్‌,
పిఠాపురం,
పి.సుశీల,
ఎస్.జానకి,
ఎల్‌.ఆర్‌.ఈశ్వరి
గీతరచన ఆత్రేయ,
ఆరుద్ర,
అనిశెట్టి
సంభాషణలు ఆచార్య ఆత్రేయ
నిర్మాణ సంస్థ చిత్ర కళ
భాష తెలుగు

కథాంశం

[మార్చు]

గోపి (జగ్గయ్య) జానకి (కృష్ణకుమారి) అన్నా చెల్లెలుగా, కానిస్టేబులు ధర్మయ్య (గుమ్మడి వెంకటేశ్వరరావు) వారి తండ్రిగా నటించిన చిత్రం 'కానిస్టేబులు కూతురు'. గోపి స్నేహితుడైన రఘు (కాంతారావు) షావుకారు వెంకట్రామయ్య (నాగయ్య) కుమారుడు. రఘు అల్లరి చిల్లరగా తిరగటం, చెడు సహవాసాలతో జీవితం పాడు చేసుకోవడం తండ్రికి నచ్చదు. గోపి ఇంటికి వచ్చిన రఘు జానకిని చూస్తాడు. ఇద్దరూ ప్రేమలో పడతారు. రఘు మంచిగా మారే ప్రయత్నం చేస్తుంటే స్నేహితులు బ్లాక్‌మెయిల్‌ చేయడం ప్రారంభిస్తారు. తన మేనకోడలు మల్లిక (రాజశ్రీ)తో కొడుకు రఘు పెళ్ళి చేయాలని తలుస్తాడు. అది కుదరక రఘు మల్లికను చేసుకుంటేనే ఆస్తి దక్కుతుందని, లేకుంటే మల్లికనే చెందుతుందని రాసేస్తాడు వెంకట్రామయ్య. రఘు హత్యానేరంలో ఇరుక్కుంటాడు.

తారాగణం

[మార్చు]
  • కొంగర జగ్గయ్య_గోపీ
  • కృష్ణకుమారి_ జానకి
  • కాంతారావు_రఘు
  • గుమ్మడి వెంకటేశ్వరరావు_ ధర్మయ్య
  • రాజశ్రీ
  • జయలలిత
  • ఉప్పలదడియం నాగయ్య
  • రాజబాబు
  • తిక్కవరపు వెంకట రమణారెడ్డి
  • శాంతకుమారి
  • సురభి బాలసరస్వతి

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: తాపీ చాణక్య
  • కథ: బి ఎస్.రామయ్య
  • సంగీతం: ఆర్.గోవర్థన్
  • మాటలు: ఆచార్య ఆత్రేయ
  • పాటలు: చెరువు ఆంజనేయశాస్త్రి, అనిశెట్టి సుబ్బారావు,ఆచార్య ఆత్రేయ
  • నేపథ్య గానం: ప్రతివాది భయంకర శ్రీనివాస్, ఘంటసాల వెంకటేశ్వరరావు, పిఠాపురం నాగేశ్వరరావు, పులపాక సుశీల, ఎల్ ఆర్ ఈశ్వరి, పుణ్యవతి, టి.ఆర్.జయదేవ్
  • ఛాయా గ్రహణం: అన్నయ్య
  • ఆర్ట్: అలగప్పన్
  • ఎడిటింగ్: ఎన్.ఎం.శంకర్
  • నిర్మాతలు: చెళ్లపిళ్ల సత్యం, నంజండన్
  • నిర్మాణ సంస్థ:చిత్రకళా
  • విడుదల:31:05:1963.

పాటల జాబితా

[మార్చు]

1.కళ్ళల్లో నీరెందులకు గానం. ఘంటసాల, సుశీల రచన: ఆత్రేయ .

2.పువ్వు వలె విరబూయ వలె , గానం, పి.బి . శ్రీనివాస్, సుశీల , రచన:ఆత్రేయ

3.అందంకోసం కన్నులు ఆనందం, పి.సుశీల , పి.బి.శ్రీనివాస్ బృందం, రచన: చెరువు ఆంజనేయ శాస్త్రి

4.చిగురాకుల ఊయలలో ఇలమరచిన , పి.సుశీల, పి.బి.శ్రీనివాస్, రచన: అనిశెట్టి సుబ్బారావు

5.పుడితేను పురుషుడుగా పుటకే కోరవద్దు, పిఠాపురం , ఎల్.ఆర్.ఈశ్వరి , రచన: ఆత్రేయ

6.పూలు ముడచి పుడమి విడిచి పోతున్నావా పుణ్యవతి , టీ.ఆర్.జయదేవ్

7.వెన్నెలకేలా నాపై కోపం సెగలై , పి.బి శ్రీనివాస్ , రచన: ఆత్రేయ .

మూలాలు

[మార్చు]