కానూ గాంధీ (శాస్త్రవేత్త)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కానూ గాంధీ (c. 1929 - 7 నవంబరు 2016) భారతీయ శాస్త్రవేత్త. ఆయన నాసా లో శాస్త్రవేత్తగా పనిచేసాడు. ఆయన మహాత్మా గాంధీ మనుమడు. ఆయన మహాత్మా గాంధీ కుమారుడైన రామదాస్ గాంధీ యొక్క కుమారుడు. [1][2] ఆయన మహాత్మాగాంధీ అత్యంత సన్నిహితుల్లో ఒకడు. చిన్నప్పుడు గాంధీ వ్యక్తిగత అవసరాలను కూడా కానూయే చూసుకునేవారు.

జీవిత విశేషాలు[మార్చు]

భీమిలి బీచ్ లో మహాత్మాగాంధీ విగ్రహం

ఆయన గాంధీజీ మూడో కుమారుడు రాందాస్‌ గాంధీ పుత్రుడు. భారత దేశానికి స్వతంత్రం వచ్చాక తదనంతర పరిణామాల్లో అప్పటి భారత్‌లో అమెరికా రాయబారి జాన్ కెన్నెత్ సాయంతో మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉన్నతవిద్యనభ్యసించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత నాసా, అమెరికా రక్షణ శాఖలో ఉద్యోగం చేశారు. ఆయన మెడికల్ రీసెర్చర్ అయిన శివలక్ష్మి ని వివాహం చేసుకున్నారు. ఉప్పు సత్యాగ్రహానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన ఆయనకు భార్య తప్ప నా అనే వారు ఎవరూ లేరు. 40 ఏళ్లపాటు అమెరికాలో ఉన్న కానూ దంపతులు 2014లో భారత్‌కు తిరిగి వచ్చారు. వీరికి సంతానం లేదు. ఉద్యోగం ద్వారా సంపాదించినది దానధర్మాలకు ఖర్చు చేయడంతో చేతిలో చిల్లిగవ్వలేని దీనస్థితికి చేరుకున్నారు. ఈక్రమంలో అనారోగ్యం పాలైన ఆయన ఆలయ ట్రస్ట్‌ ఆధ్వర్యంలోని ఆస్పత్రిలో చికిత్స పొందారు. అక్టోబరు 22, 2016 న వచ్చిన గుండెపోటు కారణంగా కానూ పక్షవాతానికి గురయ్యారు. ఫలితంగా ఎడమవైపు శరీర భాగం చచ్చుబడిపోయింది. వెంటిలేటర్‌పై ఉన్న ఆయన పరిస్థితి మరింత విషమించడంతో కన్నుమూశారు.[3]

దండి సత్యాగ్రహంలో[మార్చు]

1930 మార్చి-ఏప్రిల్ లో జరిగిన దండి సత్యాగ్రహ సమయంలో గుజరాత్ లోని దండి గ్రామంలో మహాత్మాగాంధీ తో కలసి చిన్నారి కనూ గాంధీ నడిచి వెళ్తున్న ఫోటో బాగా ప్రాచుర్యంలోనికి వచ్చింది.[4]

మూలాలు[మార్చు]

  1. "Modi leads wave of tributes to Mahatma Gandhi's grandson". dailymail.co.uk. Retrieved 8 November 2016.
  2. "Mahatma's grandson Kanu Gandhi passes away". 8 November 2016. Retrieved 8 November 2016 – via The Hindu.
  3. మహాత్మా గాంధీ మనుమడు కానూభాయ్‌ కన్నుమూత
  4. కనూ గాంధీ ఇకమనకు లేరు[permanent dead link]

ఇతర లింకులు[మార్చు]