రామదాస్ గాంధీ
రామదాస్ గాంధీ | |
---|---|
జననం | రామదాస్ మోహనదాస్ గాంధీ 1897 జనవరి 2 కాలనీ ఆఫ్ నాటల్ |
మరణం | 1969 ఏప్రిల్ 14 పూనా, మహారాష్ట్ర, ఇండియా. | (వయసు 72)
జాతీయత | భారతీయుడు |
జీవిత భాగస్వామి | నిర్మల |
పిల్లలు | 3, కానూ తో సహా |
తల్లిదండ్రులు |
|
బంధువులు | హరిలాల్ గాంధీ, మణిలాల్ గాంధీ, దేవదాస్ గాంధీ (సోదరులు) |
రాందాస్ గాంధీ (1897 – ఏప్రిల్ 14 1969) మహాత్మాగాంధీ యొక్క మూడవ కుమారుడు. ఆయన దక్షిణ ఆఫ్రికా లో జన్మించారు. ఆయన తన తల్లిదండ్రులు, సోదరుల కంటే ఎక్కువకాలం జీవించారు. ఆయన, ఆయన భార్య నిర్మలా లకు ముగ్గుకు కుమారులు;వారు సుమిత్రా గాంధీ,కానూ గాంధీ, ఉషా గాంధీ. ఆయన తన తండ్రితో పాటు భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు.
ఆయనకు సన్యాసం పట్ల అభిరుచి లేదు. కానీ 1930 లలో జరిగిన పౌర నిరసనలలో పాల్గొన్నాడు. అనేక జైలు శిక్షలు అతని ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాలను చూపించాయి. దక్షిణాఫ్రికాలో పెరిగిన అతను తన తండ్రి విధించిన ఆదర్శవాద పేదరికంతో ఎప్పుడూ సర్దుబాటు చేసుకోలేకపోయాడు. అతనికి వేటపై అభిరుచి ఉండేది.
తన తండ్రి అంత్యక్రియల్లో, మహాత్ముడు కోరినట్లుగా, దహన సంస్కారాలలో చితికి నిప్పు పెట్టినది రామ్‌దాస్ గాంధీ. అతను తన సోదరుడు దేవదాస్ గాంధీతో పాటు అంత్యక్రియలలో పాల్గొన్నాడు.
అతను తన తండ్రి మరణించిన శతాబ్ది సంవత్సరంలో మరణించాడు.