మణిలాల్ గాంధీ
మణిలాల్ గాంధీ | |
---|---|
జననం | |
మరణం | 1956 ఏప్రిల్ 5 | (వయసు 63)
జీవిత భాగస్వామి | సుశీల మశ్రువాలా (1927-1956) |
పిల్లలు | సీత (1928) ఈలా గాంధీ (1940) అరుణ్ మణిలాల్ గాంధీ (1934) |
తల్లిదండ్రులు | మహాత్మా గాంధీ కస్తూరిబాయి గాంధీ |
మణిలాల్ మోహనదాస్ గాంధీ (అక్టోబరు 28 1892 – ఏప్రిల్ 5 1956[1][2])మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ, కస్తూరిబాయి గాంధీ ల రెండవ కుమారుడు. ఈయన బ్రిటిష్ ఇండియాలో రాజకోట్ లో జన్మించారు. 1897 లో మణిలాల్ గాంధీ మొదటిసారి దక్షిణ ఆఫ్రికాకు ప్రయాణమయ్యారు. అచట డర్బన్ వద్ద ఫోయినిక్స్ ఆశ్రమం లో పనిచేస్తూ గడిపారు. భారత దేశ పర్యటనల అనంతరం 1917 లో మణిలాల్ గాంధీ మరల దక్షిణాఫ్రికా కు వెళ్ళి "గుజరాతీ-ఇంగ్లీషు" కు చెందిన "ఇండియన్ ఒపీనియన్" అనే వారపత్రిక లో ముద్రణా సహాయకునిగా పనిచేశారు. 1918 లో మణిలాల్ ఆ ముద్రణా సంస్థకు విశేష సేవలందించారు. అనంతరం 1920 లో ఆ పత్రికకు సంపాదకునిగా ఎదిగారు. ఆయన తండ్రి మహాత్మా గాంధీ వలెనే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి అనేక సార్లు జైలు శిక్ష అనుభవించారు. ఆయన 1956 వరకు (ఆయన మరనం వరకూ) ఆ పత్రికకు సంపాదకునిగానే ఉన్నారు. ఆయన "సెరెబ్రల్ థ్రోంబోసిస్" అనే వ్యాధితో మరణించారు.
వారసత్వం
[మార్చు]1927 లో మణిలాల్ గాంధీ "సుశీల మశ్రువాల"ను వివాహమాడారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు. వారు సీత(1928) ,ఈలా గాంధీ (1940), అరుణ్ మణిలాల్ గాంధీ(1934). అరుణ్ మణిలాల్, ఎలా గాంధీలు సామాజిక-రాజకీయ కార్యకర్తలు. సమాజ సేవకులు. సీత కుమార్తె అయిన ఉమా డి.మెస్త్రీ యిటీవల "మణిలాల్ గాంధీ జీవిత చరిత్ర" పై ఒక పుస్తకాన్ని ప్రచురించారు.[3]
నోట్సు
[మార్చు]- ↑ http://lccn.loc.gov/n90712835
- ↑ Dhupelia-Mesthrie: Gandhi’s Prisoner? The Life of Gandhi’s Son Manilal, p. 384
- ↑ Uma Dhupelia Mesthrie, Gandhi’s Prisoner? The Life of Gandhi’s Son Manilal. (Permanent Black: Cape Town, South Africa, 2003).
మూలాలు
[మార్చు]- Mesthrie, Uma Dhupelia. Gandhi’s Prisoner? The Life of Gandhi’s Son Manilal. Permanent Black: Cape Town, South Africa, 2003.
- Dhupelia-Mesthrie, Uma, “Writing the Life of Manilal Mohandas Gandhi,” Journal of Natal and Zulu History 24 & 25 (2006-2007): 188-213.
వెలుపలి లంకెలు
[మార్చు]- Interview of Ela Gandhi
- The African Activist Archive Project website has an Interview with Manilal Gandhi conducted in South Africa in September 1954 by George M. Houser. At the time he was editor of newspaper Indian Opinion and ran the Phoenix Settlement, both established by his father. There is also a 1947 photograph of Manilal Gandhi at the Community Church of New York, a September 1954 photograph of Mr. and Mrs. Manilal Gandhi at Phoenix Settlement and a 1954 photograph of Chief Albert Luthuli and Manilal Gandhi. Four issues of the newsletter Bulletin: Americans for South African Resistance has information about him: September 1952 issue, the January 14, 1953 issue, the February 27, 1953 issue, and the March 1, 1954 issue.