కార్యసిద్ధి హనుమాన్ దేవాలయం (అమెరికా)
కార్యసిద్ధి హనుమాన్ దేవాలయం | |
---|---|
ప్రదేశం | |
దేశం: | యునైటెడ్ స్టేట్స్ |
రాష్ట్రం: | టెక్సస్ |
ప్రదేశం: | ఫ్రిస్కో |
అక్షాంశ రేఖాంశాలు: | 33°10′43″N 96°44′54″W / 33.178510°N 96.748377°W |
ఇతిహాసం | |
సృష్టికర్త: | గణపతి సచ్చిదానంద స్వామీజీ |
కార్యసిద్ధి హనుమాన్ దేవాలయం, అమెరికా టెక్సాస్‌లోని ఫ్రిస్కోలో ఉన్న ఒక హిందూ దేవాలయం. ఈ ప్రాంతంలోని అతిపెద్ద దేవాలయాలలో, ఫ్రిస్కోలోని రెండు హిందూ దేవాలయాలలో ఇదీ ఒకటి.
చరిత్ర
[మార్చు]డల్లాస్-ఫోర్ట్ వర్త్ ప్రాంతంలోని ప్రవాస భారత హిందువుల కోసం 2007లో ఈ దేవాలయ నిర్మాణం ప్రారంభమై, 2009లో[1] పూర్తయింది. ఈ దేవాలయంలోని ప్రధాన దైవం హనుమంతుడు. 2015, జూలై 23న ఈ దేవాలయం తెరవబడింది. ఒక వారం తర్వాత, ఆగస్టు 1న 24 గంటలపాటు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం చేసి ప్రపంచ రికార్డును నెలకొల్పింది.[2] గణపతి సచ్చిదానంద స్వామీజీ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమం స్వామీజి 3వ ప్రపంచ రికార్డు.
సౌకర్యాలు
[మార్చు]$11 మిలియన్ ఖర్చుతో ఈ దేవాలయంలో యోగా, కర్ణాటక సంగీతం, భారతీయ నృత్యం, భారతీయ మంత్రోచ్ఛారణలు, హిందూ మతంపై తరగతులతోపాటు పూజా సేవలు నిర్వహించబడుతున్నాయి. ఇక్కడ హిందీ, మరాఠీ, తెలుగు, తమిళం, కన్నడ, గుజరాతీ భాషలలో శిక్షణ తరగతులు కూడా ఉంటాయి.[3] ఆలయంలో ప్రార్థనా మందిరం, ఫలహారశాల, భోజనశాల, ఆడిటోరియం, వేదిక ఉన్నాయి. దేవాలయానికి 72 అడుగుల ఎత్తైన "రాజగోపురం" నిర్మించబడింది. సూర్యకాంతి ఒక చివర నుండి మరొక చివరకి వెళ్ళేలా ఈ గోపురాన్ని నిర్మించారు.[4] ఆలయం వారంలో ప్రతిరోజు తెరిచి ఉంటుంది.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Construction of $7.5 million Karya Siddhi Hanuman temple to serve growing Hindu community". August 9, 2013. Archived from the original on 2018-07-10. Retrieved 2022-03-11.
- ↑ Blumberg, Antonia (August 11, 2015). "Texas Hindu Temple Sets Guinness Record For Longest Chant". Huffington Post.
- ↑ Dallasnews Administrator (12 August 2015). "24-hour chanting marathon at Frisco temple sets Guinness record". DallasNews. Retrieved 2022-03-11.
- ↑ "architectmagazine". Retrieved 2022-03-11.
- ↑ "Karya Siddhi Hanuman Temple in Frisco". Retrieved 2022-06-27.