కాలింగ్ బెల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాలింగ్‌ బెల్‌
దర్శకత్వంపన్నా రాయల్ (పవన్ మాద్యాల)
నిర్మాతఅనూద్
తారాగణంరవివర్మ, కిషోర్, మమతా రహుత్, కిషోర్, సంకీర్త్, వ్రితి ఖన్నా
ఛాయాగ్రహణంవివేక్ ఎస్.కుమార్
కూర్పుదీప్, శ్రీ సంతోష్
సంగీతంసుకుమార్.పి
నిర్మాణ
సంస్థ
గోల్డెన్ టైమ్ పిక్చర్స్
విడుదల తేదీs
20 మార్చి, 2015
సినిమా నిడివి
128 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

కాలింగ్‌ బెల్‌ 2015లో తెలుగులో విడుదలైన హర్రర్ థ్రిల్లర్ సినిమా.[1] గోల్డెన్ టైమ్ పిక్చర్స్ బ్యాన‌ర్ పై అనూద్ నిర్మించిన ఈ సినిమాకు పన్నా రాయల్ దర్శకత్వం వహించాడు. రవివర్మ, కిషోర్, మమతా రహుత్, కిషోర్, సంకీర్త్, వ్రితి ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆడియోను 16 మార్చి, 2015న విడుదల చేసి,[2] సినిమా 20 మార్చి 2015న విడుదలైంది.[3]

కథ[మార్చు]

కార్తీక్ (రవివర్మ), వైశాలి(మమత రహుత్) కొత్తగా పెళ్ళయిన జంట. ఒకర్ని విడిచి మరొకరు వుండలేనంత ప్రేమగా వారిద్దరూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ వుంటారు. కార్తీక్ కి ఓరోజు ఓ స్వామీజీ (సమ్మెట గాంధీ) తారసపడి నువ్వు ఒక పిశాచితో కాపురం చేస్తున్నావని, ఆమె వల్ల నీ చావు తప్పదని కార్తీక్ ని హెచ్చరిస్తాడు. దాన్ని కార్తీక్ నమ్మక పోవడంతో అతను ఇంట్లో లేని సమయంలో అతని భార్య ఎలా ప్రవర్తిస్తుందో ప్రత్యక్షంగా చూపిస్తాడు. అదే రాత్రి వైశాలి తన భయానక చేష్టలతో కార్తీక్ ని చంపే ప్రయత్నం చేస్తుంది. ఆ సమయంలో స్వామీజీ వచ్చి అడ్డుకుంటాడు. కార్తీక్, స్వామీజీ కలిసి వైశాలిని చంపి ఆ ఇంటి ఆవరణలో పాతి పెడతారు. ఇక ఆ ఇంట్లో ఎవరూ వుండొద్దని స్వామీజీ చెప్పడంతో కార్తీక్ ఆ ఇంటికి తాళం వేసి హైదరాబాద్ వచ్చేస్తాడు. కార్తీక్ తమ్ముడైన విశాల్ (నరేష్) అన్నయ్యకు తెలియకుండా తన స్నేహితులు అమర్ (సంకీర్త్), హర్ష (వంశీ), నిషా (లక్కీ), రియా (వితి ఖన్నా)లతో కలిసి ఆ ఇంటికి ఎంజాయ్ చేసేందుకు వెళ్లిన వారికీ అక్కడ ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి ? వాటిని వాళ్ళు ఎలా ఎదురుకున్నారు? అనేదే మిగతా సినిమా కథ.[4]

నటీనటులు[మార్చు]

  • రవివర్మ
  • కిషోర్
  • మమతా రహుత్
  • కిషోర్
  • సంకీర్త్
  • వ్రితి ఖన్నా
  • లక్కీ
  • నరేష్ కావేటి
  • వంశీ రామ్
  • ప్రియ
  • జీవా
  • కిశోర్
  • గాంధీ సమ్మెట
  • చంటి
  • శంకర్
  • వేణు

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: గోల్డెన్ టైం పిక్చర్స్
  • నిర్మాత: అనూద్
  • ఎగ్జిక్యూటివ్ నిర్మాత: షాని సోలోమన్
  • కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: పన్నా రాయల్ (పవన్ మాద్యాల) [5]
  • సంగీతం: సుకుమార్.పి
  • సినిమాటోగ్రఫీ:వివేక్ ఎస్.కుమార్
  • మాటలు: వెంకట్ బాలగోని, పవన్ మద్యాల
  • పాటలు: వెంకట్ బాలగోని, బండి సత్యం
  • కొరియోగ్రఫీ: శ్రీను మాస్టర్
  • గాయకులూ: బాబా సెహగల్, గీత మాధురి, కార్తీక్, శ్రవణ్ భార్గవి, ప్రణవి
  • ఆర్ట్ డైరెక్టర్ : మౌళి

మూలాలు[మార్చు]

  1. "హారర్ బెల్". 10 March 2015. Archived from the original on 25 సెప్టెంబరు 2021. Retrieved 25 September 2021.
  2. "పాటల బెల్ మోగింది..." 16 March 2015. Archived from the original on 25 సెప్టెంబరు 2021. Retrieved 25 September 2021.
  3. "Calling Bell Movie: Showtimes". 20 March 2015. Archived from the original on 25 సెప్టెంబరు 2021. Retrieved 25 September 2021.
  4. "Calling Bell review. Calling Bell Telugu movie review, story, rating". 26 March 2015. Archived from the original on 8 అక్టోబరు 2017. Retrieved 25 September 2021.
  5. Sakshi (31 March 2015). "థ్రిల్ చేస్తా!". Archived from the original on 25 సెప్టెంబరు 2021. Retrieved 25 September 2021.