పన్నా రాయల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పన్నా రాయల్ టాలీవుడ్ యువ దర్శకుల్లో ఒకరు.[1]

జివిత విశేషాలు[మార్చు]

నెల్లూరులో జన్మించిన ఈ దర్శకుడు, కడపలో చదువుకున్నారు. ఆ తర్వాత ముంబయిలో స్థిరపడ్డారు. ఇతని అసలు పేరు పవన్. ఉద్యోగ రీత్యా వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్ అయిన రాయల్, తెలుగు సినిమాల మీద ఆసక్తితో చిత్రరంగంలోకి ప్రవేశించారు. తొలుత చిన్న సినిమాతో తన కెరీర్‌ను ప్రారంభించాలని భావించిన రాయల్, కాలింగ్ బెల్ అనే పేరుతో 2015లో ఒక హారర్ సినిమాకి దర్శకత్వం వహించారు.

తను ఎవరి దగ్గరా కనీసం అసిస్టెంట్ డైరెక్టరుగా కూడా పనిచేయకుండానే, కేవలం వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్‌గా చేసిన అనుభవంతోనే దర్శకత్వం చేశానని చెబుతుంటారు రాయల్. 2016లో కాలింగ్ బెల్ సినిమాకి సీక్వెల్ తీసే ప్రయత్నంలో ఉన్నారు ఈ యువ దర్శకుడు.

మూలాలు[మార్చు]