Jump to content

కాలిబ్రె (సాఫ్ట్వేర్)

వికీపీడియా నుండి
కాలిబ్రె
కాలిబ్రై ప్రధాన తెరరూపం
సాఫ్టువేర్ అభివృద్ధికారుడుకోవిద్ గోయల్
ప్రారంభ విడుదలఅక్టోబరు 31, 2006; 18 సంవత్సరాల క్రితం (2006-10-31)
Stable release1.26 (ఫిబ్రవరి 28, 2014 (2014-02-28)) [±][1]
రిపోజిటరీ
Edit this at Wikidata
వ్రాయబడినదిపైథాన్, సి (క్యుటీ), కాఫీస్క్రిప్ట్, జావాస్క్రిప్ట్
ఆపరేటింగ్ సిస్టంలినక్స్, మేక్, విండోస్
ప్లాట్ ఫాంఅన్ని వ్యవస్థలు
అందుబాటులో ఉంది37 భాషలు( పూర్తిగా లేక పాక్షికంగా స్థానికీకరించబడిన)
రకంఈప్రతి నిర్వహణ
లైసెన్సుGNU GPL v3
జాలస్థలిcalibre-ebook.com Edit this on Wikidata

కాలిబ్రె ఒక స్వేచ్ఛా, బహిరంగ మూలాల ఈ-పుస్తకాల చదవటానికి ఉపయోగపడే, అన్ని రకాల కంప్యూటర్ వ్యవస్థలపై పనిచేసే సాఫ్ట్వేర్. దీనిద్వారా వాడుకరులు ఈ-ప్రతుల సంగ్రహాలను నిర్వహించుట, ఈ-ప్రతులను దిద్దుట,చదువుట, సృష్టించుట చేయవచ్చు.వివిధ తీరులకు అనగా ఈ-పబ్ EPUB, అమెజాన్ కిండిల్ తీరులు, వివిధ ఈ-ప్రతి చదువరులతో పుస్తకాల స్థతి ఏకీకృతం, డిజిటల్ హక్కుల నిర్వహణ (Digital rights management (DRM) ) కు లోబడి ఈ-పుస్తకాల తీరులమధ్య మార్పిడ్లు చేయవచ్చు.

చరిత్ర

[మార్చు]

కోవిద్ గోయల్ లిబ్పిఆర్యస్500 (libprs500) అనే సాఫ్ట్వేర్ ను 2006 అక్టోబరు 31 న విడుదలైన సోనీ పిఆర్ఎస్-500 ను లినక్స్ లో వాడుటకు, మొబైల్ రీడ్ జట్టుల సహాయంతో బహిరంగ ఫైల్ తీరు కాని ఎల్ఆర్ఎఫ్ లక్షణాలను కనుగొనటానికి తయారుచేశాడు.[2] 2008లో, దీని పేరు కాలిబ్రెగా మార్చబడింది.[3]

సౌలభ్యాలు

[మార్చు]

కాలిబ్రె వివిధ ఫైల్ తీరులను, వివిధ చదివే పరికాలకు తోడ్పాటు కలిగివుంది.వీటిలో చాలా ఫైల్ తీరులు సవరణలుచేయవచ్చు. ఖతి మార్చటం లేక విషయసూచిక చేర్చటం లాంటి పనులు చేయవచ్చు. డిజిటల్ పుస్తకాలను వేరే తీరులోకి మార్చవచ్చు. డిజిటల్ హక్కుల నిర్వహణ గల పుస్తకాలను ఆహక్కులను తొలగించిన తరువాత మాత్రమే సవరణలు చేయవచ్చు. వీటికొరకు ప్లగిన్లు ఉన్నాయి.[4]

కాలిబ్రె వ్యక్తిగత ఈప్రతులను పుస్తకవివరాల (మెటాడేటా)ఆధారంగా క్రమంలోపెట్టడానికి, వివిధ వర్గాలలో చేర్చడానికి వాడుకోవొచ్చు. ఈ మెటాడేటాను వివిధ రకాల ఆన్లైన్ మూలాలనుండి పొందవచ్చు. (ISBNdb.com); ఆన్లైన్ పుస్తక అమ్మకం దారులు, ప్రాజెక్టు గుటెన్బర్గ్ ఇంటర్నెట్ ఆర్కీవ్ లాంటి ఉచిత ఈ ప్రతులు అందజేసే సంస్థలు;గుడ్ రీడ్స్ లాంటి పుస్తక సముదాయ స్థలాలు లాంటి చోట్ల నుండి పొందవచ్చు. రచయిత పేరుతో, లేక శీర్షికతో వెతకవచ్చు. పూర్తిపుస్తకంలో వెతకటం ఇంకా చేయాలి.[5][6]

ఈ ప్రతులను దిగుమతి చేసుకోవటం ద్వారా, లేక ఫైళ్లను మానవీయంగా చేర్చటం ద్వారా లేక చదువుపరికరాన్ని అనుసంధానం చేయటం ద్వారా దీనిలో చేర్చవచ్చు. ఆన్లైన్ లో గల విషయాలను ఈ ప్రతులుగా మార్చుటకు చిట్టి ఉపకరణాలు ఉన్నాయి.ఈ ప్రతులను తోడ్పాటుగల పరికరాలన్నిటికి USBద్వారా లేక మెయిల్ (అమెజాన్ కిండిల్ కు) పంపటం ద్వారా పంపించవచ్చు.ఈ గ్రంథాలయంలోని విషయాలను ఇవివున్న కంప్యూటర్ సర్వర్ గాపనిచేస్తుంటే, విహరిణితో వేరే ప్రాంతంనుండి చూడవచ్చు. ఇలాంటి పరిస్థితులలో క్రమానుసారం కొత్తగా చేరిన ఈ ప్రతులను చందాదారులకు అఫ్రమేయంగా పంపవచ్చు.

రూపం 1.15 (2013 డిసెంబరు) నుండి నేరుగా ఈప్రతులు తయారు చేయసౌకర్యం కలిగివుంది. ఇది పూర్తి స్థాయిలో పనిచేసే సిగిల్ లాంటిదే కాని దానిలాగా విజీవిగ్ సవరణ పద్ధతి లేనిది.

మూలాలు

[మార్చు]
  1. Goyal, Kovid (2014-02-28). "calibre - What's new". Retrieved 2014-02-28.
  2. "Mobileread Forums". mobileread.com. Retrieved 14 July 2012.
  3. "calibre - About". Calibre-ebook.com. 2006-10-31. Retrieved 2013-07-29.
  4. Sorrel, Charlie. "How To Strip DRM from Kindle E-Books and Others". Wired.com. Retrieved 4 August 2012.
  5. "User named kovidgoyal on fulltext search in TODO list". 2010-08-01. Archived from the original on 2014-02-03. Retrieved 2014-02-15.
  6. "User named Kovid Goyal (kovid) on fulltext search request". 2011-05-23.

బయటి లింకులు

[మార్చు]