కాలేయ వ్యాధులు
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
ప్రస్తుత కాలంలో మానవ జీవన విధానంలో అనేక మార్పుల వలన, అలాగే ఆహారపు అలవాట్లలో మార్పుల వలన ఈ ఆధునిక కాలంలో మధుమేహం, స్థూలకాయం, ధైరాయిడ్, సంతానలేమి అనే సమస్యలు ఎలా సాధారణం అయిపోయాయో, అలాగే కాలేయ సంబంధ సమస్యలు ఎక్కువ అయ్యాయి.
కారణాలు
[మార్చు]- ఫాస్ట్ ఫుడ్ సంస్కృతి
- చక్కెర సంబంధిత ఆహార పదార్థాలసేవన
- కొవ్వు అధికంగా ఉండే పదార్థాలు తీసుకోవడం
- ఫ్యాటీలివర్ అనే సమస్యతో బాధపడేవారి సంఖ్య ఎక్కువగా ఉంది.
కాలేయానికి సంక్రమించే ముఖ్యమైన వ్యాధులు
[మార్చు]ఫ్యాటీలివర్
[మార్చు]అనగా ఉదరంలో కాలేయగ్రంథి అనేది ముఖ్యమైన అవయం, కుడివైపున ఉంటుంది. ఇది అన్నింటి కంటే చాలాపెద్దగ్రంథి. అలాగే జీర్ణప్రక్రియలో అతి ప్రాధాన్యతను సంతరించుకున్నది. మానవులు తీసుకున్న ఆహారంలో చక్కెర శాతం పెరుగుతున్న కొలది కాలేయంలో నిల్వ అవుతోంది. తర్వాత అది శక్తిగా మారుతుంది. శక్తిగా మారుతున్న చెక్కెరను మినహాయిస్తే మిగిలినది కొవ్వుగా మారుతుంది. ఈ ప్రక్రియలో కాలేయంలో ఉండే కణాలు తమ గణాన్ని కార్యమును కోల్పోయి, కొవ్వు పేరుకుపోతుంది. దీనినే ఫ్యాటీలివర్‌గా వైద్య పరిభాషలో వ్యవహరిస్తారు దీనిలో అనేక దశలు ఉంటాయి. వీటిలో ముఖ్యమైనవి 3 దశలు.
- మొదటి దశ: కాలేయ కణాల మధ్య కొంచెం కొవ్వు పేరుకుంటుంది.
- రెండవ దశ: నాష్ అంటారు. ఇందులో కాలేయం గాయపడటం (డామేజ్) తో పాటు, కొన్ని కాలేయ కణాలు నశించిపోతాయి.
- మూడవ దశ: సిరోసిన్ వస్తుంది. అంటే కాలేయంలోని కణాలు తమ కార్యమును పూర్తిగా కోల్పోయి, స్వరూపం కూడా మారిపోతుంది. ఇది కొంచెము ప్రమాదమును చూచిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ కాలేయ మార్పిడి తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.
కారణాలు
[మార్చు]ఆహారంలో పిండి పదార్థాలు, కొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహారం తినటం, మద్యపానం ఎక్కువగా చెయ్యటం, ప్రమేహం, స్థూలకాయం కూడా కారణాలుగా చెప్పుకోవచ్చు.
లక్షణాలు
[మార్చు]- సాధారణంగా ఫ్యాటీలివర్ వ్యాధితో బాధపడే వారికి ఈ లక్షణాలు ఉండవు. కాని ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలో ఇది ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది.
- కొందరికి కుడివైపు పొట్ట పైభాగంలో (రిబ్‌కేజ్ పక్కటెముకల కింద) పొడిచినట్లుగా నొప్పి వస్తుంది. ఇది కాలేయం కొంచెం కొంచెం పెరుగుతున్నట్లు (లివర్ ఎన్‌లార్జ్‌మెంట్) ఉండటం వల్ల వస్తుంది.
- కొందరిలో మాంసాహారం, నూనె పదార్థాలు, తిన్నప్పుడు అలాంటి నొప్పి వచ్చే అవకాశం ఉంది.
కాలక్రమేణా కాలేయంలో వచ్చే మార్పులు
[మార్చు]కాలేయవ్యాధి వచ్చిన తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కాలేయం పూర్తిగా దెబ్బతిని సిర్రోసిస్ లేదా లివర్‌క్యాన్సర్‌గా మారవచ్చు.
ఫ్యాటీలివర్ మొదటిదశ నుండి రెండవ దశ అయిన ఎన్.ఏఎస్.హెచ్‌కు. అక్కడి నుండి 3వ దశ అయిన సిరోసిస్‌కు దారి తీస్తుంది అనుకోకూడదు. చాలాసందర్భాలలో 1 నుండి 3 వరకు దారితీయవచ్చు. అందుకే ఫ్యాటీలివర్ కన్పించగానే తగు జాగ్రత్త తీసుకోవాలి.
స్థూలకాయం వలన అనర్థాలు
[మార్చు]బరువు పెరుగుతున్న కొద్దీ కాలేయానికి నష్టం వాటిల్లుతుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. స్థూలకాయం ఉన్న 90% వ్యక్తులలో ఫ్యాటీలివర్, ఫ్యాటీలివర్ మొదటిదశ కనిపిస్తుంది. స్థూలకాయం ఉన్న 20% వ్యక్తుల్లో రెండవ దశగా పేర్కొన్న ఎన్.ఏ.ఎస్.హెచ్. దశ ఉంటుంది.ఫ్యాటీలివర్ వచ్చిన వ్యక్తులను పరిశీలిస్తే వారిలో దాదాపు 50% మందికి డయాబెటిస్ ఉన్నట్లు తెలుస్తుంది. సిర్రోసిస్ వచ్చిన వారిలో 50% మంది డయాబెటిస్, స్థూలకాయం ఉన్నవారే.
నిర్ధారణ పరీక్షలు
[మార్చు]- అల్ట్రాసౌండ్, అబ్డామిన్ స్కానింగ్‌లో చాలావరకు ఫ్యాటీలివర్ వ్యాధి నిర్ధారణ అవుతుంది.
- కాలేయ పనితీరు పరీక్ష చేయించాలి. దానిలో ఏవైనా ఎంజైములు స్రవించడం వల్ల కాలేయం దెబ్బ తిన్నడం అనే విషయం తెలుస్తుంది.
- డయాబెటిస్, కొలెస్ట్రాల్ స్థాయిలు, టైగ్లిసరైడ్స్ స్థాయిలు ఏమైనా పెరిగాయా అని చూడాలి.
- కొందరిలో లివర్ బయాప్సీ అవసరం.
పూర్తి వ్యాసం కామెర్లులో చూడండి.
మందులు
[మార్చు]- దీర్ఘకాలిక కాలేయ వ్యాధి కారణంగా తగ్గిన ప్లేట్లెట్లకు చికిత్స చేయడానికి లుసుట్రోంబోపాగ్ అనే ఔషధాన్ని ఉపయోగిస్తారు.
- ఎముక మజ్జ మార్పిడి తర్వాత కాలేయం వెనో-ఆక్లూజివ్ వ్యాధికి చికిత్స చేయడానికి డిఫిబ్రోటైడ్ అనే ఔషధాన్ని ఉపయోగిస్తారు.