కాల్షియం క్రోమేట్
కాల్సియం క్రోమేట్
| |
Calcium chromate dihydrate
| |
పేర్లు | |
---|---|
IUPAC నామము
Calcium dioxido-dioxo-chromium
| |
ఇతర పేర్లు
Calcium chromate (VI)
Calcium monochromate Calcium Chrome Yellow C. I. Pigment Yellow 33 Gelbin Yellow Ultramarine | |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [13765-19-0] |
పబ్ కెమ్ | 26264 |
యూరోపియన్ కమిషన్ సంఖ్య | 237-66-8 |
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య | GB2750000 |
SMILES | [Ca+2].[O-][Cr]([O-])(=O)=O |
| |
ధర్మములు | |
CaCrO4 | |
మోలార్ ద్రవ్యరాశి | 156.072 g/mol |
స్వరూపం | bright yellow powder |
సాంద్రత | 3.12 g/cm3 |
ద్రవీభవన స్థానం | 2,710 °C (4,910 °F; 2,980 K) |
anhydrous 4.5 g/100 mL (0 °C) 2.25 g/100 mL (20 °C) dihydrate 16.3 g/100mL (20 °C) 18.2 g/100mL (40 °C) | |
ద్రావణీయత | soluble in acid practically insoluble in alcohol |
నిర్మాణం | |
స్ఫటిక నిర్మాణం
|
monoclinic |
సంబంధిత సమ్మేళనాలు | |
ఇతరఅయాన్లు | {{{value}}} |
ఇతర కాటయాన్లు
|
Beryllium chromate Magnesium chromate Strontium chromate Barium chromate Radium chromate |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
verify (what is ?) | |
Infobox references | |
కాల్సియం క్రోమేట్ఒక రసాయన సంయోగపదార్థం.ఇది ఒక అకర్బన రసాయన సమ్మేళనం. కాల్సియం, క్రోమియం,, ఆక్సిజన్ మూలక పరమాణు సంయోగం వలన కాల్సియం క్రోమేట్ సంయోగ పదార్థం ఏర్పడును.ఈ రసాయన పదార్థం యొక్క సంకేత పదం CaCrO4.
భౌతిక లక్షణాలు
[మార్చు]కాల్సియం క్రోమేట్ ఒక ఘనపదార్థం. ప్రకాశవంతమైన పసుపు వర్ణపు ఘనపదార్థం. కాల్సియం క్రోమేట్ సాధారణంగా సార్ద్ర/జలయోజిత (hydrated),, అనార్ద్ర/నిర్జల (anhydrous) రూపాలలో లభిస్తుంది.సార్ద్ర స్థితి అయిన రెండు జలాణువులను కలిగిన స్థితిలో లభిస్తుంది.కాల్సియం క్రోమేట్ యొక్క అణుభారం 156.072గ్రాములు/మోల్.
సాంద్రత
[మార్చు]సాధారణ ఉష్ణోగ్రత వద్ద (25 °C వద్ద) కాల్సియం క్రోమేట్ సాంద్రత 3.12గ్రాములు/సెం.మీ3.
ద్రవీభవన స్థానం
[మార్చు]కాల్సియం క్రోమేట్ సంయోగ పదార్థం యొక్క ద్రవీభవన స్థానం 2,710 °C (4,910 °F; 2,980K).
ద్రావణీయత
[మార్చు]కాల్సియం క్రోమేట్ నీటిలో కరుగును.నిర్జల కాల్సియం క్రోమేట్ అయిన 100 మి.లీ నీటిలో 20 °C వద్ద 2.25గ్రాములు కరుగును. ద్విజలాణువులు కలిగిన కాల్సియం క్రోమేట్ 20 °C వద్ద 100 మి.లీ నీటిలో 16.3 గ్రాములు, 40 °C వద్ద 18.2 గ్రాములు కరుగును.ఆమ్లాలలో కరుగును, ఆల్కహాల్లో కరుగదు.
రసాయన ధర్మాలు
[మార్చు]సార్ ద్ర కాల్సియం క్రోమేట్ 200 °C వద్ద, తనలోని నీటిని కోల్పోవును.కాల్సియం క్రోమేట్ సేంద్రియపదార్థాలతో లేదా క్షయికరణ కారకాలతో చర్యచెంది క్రోమియం (III) ను ఏర్పరచును.ఈ ఘనపదార్థం హైడ్రాజీన్తో తీవ్రంగా విస్పోటన స్థాయిలో (explosively) చర్య జరుపును. కాల్సియం క్రోమేట్ ను బోరాన్తో కలిపి, ఏర్పడిన మిశ్రమాన్ని అంటించిన /మండించిన తీవ్రమైన స్వాభావంతో మండును.
ఉపయోగాలు
[మార్చు]- రంగులలో (pigment) ఉపయోగిస్తారు.
- పదార్థాల క్షయికరణ/తుప్పుపట్టడం/కోత (corrosion inhibitor) నిరోదకం/నివారిణి.
- ఎలక్ట్రోప్లేటింగు (electroplating) లో ఉపయోగిస్తారు.
- పెట్రోలియం రసాయనాల ప్రాసెసింగులో ఉపయోగిస్తారు.
- పారిశ్రామిక వ్యర్ధాల ట్రీట్‌మెంట్‌లో (waste treatment.)