Jump to content

కాల్షియం సైనమిడ్

వికీపీడియా నుండి
(కాల్సియం సైనమిడ్ నుండి దారిమార్పు చెందింది)
కాల్షియం సైనమిడ్
పేర్లు
IUPAC నామము
Calcium cyanamide
ఇతర పేర్లు
Cyanamide calcium salt, Lime Nitrogen, UN 1403, Nitrolime
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [156-62-7]
పబ్ కెమ్ 4685067
యూరోపియన్ కమిషన్ సంఖ్య 205-861-8
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య GS6000000
SMILES [Ca+2].N#CN
ధర్మములు
CaCN2
మోలార్ ద్రవ్యరాశి 80.102 g/mol
స్వరూపం White solid (Often gray or black from impurities)
వాసన odorless
సాంద్రత 2.29 g/cm3
ద్రవీభవన స్థానం 1,340 °C (2,440 °F; 1,610 K)[1]
బాష్పీభవన స్థానం 1,150 నుండి 1,200 °C (2,100 నుండి 2,190 °F; 1,420 నుండి 1,470 K) (sublimes)
Reacts
ప్రమాదాలు
భద్రత సమాచార పత్రము ICSC 1639
ఇ.యు.వర్గీకరణ {{{value}}}
R-పదబంధాలు R22 R37 R41
S-పదబంధాలు (S2) మూస:S22 S26 S36/37/39
జ్వలన స్థానం {{{value}}}
US health exposure limits (NIOSH):
PEL (Permissible)
none[2]
REL (Recommended)
TWA 0.5 mg/m3
IDLH (Immediate danger)
N.D.[2]
సంబంధిత సమ్మేళనాలు
సంబంధిత సమ్మేళనాలు
Cyanamide
Calcium carbide
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references

కాల్సియం నైనమిడ్ ఒక రసాయన సంయోగ పదార్థం.ఇది ఒక అసేంద్రియ, కర్బనయుత రసాయన సంయోగ పదార్థం.కాల్సియం, కార్బన్,, నైట్రోజన్ మూలక పరమాణువుల సంమ్మేలనం వలన కాల్సియం నైనమిడ్ సంయోగ పదార్థంఏర్పడినది.కాల్సియంనుండి ఉత్పాదింపబడిన సైనమిడ్ (CN22-) ను రసాయనిక ఎరువుగా ఉపయోగిస్తారు.కాల్సియం నైనమిడ్ ను వాణిజ్య పరంగా నైట్రోలైము (nitrolime) అంటారు.

ఆవిష్కరణ

[మార్చు]

మొదట 1898లో అడాల్ఫ్ ఫ్రాంక్, నికొడెంకారో అనువారు సంశ్లేషణ చేసారు.ఈ విధానానికి ఫ్రాంక్-కారో ప్రక్రియ అనినామకరణం చేశారు.

భౌతిక లక్షణాలు

[మార్చు]

ఇది ఘన రసాయనం.అణుసౌష్టవం షట్భుజనిర్మాణం కల్గి, అల్లిక స్థిరాంకాలు ( lattice constants) a=3.67, c = 14.85 (.10−1 nm).గా కల్గి ఉంది.

భౌతిక స్థితి

[మార్చు]

తెల్లని ఘనపదార్థం. మలినాలను కల్గినపుడు గ్రే లేదా నల్లగా ఉండును. కాల్షియం నైనమిడ్ అణుభారం 80.102 గ్రాములు/మోల్. కాల్షియం నైనమిడ్ వాసన లేని రసాయన సంయోగపదార్థం.

సాంద్రత

[మార్చు]

సాధారణ ఉష్ణోగ్రత (25 °C) వద్ద కాల్షియం నైనమిడ్ సాంద్రత 2.29 గ్రాములు/సెం.మీ3

ద్రవీభవన ఉష్ణోగ్రత

[మార్చు]

కాల్షియం నైనమిడ్ ద్రవీభవన స్థానం 1,340 °C (2,440 °F;1,610 K)

బాష్పీభవన ఉష్ణోగ్రత

[మార్చు]

కాల్షియం నైనమిడ్ సంయోగ పదార్థం యొక్క బాష్పీభవన స్థానం 1,150 to 1,200 °C (2,100 to 2,190 °F; 1,420 to 1,470K). కాల్షియం నైనమిడ్ ఉత్పతనం చెందు రసాయన పదార్థం

రసాయన చర్యలు

[మార్చు]

నీటితో చర్య జరుపును.

కాల్సియం సైనమిడ్ ను సోడియం కార్బోనేట్‌తో కలిపి వేడిచేసి సమ్మిళితం (fusing) చేయడం వలన సోడియం నైనైడ్ ఉత్పత్తి అగును.

CaCN2 + Na2CO3 + 2C → 2 NaCN + CaO + 2CO

కాల్సియం సైనమిడ్ ను జలవిశ్లేషణకావించిన నైనమిడ్ ఏర్పడును.

CaCN2 + H2O + CO2 → CaCO3 + H2NCN

కార్బన్ డయాక్సైడ్ సమక్షలో కాల్షియం సైనమిడ్ రసాయనం, హైడ్రోజన్ సల్ఫైడ్‌తో రసాయన చర్య వలన థియోయూరియా (Thiourea) అనబడు సేంద్రియ సల్ఫర్ సంయోగ పదార్థం ఏర్పడును.

ఉత్పత్తి

[మార్చు]

కాల్సియం సైనమిడ్ ను కాల్సియం కార్బైడ్ నుండి ఉత్పత్తి చేయుదురు.విద్యుత్తు కొలిమి/బట్టి (electric furnace) లో కార్బైడ్ పొడిని 1,000 °C వరకు వేడి చేసి, ఈరసాయన పదార్థం గుండా కొన్ని గంటల పాటు నైట్రోజన్ వాయువును ప్రసరింప చేయుదురు. ఏర్పడిన కాల్సియం సైనమిడ్‌ను సాధారణ ఉష్ణోగ్రతకు చల్లార్చేదరు. తరువాత నీటి ద్వారా ప్రక్షాళనచేసి చర్యానంతరం మిగిలిన కార్బైడును తొలగించెదరు.

CaC2 + N2 → CaCN2 + C (ΔHƒ°= –69.0 kcal/mol at 25 °C)

ఈ ప్రక్రియను భారి ఉక్కు గదులలో చేసెదరు. రసాయనాలను విద్యుత్తు కార్బన్ స్టిల్ ఎలెమెంట్ ద్వారా రసాయనాలను ఎర్రని వేడి వచ్చేచేసెదరు.2 అట్మాస్పియరు వత్తిడి కల్గిన నైట్రోజన్ వాయువును వేడి కార్బైడ్ రసాయనంద్వారా ప్రసరింప చేసెదరు.

ఉపయోగాలు

[మార్చు]

కాల్సియం సైనమిడ్ ను ప్రధానంగా వ్యవసాయములో ఎరువుగా ఉపయోగిస్తారు.నీటితో సంపర్కం వలన ఈ రసాయన పదార్థం వియోగం చెంది అమ్మోనియాను విడుదల చేయును.

CaCN2 + 3 H2O → 2 NH3 + CaCO3

కాల్సియం సైనమిడ్ ను సోడియం కార్బోనేట్ తో కలిపి వేడి చేసి సమ్మిళితం (fusing) చేయడం వలన సోడియం నైనైడ్ ఉత్పత్తి అగును.సోడియం సైనైడ్‌ను బంగారుఖనిజం నుండి బంగారుతయారు ప్రక్రియ సమయంలో సైనైడ్ ప్రక్రియలో ఉపయోగిస్తారు.అలాగే కాల్సియం సైనైడ్, మెలమైన్ (melamine) ఉత్పత్తిలో కూడా వాడెదరు.

ఉక్కు తయారీలో లోహంలో నైట్రోజన్ ను చేర్చుటకు వైర్ ఫెడ్ మిశ్రమ దాతువుగా కాల్షియం సైనమిడ్ ను ఉపయోగిస్తారు.

మూలాలు/అధారాలు

[మార్చు]
  1. Pradyot Patnaik. Handbook of Inorganic Chemicals. McGraw-Hill, 2002, ISBN 0-07-049439-8
  2. 2.0 2.1 NIOSH Pocket Guide to Chemical Hazards. "#0091". National Institute for Occupational Safety and Health (NIOSH).