కాశీభట్ల వేంకట రమణమ్మ

వికీపీడియా నుండి
(కాశీభట్ల వేంకటరమణమ్మ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కాశీభట్ల వేంకటరమణమ్మ

కాశీభట్ల వేంకట రమణమ్మ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధురాలు, సంఘసేవకురాలు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

ఆమె 1912 ఏప్రిల్ 15న చీమలకొండ సూర్యనారాయణ శాస్త్రి, అన్నపూర్ణమ్మ దంపతులకు బోడపాడులో జన్మించింది.

ఈమె భర్త డాక్టర్ కె.ఎల్. నరసింహారావు స్వాతంత్ర్యసమరయోధులుగా, వైద్యునిగా, మునిసిపల్ కౌన్సిలర్ గా, రాజ్యసభ సభ్యునిగా ఎనలేని సేవ చేసాడు. రమణమ్మ శాసన ధిక్కారం చేసి రామచంద్రపురం జైలులో శిక్షను అనుభవించింది.

ఈమె చెన్నైలోని టి.నగర్ లో అగ్రకులాల ప్రజలమధ్య తమ స్వగృహంలో గాంధీ హరిజన విద్యార్థుల వసతిగృహాన్ని దక్షతతో నిర్వహించింది. వివిధ మహిళాభ్యుదయ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నది. కుమార్తెలు విఠాల మాణీక్యాంబ, సుసర్ల భానుమతి, మైలవరపు భారతి, తీగవరపు విజయలక్ష్మి, కుమారులు రామలింగశాస్త్ర, సూర్యనారాయణశాస్త్రి.[2]

మూలాలు[మార్చు]

  1. "రాజమండ్రి వెబ్ సైటులో కాశీభట్ల వేంకటరమణమ్మ గురించిన వివరాలు". Archived from the original on 2013-06-30. Retrieved 2013-03-12.
  2. "స్వాతంత్ర్య సమర ఆంధ్ర వీరవనితలు" (PDF).[permanent dead link]