కె. ఎల్. నరసింహారావు (స్వాతంత్ర్య సమరయోధుడు)
డా. కె. ఎల్. నరసింహారావు ఒక స్వాతంత్ర్యసమరయోధులు.
జీవిత విశేషాలు
[మార్చు]ఈయన 1900 లో జన్మించారు. అతను సెకండరీ విద్యను పూర్తిచేసిన తరువాత విజయనగరం మెడికల్ పాఠశాలలో 1918 లో చేరారు.
స్వాతంత్ర్యోద్యమం
[మార్చు]భారత స్వాతంత్ర్య సంగ్రామంలో సహాయనిరాకరణోద్యమంలో ఆయన విద్యను వదులుకున్నాడు. ఆయన సత్యాగ్రహకారుల సైన్యంలో చేరాడు. ఆయన స్వచ్ఛంద కేంప్ ప్రారంభం, పికెటింగ్ నిర్వహణ చేశారు. అతను పంజాబ్ దురాగతాల వర్ణించటం కోసం నాటకాలు నిర్వహించారు. ఆయన ప్రభుత్వ ఉత్తర్వులను అతిక్రమించినందుకు గానూ 144 సెక్షన్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం నాలుగు నెలలు జైలు శిక్ష అనుభవించారు. ఉద్యమం సస్పెండ్ అయిన తర్వాత ఆయన కలకత్తా వెళ్ళి మెడికల్ కోర్సును పూర్తి చేశారు. తర్వాత ఆయన మద్రాసులో డిగ్రీని పొంది రాజమండ్రికి వచ్చి మెడికల్ ప్రాక్టీసు ప్రారంభించారు.
ఇతని భార్య కాశీభట్ల వేంకట రమణమ్మ కూడా స్వాతంత్ర్య సంగ్రామంలో, సంఘసేవా కార్యక్రమాలలో పాల్గొనింది. జైలు శిక్షను అనుభవించింది.
ఉప్పు సత్యాగ్రహ కాలంలో ఆయన రెండు సంవత్సరాల జైలుశిక్షను, 1000 రూపాయల జరీమానా శిక్షను అనుభవించారు. ఈ శిక్షను ఆరు మాసాలు అధికంగా అనుభవించారు. ఆయన కన్ననోర్ జైలులో విడుదల అయిన సందర్భంగా జైలు అధికారులకు వేలిముద్రలు యిచ్చుటకు నిరాకరించినందుకు అదనంగా ఆరు వారాలు శిక్షను అనుభవించవలసి వచ్చింది. ఆయన గాంధీ-ఇర్విన్ ఒప్పందం సంతకాలు జరిగినపుడు జైలునుండి విడుదల అయినాడు. ఈ సంధికాలంలో ఆయన విదేశీ వస్త్ర బహిష్కరణ వంటి ఉద్యమాలపై దృష్టి కేంద్రీకరించి సఫలీకృతుడైనాడు.[1]
గాంధీజీ అరెస్టు సందర్భంగా ఉద్యమం పునరుద్ధరింపబడినపుడు ఆర్డినెన్స్ రూల్ ప్రారంభమైనది. డా.నరసింహారావు జైలులో ఉండలేకపోయాడు. ఈ సమయంలో పెషావర్ దినమును గమనించుతకు వాలంటీర్ల బ్యాచ్ కు నాయకత్వం వహించారు.
ఈయన 1934-335 లో జరిగిన ఎ.ఐ.సి.సి సభ్యునిగా కాంగ్రెస్ సభలకు బొంబాయిలో హారరైనారు. ఆయన తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీకి సెక్రటరీగా ఎన్నిక కాబడినారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రొవిన్‌షియల్ వర్కింగ్ కమిటీకి సభ్యునిగా ఎన్నిక అయినారు. ఆయన జైలు జీవితాన్ని అనుభవిస్తూ, సత్యాగ్రహ ఉద్యమాన్ని జైలులో కొనసాహిస్తూ ఉండటంవల్ల ఆరోగ్యాన్ని కోల్పోయారు. దీని ఫలితంగా ట్యుబర్‌కులర్ ప్లీరిసీ అనే వ్యాధిగ్రస్తుడైనాడు. ఆయన ఒక సంవత్సరం పాటు ఆరోగ్య ఉండాలని బలవంతంగా ఉంచబడ్డాడు.
1936-37 లలో ఆయన ఎ.ఐ.సి.సి మెంబరుగా ఎన్నికై ఫైజాపూర్ కాంగ్రెస్ సభలకు హారరైనారు. ఈ సంవత్సరం ఆయన హరిపూర కాంగ్రెస్ కు ప్రతినిధికా ఎన్నికైనారు.
ఆయన ఆశయం పేద ప్రజలకు ఉచితంగా వైద్య సహాయాన్నందించడం. దీని కోసం నిధులను వసూలు చేసేవారు.
మూలాలు
[మార్చు]- ↑ "Kamat Research Database - K. L. Narasimharao". www.kamat.com. Retrieved 2021-06-20.
వెలుపలి లంకెలు
[మార్చు]- http://www.kamat.com/database/biographies/k_l_narsimharao.htm
- Haripura Congress Souvenir, 1938