కాసోజు సురేందర్
కాసోజు సురేందర్ | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 3 ఫిబ్రవరి 2022 | |||
నియమించిన వారు | రామ్‌నాథ్ కోవింద్ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1968 మహబూబ్ నగర్, మహబూబ్ నగర్ జిల్లా, తెలంగాణ | ||
పూర్వ విద్యార్థి | ఉస్మానియా విశ్వవిద్యాలయ |
కాసోజు సురేందర్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన న్యాయమూర్తి. 2022, ఫిబ్రవరి 3న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యాడు.[1]
జననం, విద్య
[మార్చు]సురేందర్ 1968లో లక్ష్మీనారాయణ - ప్రమీలాదేవి దంపతులకు తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లాలోని మహబూబ్ నగర్ పట్టణంలో జన్మించాడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను, ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో బీఎస్సీ, న్యాయశాస్త్రం డిగ్రీలను పూర్తి చేశాడు.[2]
వృత్తిరంగం
[మార్చు]1992 డిసెంబరు 15న బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయిన సురేందర్, 2005 నుండి 2008 వరకు కేంద్రం తరఫున హైకోర్టులో అడిషినల్ స్టాండింగ్ కౌన్సెల్‌గా, 2010లో పీపీగా, సీబీఐ కౌన్సెల్‌గా విధులు నిర్వర్తించాడు. 2013లో రెండోసారి సీబీఐ స్పెషల్ పీపీగా, జగన్ ఆస్తుల కేసులో సీబీఐ స్టాండింగ్ కౌన్సెల్‌గా (ప్రత్యేక న్యాయవాదిగా) పనిచేశారు. హైకోర్టులో ఎన్‌ఐఏ కౌన్సెల్‌గా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్‌సుఖ్‌నగర్, గోకుల్‌చాట్, లుంబినీపార్ బాంబుపేలుడు కేసులను వాదించాడు. రూ.7 వేల కోట్ల కుంభకోణానికి చెందిన సత్యం కేసులో వాదనలు వినిపించగా ప్రత్యేక కోర్టులో నేరం రుజువై నిందితులకు జైలు శిక్ష పడింది. ప్రస్తుతం నాలుగోసారి సీబీఐ స్పెషల్ పీపీగా, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్‌కు, ఎన్‌ఐఏకు స్పెషల్ పీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.[3] సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 2022 మార్చి 22న ఆమోదించాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ Vamshidhara, Vujjini (2022-02-02). "SC Collegium okays 7 advocates. 5 judicial officers as Telangana HC judges". Deccan Chronicle (in ఇంగ్లీష్). Archived from the original on 2022-02-03. Retrieved 2022-02-04.
- ↑ telugu, NT News (2022-02-02). "తెలంగాణ హైకోర్టుకు మరో 12 మంది జడ్జిలు!". Namasthe Telangana. Archived from the original on 2022-02-03. Retrieved 2022-02-04.
- ↑ telugu, NT News (2022-02-02). "తెలంగాణ హైకోర్టుకు మరో 12 మంది జడ్జిలు!". Namasthe Telangana. Archived from the original on 2022-02-03. Retrieved 2022-02-04.
- ↑ Sakshi (23 March 2022). "హైకోర్టుకు కొత్తగా 10 మంది జడ్జీలు". Archived from the original on 23 March 2022. Retrieved 23 March 2022.