Jump to content

కిక్రి (వాయిద్యం)

వికీపీడియా నుండి
హీరా సుక్క

ఇది గోండు సమాజంలో బహుళ ప్రచారంలో ఉన్న కిక్రి వాద్యం. గోండుల ఉపకులం అయిన తెగలు ప్రధాన్లు, తోటిలు దీనిని వాయిస్తూ గోండి తెగ గాథలను పాడుతుంటారు. దీనిని ప్రధాన్ల ధర్మ గురువు, గోండి ధర్మ గురువు హీరా సుక్క, గోండి ధర్మ సంగీత గురు [1] వాద్యంగా పేర్కొంటారు. దీనిని హీరబాయి కిక్రి (కింగ్రి) అని కూడా అంటారు.[2]

హీరాబాయి కీక్రి వాయిద్యం

[మార్చు]

హీరాబాయి కీక్రి పెద్ద దేవున్ని ప్రసన్నం చేయడానికి.. ముఖ్య భూమిక పోషిస్తున్నది. ప్రతి నాలుగు సగ్గల యందు పెద్ద దేవుని ముందు ఉండి నడుస్తూ, గోండీ ధర్మానికి రక్షిస్తూ, గోండి సగ్గాలో శాంతి సౌభాగ్యాలు కలుగజేస్తుంది. ఇది పూర్వ కాలం నుంచి వస్తున్న ఆచారంతో పాటు,పెద్దలు చెబుతున్నా చారిత్రక సత్యం!హీరాబాయి కీక్రి యెక్క గొప్ప లక్షణం. తర్వాత మన నాలుగు సగ్గాల దేవుళ్ళు శివుని గుహలో (యాదిలో) పడినప్పుడు, సంబు దేవుని ఆజ్ఞా మేరకు పారికుపార్ లింగో హీరావైరాగడ్ పోయి గురు మార్గంలో హీరా సుక్కని ఆహ్వానించడం జరిగింది. వారి కోరిక మేరకు గురు హీరాసుక వారి తల్లి హీరాబాయి కీక్రి రూపం ధరించి తద్వారా యాదిలో పడ్డ కోయ పేనుకును( దేవుళ్ళని) తన కీక్రి వాయిద్యంతో బయటికి తీశారు. ఇది హీరాబాయి కీక్రి యెక్క గొప్ప మహాత్మ్యం.

తయారీ

[మార్చు]

చెట్టు కాండం తొలచి జానెడున్నర పొడవు గల చతురస్రాకారపు అనునాదకం తయారు చేస్తారు. దానిపై మేక చర్మం అమరుస్తారు. దాని మధ్యలో వెదురు బొంగుని జొప్పిస్తారు. రెండోవైపు దీనికి మూడు రంధ్రాలుచేసి శృతి కర్రలు అమర్చుతారు. వీటిని పూటీలు అంటారు. పెట్టెను వాద్యకారుడు తన గడ్డంతో అదిమిపట్టుకుని కింది వైపున్న పూటీలపై వయోలిన్ వాయించినట్లుగా భోమ్తో వాయిస్తారు. ఈ ఖోమ్ విల్లులాగా ఉంటుంది. దీనికి గజ్జెలు కట్టి ఉంటాయి. వింటితో వాయించేప్పుడు గజ్జెలు ఆయా రాగాలకు అనుగుణంగా ధ్వనిస్తుంటాయి.[3]

వివిధ వాద్యాలతో పోలిక

[మార్చు]
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో జరిగిన ఆదివాసి కళా జాతర కార్యక్రమంలో కిక్రి వాయిస్తున్న కళాకారుడు

కిక్రి  వాద్యానికి మణిపూర్లో "పేనా, ఒరిస్సాలో కెన్రా  'బాణం', రాజస్థాన్లో రావణహట్టా, కేరళలో 'వీణాకుంజు వాద్యానికి  పోలిక ఉంది. కాని గోండీ గాన సంప్రదాయ విశిష్టత కూడా కిర్రీ వాద్యానికి ప్రత్యేకత తెచ్చి పెట్టింది. గోండి తెర ఆదివాసులు నివసించే 6,7 రాష్ట్రాలలో ఈ వాద్యం ఉండేది. ప్రస్తుతం మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలలో గల గోండీ ప్రజలు కిక్రి ని  వాడుతున్నారు.

సామూహికంగా వాయిస్తారు

[మార్చు]

గోండీ  పూజారులైన ప్రధాన్లు తమ తెగ ఆచారాన్ని పాటిస్తూ జరిపే మత క్రతువుల్లోను, కర్మకాండలలోను, పెళ్ళిళ్ళు, చావులు ఉత్సవాలలోను దీనిని వాయిస్తున్నారు. గోండి సంప్రదాయాలకు, గౌరవానికి ఇది సంకేతం. కిక్రితో పాటు 'పెప్రే ' అనే రెండు సన్నాయి వాద్యాలు, డక్కి అనే చర్మవాద్యం అన్నీ కలిసి సామూహికంగా వాయిస్తారు.

మూలాలు

[మార్చు]
  1. ఆంధ్ర ప్రభ (2023-02-20), ఛలో ఇంద్రవెల్లి గోండి ధర్మ గురు హీరా సుక్క, retrieved 2024-06-02
  2. మూర్తి, మిక్కిలినేని రాధాకృష్ణ. "తెలుగువారి జానపద కళారూపాలు - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2022-04-02.
  3. జయధీర్, తిరుమలరావు; గూడూరి, మనోజ (2019). మూలధ్వని (జానపద గిరిజన సంగీత వాద్యాల సామజిక చరిత్ర ).