కిటు గిద్వానీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కిటు గిద్వానీ
2013లో కిటు గిద్వానీ
జననం
కౌశల్య గిద్వానీ

(1967-10-22) 1967 అక్టోబరు 22 (వయసు 56)
వృత్తినటి, మోడల్, నర్తకి
క్రియాశీల సంవత్సరాలు1984–ప్రస్తుతం

కిటు గిద్వానీ (జననం 1967 అక్టోబరు 22) భారతీయ నటి, మోడల్. ఆమె సినిమాలు, అనేక టెలివిజన్‌ సీరియల్స్‌లలో కూడా నటించింది.

స్వాభిమాన్‌ ధారావాహికలో స్వెత్లానా పాత్రను ఆమె పోషించి, టీవీ ప్రేక్షకులకు దగ్గరైంది. అదే సమయంలో శక్తిమాన్‌ లో న్యూస్ ఛానెల్ రిపోర్టర్ గీతా విశ్వాస్ పాత్రను పోషించింది. అయితే, ఆమె కొన్ని ఎపిసోడ్‌ల తర్వాత షో నుండి నిష్క్రమించింది. 1986లో దూరదర్శన్‌లో ప్రసారమైన ఎయిర్ హోస్టెస్ అనే టీవీ సిరీస్ తర్వాత ఆమె మరింత పాపులర్ అయ్యింది. డాన్స్ ఆఫ్ ది విండ్ (1997), దీపా మెహతా రూపొందించిన ఎర్త్ (1998), గోవింద్ నిహలానీ దర్శకత్వం వహించిన రుఖ్మావతి కి హవేలీ (1991), కమల్ హాసన్ తో అభయ్, దేహం (1991) చిత్రాలలో ఆమె పాత్రలకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.[1]

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

ఆమె కౌశల్య గిద్వానీగా ముంబైలో జన్మించింది. ఆమె సింధీ తల్లిదండ్రులు దేశ విభజన తర్వాత పాకిస్తాన్ నుండి భారతదేశం వలస వచ్చారు. వారు వర్లీలోని శరణార్థి శిబిరంలో నివసించారు.[2] ఆమెకు ఒక సోదరుడు ఉన్నాడు.

ఆమె ముంబైలోని ఫోర్ట్ కాన్వెంట్ స్కూల్‌లో చదువుకుంది. ఆమె పోస్ట్ గ్రాడ్యుయేషన్ రోజులలో ఆమెకు ఫ్రెంచ్ భాషపై ఆసక్తి కనిపించింది. ఆమె ఫ్రెంచ్ నాటకాలలో నటించడం ప్రారంభించింది.

కెరీర్[మార్చు]

ఆమెకు నాటకాలపై ఉన్న మమకారంతో జనక్ తోప్రాని దర్శకత్వం వహించిన ఆంగ్ల నాటకాలలో కూడా నటించింది. ఆమె కొన్ని టెలివిజన్ సీరియల్స్‌లో నటించింది. ఆ తర్వాత ఒక ఫ్రెంచ్ చిత్రం బ్లాక్ (1987)లో నటించింది,[3] అందులో బ్రెజిలియన్ అమ్మాయిగా నటించింది.[4]

అవార్డులు[మార్చు]

1998లో, ఆమె త్రీ కాంటినెంట్స్ ఫెస్టివల్, నాంటెస్, ఫ్రాన్స్‌లో ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. రాజన్ ఖోసా దర్శకత్వం వహించిన డాన్స్ ఆఫ్ ద విండ్ లో పల్లవి పాత్రకు ఆమెను ఈ పురస్కారం వరించింది.

మూలాలు[మార్చు]

  1. For Kitu Gidwani, it's mind over body! Archived 1 ఏప్రిల్ 2018 at the Wayback Machine Ronjita Kulkarni, Rediff.com, Movies, 3 May 2002.
  2. Singh, Sanghita (1 April 2002). "It's back to the basics for Kitu Gidwani". The Times of India. Archived from the original on 3 November 2012. Retrieved 21 December 2008.
  3. "Famous Sindhis - Kidu Gidwani". Archived from the original on 6 March 2014. Retrieved 13 July 2006.
  4. "rediff.com US edition: You can do whatever you believe of yourself: Kitu Gidwani". Rediff.com. Archived from the original on 9 July 2014. Retrieved 14 November 2013.