కిదాంబి శ్రీకాంత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కిదాంబి శ్రీకాంత్
Yonex IFB 2013 - Eightfinal - Boonsak Ponsana — K. Srikanth 01.jpg
2013 ఫ్రెంచ్ సూపర్ సిరీస్ లో కె.శ్రీకాంత్
వ్యక్తిగత సమాచారం
జన్మనామంశ్రీకాంత్ నమ్మాళ్వార్ కిదాంబి
జననం (1993-02-07) 1993 ఫిబ్రవరి 7 (వయస్సు 28)
గుంటూరు, ఆంధ్ర ప్రదేశ్
దేశం భారతదేశం
పురుషుల సింగిల్స్
అత్యున్నత స్థానం13 (29 మే 2014)
ప్రస్తుత స్థానం16 (13 నవంబర్ 2014)

కిదాంబి శ్రీకాంత్ ఫిబ్రవరి 7, 1993న గుంటూరులో జన్మించాడు. ఇతను ఒక భారతీయ బ్యాడ్మింటన్ ఆటగాడు, మొట్టమొదటగా గుంటూరు యన్.టి.ఆర్.స్టేడియంలో జాతీయస్థాయి క్రీడాకారుడు ప్రేంకుమార్ సింగ్ కోచింగ్ లో అన్న నందగోపాల్ తో పాటు చక్కని బేసిక్స్ రెండేడ్లు నేర్చుకొని చాలాకాలం తరువాత గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ, హైదరాబాద్ లో శిక్షణ తీసుకున్నాడు. ఇతను ప్రస్తుతం ( 2014 ఆగస్టు 18 నాటికి) అంతర్జాతీయ వలయంలో అత్యధిక ర్యాంకు కలిగిన భారత పురుషుల ఆటగాడు. శ్రీకాంత్ గోస్పోర్ట్స్ ఫౌండేషన్, బెంగుళూర్ ద్వారా, 2012 నుండి స్కాలర్షిప్ కార్యక్రమం యొక్క భాగం నుండి తోడ్పాటునందుకొనుచున్నాడు. ఇతను లి-నింగ్ చే కూడా స్పాన్సర్ చేయబడ్డాడు. ఇతను 2014 నవంబరు 16 న, ప్రపంచ బ్యాడ్మింటన్ లో అత్యుత్తమ క్రీడాకారుడిగా పేరొంది అభిమానులచే "సూపర్ డాన్"గా పిలవబడుతున్న లిన్ డాన్ ను 21-19 21-17 తేడాతో ఓడించి 2014 చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ గెలుచుకున్నాడు, ఈ విధంగా సూపర్ సిరీస్ ప్రీమియర్ పురుషుల టైటిల్ ను గెలుచుకున్న మొట్టమొదటి భారతీయునిగా శ్రీకాంత్ పేరుగాంచాడు.

వ్యక్తిగతం[మార్చు]

శ్రీకాంత్ నమ్మాళ్వార్ కిదాంబి ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు కేవీఎస్ కృష్ణ, రాధ ముకుంద. కె.వి.యస్ కృష్ణ ఒక భూస్వామి. శ్రీకాంత్ సోదరుడు నంద గోపాల్ కూడా అంతర్జాతీయ ర్యాంక్ కలిగిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు.

మూలాలు[మార్చు]

  • ఈనాడు దినపత్రిక - 17-11-2014 - (డాన్‌ను కొట్టి చైనాను గెలిచి.. చరిత్ర సృష్టించిన కిదాంబి శ్రీకాంత్ - చైనా దిగ్గజం లిన్ డాన్‌పై సంచలనం)

బయటి లంకెలు[మార్చు]