Jump to content

చర్చ:కిదాంబి శ్రీకాంత్

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ఇంటి పేరు

[మార్చు]

ఈ వ్యాసంలోని శ్రీకాంత్ ఇంటిపేరు కిదాంబిగా ఉంది. ఈ వ్యాసం మార్పుచేర్పుల చరిత్రను గమనిస్తే మొదట వాడుకరి:YVSREDDY కిడంబి శ్రీకాంత్ అని వ్యాసాన్ని సృష్టిస్తే వాడుకరి:సుల్తాన్ ఖాదర్ ప్రస్తుత పేజీకి ఆ వ్యాసాన్ని తరలించినట్టు తెలుస్తుంది. నా దృష్టిలో కిడంబి, కిదాంబి రెండూ సరియైనవి కావు అని పిస్తుంది. కిడాంబి సరైన ఉచ్చారణ అని నేను భావిస్తున్నాను. సుప్రసిద్ధ శాస్త్రవేత్త మరియు పత్రికా సంపాదకుడు కిడాంబి రఘునాథ్, సంస్కృతాంధ్ర కవి కిడాంబి రాఘవాచార్య, కిడాంబి నరసింహాచార్య మొదలైన వారి ఇంటి పేర్లు నా వాదనను బలపరుస్తున్నాయి. అసలు కిడాంబి అనే పదం కిళాంబి అనే ఇంటిపేరునుండి వచ్చి ఉంటుందని నా అనుమానం. కాబట్టి కిదాంబి శ్రీకాంత్ అనే ఈ వ్యాసాన్ని కిడాంబి శ్రీకాంత్ అనే వ్యాసాన్ని సృష్టించి దానికి తరలించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. స్వరలాసిక (చర్చ) 15:07, 30 జూలై 2016 (UTC)[ప్రత్యుత్తరం]

కిడాంబి అనే నాకూ తెలుసు. కానీ గూగుల్ చూపిస్తున్న ఫలితాలు: కిడాంబి: 5790 కిదాంబి: 5030 -పెద్ద తేడా లేదు. మన పేపర్ల వాళ్ళు మనం చేస్తున్న ఈ పాటి చర్చ చేసినా తప్పు పేరు రాయకుండా జాగ్రత్త పడగలిగే వాళ్ళు. __చదువరి (చర్చరచనలు) 15:25, 30 జూలై 2016 (UTC)[ప్రత్యుత్తరం]