Jump to content

కిరత్ భట్టల్

వికీపీడియా నుండి
కిరత్ భట్టల్
జననం
కిరత్ భట్టల్

మన్రోవియా, లైబీరియా
ఇతర పేర్లుకికీ
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2005–2016
జీవిత భాగస్వామి
గౌరవ్ కపూర్
(m. invalid year)
స్లైల్ అండ్ సిటీ షూట్ లో కిరత్ భట్టల్

కిరత్ భట్టల్ (జననం 1985 జనవరి 26 , మన్రోవియా, లైబీరియా) ఒక భారతీయ నటి.[1] ఆమె మోడలింగ్ రంగంలోకి  ప్రవేశించి, ఆ తర్వాత తమిళ చిత్ర పరిశ్రమలో పురోగతి సాధించింది.

కెరీర్

[మార్చు]

సనావర్‌లోని లారెన్స్ స్కూల్‌లో విద్యాభ్యాసం[2] పూర్తి చేసిన తర్వాత, కిరత్ భట్టల్ సఫీ యాడ్‌లో అరంగేట్రం చేసింది. ఆ తరువాత ఫెయిర్ అండ్ లవ్లీ, సియారామ్, లక్మే ప్రకటనల వంటి అనేక ఇతర ప్రచారాలలో రైమా సేన్‌తో కలిసి చేసింది. కిరత్ భట్టల్ చెన్నైలోని శ్రీ కుమరన్ సిల్క్స్‌కు మోడల్‌గా మారింది. కిరత్ భట్టల్ తెలుగు సినిమా దొంగోడి పెళ్లితో అరంగేట్రం చేసింది. అలాగే ఆమె తమిళంలో వత్తారం చిత్రం, కన్నడంలో గెలీయ చిత్రం ద్వారా ఆయా చిత్రసీమల్లో ప్రవేశించింది.

ఆమె నటి బార్బరా మోరీ, టీవీ ప్రెజెంటర్ అర్చన విజయ, మోడల్ డియాండ్రా సోరెస్, యానా గుప్తాలతో కలిసి లైఫ్ మే ఏక్ బార్- వెన్ ఏంజెల్స్ డేర్ అనే ట్రావెల్ షోను కూడా నిర్వహిస్తోంది. మొదటి ఎపిసోడ్ 18 మార్చి 2013న ప్రసారం చేయబడింది. ఆమె ఫాక్స్ ట్రావెలర్‌లో ప్రసారమైన స్టైల్ అండ్ సిటీ రెండు సీజన్‌లను కూడా నిర్వహించింది. ఆమె నేషనల్ జియోగ్రాఫిక్‌లో నాట్ జియో కవర్‌షాట్: హెరిటేజ్ సిటీ సీజన్ 4ని హోస్ట్ చేసింది. దీనికి కిరత్ భట్టల్ బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఉంది. లక్మే, క్లేర్స్, ఫెయిర్ అండ్ లవ్లీ, మోటరోలా, ఎయిర్‌టెల్, హీరో హోండా, కళ్యాణ్ జ్యూలెల్లర్స్, మాక్లీన్స్ వంటి వివిధ ఉత్పత్తులకు టీవీ వాణిజ్య ప్రకటనలను చిస్తోంది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

లైబీరియాలో జన్మించిన కిరత్ భట్టల్ చండీగఢ్‌కు చెందిన సిక్కు కుటుంబానికి చెందినది.[3] ఆమె ప్రముఖ వీడియో జాకీ గౌరవ్ కపూర్‌ని 2014 నవంబరు 2న చండీగఢ్‌లో వివాహం చేసుకుంది.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
Year Film Role Language Notes
2006 దొంగోడి పెళ్లి రత్న తెలుగు తొలి తెలుగు సినిమా
2006 వత్తారం సంగీత గురుపదం తమిళం తొలి తమిళ చిత్రం
2007 గెలీయా నందిని కన్నడం తొలి కన్నడ చిత్రం
2008 సంతోష్ సుబ్రమణియన్ రాజేశ్వరి తమిళం
2008 దురై అంజలి తమిళం
2009 నా స్టైలే వేరు దివ్య తెలుగు

మూలాలు

[మార్చు]
  1. "Women and wanderlust - The Hindu". web.archive.org. 2022-07-19. Archived from the original on 2022-07-19. Retrieved 2022-07-19.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. Priya Gill, Who's Who Archived 12 అక్టోబరు 2020 at the Wayback Machine dated 6 July 2009, at indiatoday.intoday.in, accessed 13 March 2012
  3. "The kudis of Punjab flock South - Times of India". Archived from the original on 7 July 2015. Retrieved 9 August 2015.