కిర్లోస్కర్ గ్రూప్
రకం | ప్రైవేట్ |
---|---|
పరిశ్రమ | సమ్మేళనం |
స్థాపన | 1888 |
స్థాపకుడు | లక్ష్మణరావు కిర్లోస్కర్ |
ప్రధాన కార్యాలయం | పూణే , మహారాష్ట్ర, భారతదేశం |
సేవ చేసే ప్రాంతము | ప్రపంచ వ్యాప్తం |
కీలక వ్యక్తులు | సంజయ్ కిర్లోస్కర్ (CMD, కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్) అతుల్ సి. కిర్లోస్కర్ (చైర్మన్, కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ లిమిటెడ్) రాహుల్ సి.కిర్లోస్కర్ (చైర్మన్, కిర్లోస్కర్ న్యూమాటిక్ కంపెనీ లిమిటెడ్) |
ఉత్పత్తులు |
|
ఉద్యోగుల సంఖ్య | 18,000 |
అనుబంధ సంస్థలు |
|
వెబ్‌సైట్ | www |
కిర్లోస్కర్ గ్రూప్ (Kirloskar Group) వివిధ పరిశ్రమల కలయికలతో, 1888సంవత్సరంలో స్థాపించబడిన కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్ అనే ఫ్లాగ్ షిప్, హోల్డింగ్ కంపెనీ భారతదేశపు అతిపెద్ద పంపులు, కవాటాల తయారు చేసే సంస్థ. కంపెనీ ప్రధాన కార్యాలయం మహారాష్ట్ర లోని పూణేలో ఉంది.
చరిత్ర
[మార్చు]లక్ష్మణ్ రావ్ కిర్లోస్కర్ 1888లో ఈ సంస్థను స్థాపించినాడు. కిర్లోస్కర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ భారతదేశంలో ఇంజనీరింగ్ పరిశ్రమలో స్వాతంత్ర్య పూర్వ ప్రారంభ పారిశ్రామిక సమూహాలలో ఒకటి. ఈ గ్రూపు సెంట్రిఫ్యూగల్ పంప్ లు, ఇంజిన్ లు, కంప్రెసర్ లు, స్క్రూ, సెంట్రిఫ్యూగల్ చిల్లర్స్, లేత్స్,ఎలక్ట్రిక్ మోటార్ లు, ట్రాన్స్ ఫార్మర్, జనరేటర్ లు వంటి ఎలక్ట్రికల్ పరికరాలను ఉత్పత్తి చేస్తుంది. ఆయన కుమారుడు శంతనురావు లక్ష్మణరావు కిర్లోస్కర్ సంస్థ నాయకత్వంలో కీలక పాత్ర పోషించాడు. శంతనురావ్ లక్ష్మణరావు కిర్లోస్కర్ నేతృత్వంలోని సంస్థ 1950 నుండి 1991 వరకు 32,401% ఆస్తుల పెరుగుదలతో భారతదేశ చరిత్రలో అత్యధిక వృద్ధి రేటులో ఒకటిగా నిలిచింది.[1]
పారిశ్రామికీకరణ, మార్కెట్ ఆవశ్యకతల అవగాహనతో 70 కి పైగా దేశాలకు మన ప్రపంచవ్యాప్త పరిధిని విస్తరించిన వ్యాపారసంస్థ. భారతదేశపు అతి పెద్ద ఇంజినీరింగ్ కంపెనీల్లో ఒకటిగా, దేశం పారిశ్రమిక రంగములో ఉన్నత స్థాయిలో ఉన్నది. జాతీయ పురోగతిని ప్రోత్సహించే ప్రయత్నంలో, కంపెనీల సమూహం డీజిల్ ఇంజిన్ల నుండి ఎలక్ట్రిక్ మోటార్ల వరకు విస్తృత శ్రేణి ఉత్పత్తులను,వ్యవసాయ పరికరాలు పారిశ్రామిక స్థాయి శీతలీకరణ వ్యవస్థలు,కంప్రెసర్ల నుండి రోడ్ రైలర్ల వరకు తన పారిశ్రామిక రంగాలలో ఉన్న సంస్థ.[2]
పురోగతి
[మార్చు]కిర్లోస్కర్ గ్రూప్ స్థాపన జరిగి దాదాపుగా 134 సంవత్సరాలు అయింది. కిర్లోస్కర్, భారతదేశం మొట్టమొదటి ఇంజనీరింగ్ బ్రాండ్గా, కొత్త ఉత్పత్తులను తయారుచేయడంలో ప్రసిద్ధి చెందినది. ఈ సంస్థ నుండి 1926 సంవత్సరంలో మొదటి సెంట్రిఫ్యూగల్ పంపును తయారీ, తరువాత 1940 లో డీజిల్ ఇంజిన్, ఫర్నిచర్, ఎలక్ట్రిక్ మోటారు, మెషిన్ టూల్ వంటివి ఉన్నాయి. ఆ తర్వాత మైసూరు కిర్లోస్కర్, బెంగళూరులోని కిర్లోస్కర్ ఎలక్ట్రిక్ కంపెనీ, పూణేలోని కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్లు, 1998లో కిర్లోస్కర్ న్యూమాటిక్ వంటి కొత్త కంపెనీలు ఈ సంస్థ నుండి వచ్చినవి. ప్రస్తుతం అన్ని రకాల సెంట్రిఫ్యూగల్ పంపులను ఉత్పత్తిని భారతదేశం లోనే గాక, రెండు-మూడు దేశాలు ఉన్నాయి. కిర్లోస్కర్ చే చేయబడిన సెంట్రిఫ్యూగల్ పంపులతో వరి ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడానికి, ఆగ్నేయాసియాలోని లావోస్, ఆఫ్రికాలోని సెనెగల్ లో వరి ఉత్పత్తి దాదాపు వరి ఉత్పత్తి ఆ దేశాలలో 10 రెట్లు పెరిగింది.[3]
అనుబంధ సంస్థలు
[మార్చు]కిర్లోస్కర్ గ్రూప్ అనుబంధ సంస్థలు దాదాపు 13 వరకు ఉన్నాయి.[2]
- కిర్లోస్కర్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్
- కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ లిమిటెడ్
- కిర్లోస్కర్ న్యూమాటిక్ కంపెనీ లిమిటెడ్
- కిర్లోస్కర్ ఫెర్రస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
- కిర్లోస్కర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
- కిర్లోస్కర్ చిల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్
- కిర్లోస్కర్ కెన్యా లిమిటెడ్
- కిర్లోస్కర్ అమెరికాస్ కార్పొరేషన్
- కిర్లోస్కర్ సోలార్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్
- కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్
- కిర్లోస్కర్ ఎబరా పంప్స్ లిమిటెడ్
- కిర్లోస్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ స్టడీస్
- కిర్లోస్కర్ డీజిల్ పవర్ వియత్నాం కంపెనీ లిమిటెడ్
మూలాలు
[మార్చు]- ↑ Herdeck, Margaret; Piramal, Gita (1985). India's Industrialists (in ఇంగ్లీష్). Three Continents Press. ISBN 978-0-89410-474-9.
- ↑ 2.0 2.1 "Home - Kirloskar". www.kirloskar.com. Retrieved 2022-07-07.
- ↑ "Kirloskar Brothers completed a wonderful journey of 130 years: Sanjay Kirloskar, CMD". Zee Business. 2019-03-11. Retrieved 2022-07-07.