కిర‌ణ్ బాబు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రావినూత‌ల సుబ్బారావు క‌లం పేరు కిర‌ణ్ బాబు.

పుట్టిన తేది 01-07-1950. కిర‌ణ్ బాబు పూర్వీకులది పమిడి పాడు,రావినూతల దగ్గర, ప్రకాశం జిల్లా. ఆయ‌న‌ పుట్టింది గుంటూరు కాగా, పెరిగింది - చదువు - తాడికొండ,గుంటూరులో.

ప్రస్తుత నివాసం హైదరాబాద్. ప్రైవేట్ కంపెనీ ల్లో ప‌నిచేశారు.

ప్రచురించినవి పైగంబర కవుల కవితా సంకలనాలు, రవిదాసు పదాలు, అనువాదం.

పైగంబ‌ర క‌వుల‌లో ఒక‌డు. సుగ‌మ్ బాబు, క‌మ‌లాకాంత్‌, దేవీప్రియ‌, ఓల్గా మిగిలిన న‌లుగురు పైగంబ‌ర క‌వులు.

సుగమ్ బాబు,దేవిప్రియ,కిరణ్ బాబు,ఓల్గా,కమలాకాంత్ కలిసి 1970లో “పైగంబరకవులు”గా త‌మ‌ను ప్ర‌క‌టించుకొన్నారు. 1970లో తొలి సంపుటి “యుగసంగీతం ప్ర‌చురించారు. త‌ర్వాత సంవత్సరం 1971లో రెండో సంపుటి “యుగ చైతన్యం వచ్చింది.

మగత నిద్రబోతున్న లోకం వెన్ను చరచిన ‘పైగంబర కవి కిరణ్ బాబు. కిరణ్ బాబు రాసింది చాలా తక్కువ. అందుకేనేమో తనను తాను “రాయని భాస్కరుడు గా అభివర్ణించుకుంటాడు.పైగంబరకవిత్వంతో కిరణ్ బాబు అక్షర సన్యాసం చేశాడు అని చెప్ప‌వ‌చ్చు.