వఝా సీతారామశర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వ‌ఝా సీతారామ శ‌ర్మ‌
జననంవ‌ఝా సీతారామ శ‌ర్మ‌
18 ఫిబ్రవరి, 1941
Indiaచెరుకుపల్లి, గుంటూరు,ఆంధ్రప్రదేశ్
నివాస ప్రాంతంముంబై,మ‌హారాష్ట్ర‌, ఇండియా
ఇతర పేర్లుకమలాకాంత్
వృత్తిఛీఫ్ అకౌంట్స్ మేనేజర్
రచయిత
క‌వి
భార్య / భర్తకమల

పైగంబర కవులలో కమలాకాంత్‌ఒక‌రు. దేవీప్రియ, సుగమ్‌‌బాబు, కిరణ్‌‌బాబు, ఓల్గా ల‌తో క‌లిసి 1970 ప్రాంతాల‌లో యుగసంగీతం, యుగచైతన్యం క‌వితా సంపుటాల‌ను వెలువ‌రించారు. క‌మ‌లాకాంత్‌క‌లం పేరు కాగా ఆయ‌న అస‌లు పేరు వ‌ఝా సీతారామ శ‌ర్మ‌.

18 ఫిబ్రవరి 1941లో గుంటూరు జిల్లా లోని చెరుకుపల్లిలో జన్మించారు. బాల్యం చెరుకుపల్లి, పల్లెకోనల్లో గడిచింది. విజయవాడలో పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత భారతీయ తంతి తపాలా శాఖలో 1974 వరకు పనిచేశారు. మహారాష్ట్రలోని కళ్యాణ్‌లో జనరల్ మేనేజర్, టెలికాం కార్యాలయంలో ఛీఫ్ అకౌంట్స్ మేనేజర్‌గా 1995 నుంచి పనిచేస్తూ, ఏప్రిల్ 1998లో పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం ముంబై లోని థానేలో స్థిరనివాసం ఏర్పర్చుకున్నారు. 2023 ఏప్రిల్‌లో క‌న్నుమూశారు.

సమాజాన్ని పట్టి పీడిస్తున్న అనేకానేక సామాజిక సమస్యలు ఇతివృత్తంగా 1960-74 ప్రాంతాలలో ఆయన రచించిన కథలు పలు పత్రికలలో ప్రచురితమయ్యాయి. ముగింపు లేని కథ, జీవితంలో మలుపు, బొమ్మ బొరుసు, జీవన స్పర్శ కథా సంపుటాలను; శాంత పెళ్ళి, ఆ కథ అంతే, మమత మానవత నవలలను, అసమబాహు త్రిభుజం కవితా సంపుటిని వికాస ధాత్రి డిజిటల్‌పుస్తకాలుగా ప్రచురించింది. కథలు, కవితలు, నవలలన్నిటితో కమలాకాంత్ సాహిత్యం పుస్తకాన్ని జనవరి 2023లో వికాస ధాత్రి ప్రచురించింది.