కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్
కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ | |
---|---|
దర్శకత్వం | కార్తీక్ మేడికొండ |
నిర్మాత | సుజన్ |
తారాగణం | కిరణ్, హర్షద కులకర్ణి, గాయత్రి గుప్తా |
ఛాయాగ్రహణం | సిద్ధ.కె |
కూర్పు | గోవింద్ దిట్టకవి |
సంగీతం | జీవీ (ఘంటసాల విశ్వనాధ్) |
నిర్మాణ సంస్థ | ధృవ ప్రొడక్షన్ |
విడుదల తేదీ | 14 డిసెంబరు 2017 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ 2017లో విడుదలైన తెలుగు సినిమా. ధృవ ప్రొడక్షన్ బ్యానర్ పై సుజన్ నిర్మించిన ఈ సినిమాకు కార్తీక్ మేడికొండ దర్శకత్వం వహించాడు. కిరణ్, హర్షద కులకర్ణి, గాయత్రి గుప్తా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబర్ 14, 2017న విడుదలైంది.[1]
కథ
[మార్చు]ఆర్యన్ మీడియా లో పని చేసే ఒక జర్నలిస్ట్. అతనికి మెట్రో కల్చర్ లో బ్రతికే ఒక గర్ల్ ఫ్రెండ్ స్వీటీ (హర్షద కులకర్ణి)తో సహజీవనం చేస్తుంటాడు. అయితే , ఒక పబ్ కి వెళ్ళిన ఆర్యన్ తన పర్స్ పోగొట్టుకుంటాడు. పోయిన తన పర్స్ పొందే క్రమంలో ఆర్యన్ తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే అదే సమయంలో స్వేటీ లైఫ్ స్టైల్ వల్ల ఇర్రిటేట్ అయ్యి ఆర్యన్ తన దగ్గర నుండి వెళ్లిపోమంటాడు. అలా వెళ్ళమని చెప్పిన మరుసటి రోజే స్వీటీ హత్యకు గురవుతుంది. ఆర్యన్‌ను ఓ కాల్ గర్ల్ (గాయత్రి గుప్త) బ్లాక్ మెయిల్ చేస్తుంటుంది. అసలు ఆ హత్యకు ఆర్యన్‌కు లింక్ ఏంటి ? ఆ కాల్ గర్ల్ ఆర్యను ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తుంటుంది ? ఆ తరువాత ఏమి జరిగింది అనేదే మిగతా సినిమా కథ.[2]
నటీనటులు
[మార్చు]- కిరణ్
- హర్షద కులకర్ణి
- గాయత్రి గుప్తా
- కత్తి మహేష్
- సందీప్తి
- ప్రవీణ్
- సురేష్
- మాధవి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ధృవ ప్రొడక్షన్
- నిర్మాత: సుజన్
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కార్తీక్ మేడికొండ
- సంగీతం : జీవీ (ఘంటసాల విశ్వనాధ్)
- సినిమాటోగ్రఫీ: సిద్ధ.కె
- ఎడిటర్: గోవింద్ దిట్టకవి
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (14 December 2017). "Kiss Kiss Bang Bang Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes". Archived from the original on 17 ఆగస్టు 2021. Retrieved 17 August 2021.
- ↑ 123 Telugu (14 December 2017). "Kiss Kiss Bang Bang Telugu Movie Review | Kiss Kiss Bang Bang Movie Review |". Archived from the original on 17 ఆగస్టు 2021. Retrieved 17 August 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)