కుందహార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కుందహార్
कुँडहर
Lua error in మాడ్యూల్:Location_map at line 526: Unable to find the specified location map definition: "Module:Location map/data/Nepal Gandaki Province" does not exist.
Coordinates: 28°12′07″N 84°00′51″E / 28.2020736°N 84.0142915°E / 28.2020736; 84.0142915
Country Nepal
Provinceగందకి ప్రావిన్స్
Districtకాస్కీ జిల్లా
Time zoneUTC+5:45 (నేపాల్)
Postal Code
33700
ప్రాంతపు కోడ్061

కుందహార్ (నేపాలీ: कुँडहर) నేపాల్‌లోని పోఖారా ప్రాంతంలో  కలదు. ఈ ప్రాంతం  పోఖారా మెట్రోపాలిటన్ సిటీ లోని 12,13,14  వార్డుల వరకు  వ్యాపించి ఉంది.[1][2]

ఎడ్యుకేషన్

[మార్చు]

కుందహార్‌లో అనేక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి.

ప్రభుత్వ/ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు

[మార్చు]
  • కుందహార్ ప్రాథమిక పాఠశాల
  • శ్రీ అమర్‌సింగ్ మోడల్ హయ్యర్ సెకండరీ స్కూల్
  • కాస్కీ అకాడమీ
  • బేస్లైన్ అకాడమీ స్కూల్.
  • బల్విధ్య మందిర్ సెకండరీ బోర్డింగ్ స్కూల్
  • పోఖారా యునైటెడ్ అకాడమీ

పోఖారా యునైటెడ్ అకాడమీ

[మార్చు]

భద్రకాళి డెవలప్ మెంట్ కంపెనీ ప్రయివేట్ లిమిటెడ్ పరిధిలో ఉన్న పోఖారా యునైటెడ్ అకాడమీలో సుమారు 600 మంది విద్యార్థులు ,75 మంది బోధన,బోధనాేతర సిబ్బంది పనిచేస్తున్నారు.ఈ అకాడమీ 10 రోపానీల భూభాగంలో విస్తరించి ఉంది.పాఠశాల ఆధునిక నిర్మాణం అన్ని విధాల భద్రతనిస్తుంది. తరగతి గదులు పెద్దవిగా ,విశాలంగా గాలి,వెలుతూరు వచ్చే విధంగా ఆహ్లాదకరంగా ఉన్నాయి.తరగతి గదులలోని ఫర్నిచర్ విద్యార్థులందరికీ సౌకర్యవంతంగా ఉంది. పాఠశాల చుట్టూ ప్రహారి గోడ కలదు. చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు పచ్చని ప్రకృతితో ఎంతో సుందరంగా ఉంటాయి.

ఈ అకాడమీకి సోదర సంస్థ అయినా స్మాల్ హెవెన్ మాంటిస్సోరి, కేవలం 100 మీటర్ల దూరంలో  పశ్చిమాన ఉంది.ఇది ఎన్ ఈబికి అనుబంధంగా సైన్స్ అండ్ మేనేజ్ మెంట్ లో ప్లస్ టూ ప్రోగ్రామ్ ను నడుపుతోంది.

పోఖారా యునైటెడ్ అకాడమీ సెకండరీ స్కూల్ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో విద్యా శ్రేష్టతపై కూడా దృష్టి సారించింది."జీవితానికి విద్య" అనే నినాదంతో, పోఖారా యునైటెడ్ అకాడమీ పోఖారాలో అధిక నాణ్యత కలిగిన సమర్థవంతమైన విద్యను అందించడానికి సిద్ధంగా ఉంది.[3]

మతపరమైన స్థలాలు

[మార్చు]

భద్రకాళి దేవాలయం

[మార్చు]

భద్రకాళి ఆలయం (పోఖరా) (నేపాలీ: भद्रकाली मन्दिर) ఒక ప్రాచీనమైన దేవాలయం. పోఖారా నగరంలో ఒక చిన్న కొండపై, కుందహార్ ప్రాంతంలో కలదు.ఇక్కడ కొలువుదీరిన దేవత కాళి.1817 సంవత్సరంలో స్థాపించబడిన ఈ ఆలయంలో భద్రకాళి, దుర్గాదేవి  విగ్రహలు ఉన్నాయి.ఈ భద్రకాళి హిందువుల దేవతాలయం  పైకి చేరుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి.ఆలయానికి తూర్పు మార్గంలో 292 మెట్లు ఎక్కి,దక్షిణ భాగంలో ను 265 మెట్లు ఎక్కి భద్రకాళి అమ్మవారినిచేరుకోవచ్చు.

మాటేపని గుంబా

[మార్చు]

మాటేపని గుంబా ఆలయం కుందహార్ ప్రాంతంలోని  కాస్కి జిల్లాకి  పశ్చిమాన కలదు.పోఖారా నగరానికి వలస వచ్చిన ‘ఎడిబీ నైషాన్ ప్రజలు’1960 వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని నిర్మించారు.పోఖారా నగరానికి తూర్పున ఒక చిన్న కొండపై ఉన్న ఈ మఠం మహేంద్ర పుల్ నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది.ఈ గుంబా ఆలయం  పచ్చటి కొండ శిఖరంపై ఉంది.

మస్జిద్ అక్సా

[మార్చు]

మస్జిద్ అక్సా ముస్లింల ప్రార్థనా స్థలం. ఇది మియాపటాన్ వద్ద ఉంది.ఈ స్థలంలో ముస్లింలు ప్రత్యేకమైన ప్రార్ధనలు చేస్తారు.ఈ ప్రదేశం కుందలహర్ అనే పేరుతో చాలా ప్రసిద్ధి చెందింది. కానీ కుందహార్ మియాపటాన్ కంటే పెద్దది. మియాపటాన్ అంటే 'ముస్లింలు ఉపయోగించే భూమి' అని అర్థం.[4]

ఆర్థిక వ్యవస్థ

[మార్చు]

కుందహార్ ప్రాంతంలో

  • ముక్తినాథ్ బికాష్ బ్యాంక్,
  • లక్ష్మీ బ్యాంక్,
  • కుందహార్ సహకరి బ్యాంక్ ,
  • ప్రభు బ్యాంక్ లు ఉన్నాయి.

పోఖారా ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో అనేక పరిశ్రమలు కలవు.

కమ్యూనికేషన్

[మార్చు]

ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు

[మార్చు]
  • నేపాల్ టెలికాం
  • వియానెట్
  • క్లాసిక్ టెక్
  • వరల్డ్ లింక్

రవాణా సౌకర్యం

[మార్చు]

కుందహార్ నుండి మియాపటాన్,మియాపటాన్ నుండి బగర్,అలాగే  ఖౌఖోలా నుండి మహేంద్రపుల్, చౌతే నుండి బగర్ వరకు స్థానిక పబ్లిక్ బస్సులు ఉన్నాయి.స్థానిక టాక్సీలు కూడా అందుబాటులో ఉంటాయి.[5]

హోటళ్లు, లాడ్జిలు

[మార్చు]

ఈ ప్రాంతంలో రాయల్ పామ్ రిసార్ట్ లాంటి పెద్ద పెద్ద హోటళ్లు, లాడ్జీలు కలవు.  

గ్యాలరీ

[మార్చు]


మూలాలు

[మార్చు]
  1. "Kundahar · పోఖారా 33700, నేపాల్". Kundahar · పోఖారా 33700, నేపాల్. Retrieved 2021-12-09.
  2. "Kundahar" (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2021-12-09.
  3. "Pokhara United Academy". Edusanjal (in ఇంగ్లీష్). Retrieved 2021-12-09.
  4. "The Musalman (Muslim) of Pokhara, Nepal". PHOTOGRAPHY . TRAVEL . FAMILY (in ఇంగ్లీష్). 2015-02-12. Retrieved 2021-12-09.
  5. "wikipedia.org/wiki/Kundahar".{{cite web}}: CS1 maint: url-status (link)

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=కుందహార్&oldid=4305561" నుండి వెలికితీశారు