కునాల్, హర్యానా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కునాల్
పురాతత్వ ప్రదేశం
దేశంభారతదేశం
ప్రావిన్సుహర్యానా
Time zoneUTC+5.30 (Indian Standard Time)
భారతదేశం లోని హర్యానా గుండా ప్రవహించే ఘగ్గర్ నది. ఘగ్గర్-హకరా వ్యవస్థను ఆధునిక (శ్వేతజాతి) శాస్త్రవేత్తలు వేద కాలం నాటి సరస్వతి నదిగా గుర్తిస్తున్నారు

కునాల్ అన్నది భారతదేశానికి చెందిన హర్యానా రాష్ట్రంలోని ఫతేహబాద్ జిల్లాలో నెలకొన్న హరప్పా పూర్వ మానవ నివాస ప్రాంతం. సింధు లోయ నాగరికత ప్రదేశాల్లో కాళిబంగాన్ వంటి పట్టణాలు, రాఖీగరి వంటి నగరాలతో పోలిస్తే ఇది సింధులోయ నాగరికత కాలంలో గ్రామం. సరస్వతీ నది మైదానంలో ఇది నెలకొంది.[1]


చారిత్రిక ప్రాధాన్యత[మార్చు]

ప్రాథమిక స్థాయిలో ఈ చిన్న జనావాసం (1 హెక్టారు) హక్రా వస్తు అవశేషాలను అందించింది. కృత్రిమంగా ఎత్తుచేసిన ప్రదేశంలో ఇళ్ళు నిర్మితమయ్యాయి.[2]

బటన్ సీల్[మార్చు]

1998-99లో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా చేపట్టిన పురాతత్వ తవ్వకాల్లో బటన్ సీల్ దొరకడంతో రెహ్మాన్ ధెరీ కన్నా సాంస్కృతికంగా ఈ నాగరికత ప్రాచీనమని ఉదాహరణ ఇచ్చింది.[3] ఈ సీల్ లో రెండు జింకల బొమ్మ ఒకవైపు, రేఖాగణిత నమూనా మరోవైపు ఉంటాయి. వీటిని చారిత్రక పరిశోధకులు బెలూచిస్తాన్ కు చెందిన క్రీ.పూ.4వ శతాబ్దికి చెందిన రెహ్మాన్-ధెరీ నమూనాతో పోల్చుతుంటారు.[3]

తొట్టతొలి పూర్వ హరప్పా[మార్చు]

ఈ ప్రదేశం తొట్టతొలి పూర్వ హరప్పా ప్రదేశంగా గుర్తిస్తున్నారు.[1]

పరిశోధన, ఆవిష్కరణ[మార్చు]

కుండలపై రావి ఆకులు (ఫైకస్ రిలిజియాసా), గూని ఎద్దు వంటి డిజైన్లు[2] హరప్పా ముద్రల్లో కనిపిస్తూన్నాయి. ఎముకతో చేసిన ఉపకరణాలు, సునిశిత బ్లేడ్లు, చేపల గాలం ముల్లు, బాణపు ములుకులు వంటివీ దొరికాయి.[2] ఆరు ముద్రలు దొరికాయి.[2] ఆరు ముద్రలు చతురస్ర ఆకారంలో, గోధుమరంగు రాయి సాధారణ పరిణత హరప్పా ముద్రను గుర్తుచేస్తున్నాయి.[1]

బయటి లంకెలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; jane అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. 2.0 2.1 2.2 2.3 Singh, Upinder (2008). A History of Ancient and Early Medieval India : from the Stone Age to the 12th century. New Delhi: Pearson Education. pp. 109, 145–6. ISBN 9788131711200.
  3. 3.0 3.1 Archaeological Survey of, India (2004). "Excavations at Kunal,Haryana" (PDF). Indian Archaeology 1998-99 A Review: 11–12. Archived from the original (PDF) on 8 మే 2012. Retrieved 13 July 2012.