Jump to content

కుప్పా వెంకటేశ్వర ప్రసాద శర్మ

వికీపీడియా నుండి

కుప్పా వేంకటేశ ప్రసాద శర్మ వీరు పుట్టిన తేది: 24-07-1993 తండ్రి శివ సుబ్రహ్మణ్య అవధాని వీరు తిరుమలలోని వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపల్‌గా, తిరుపతిలోని ఎస్‌వీ వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు, తల్లి శ్రీమతి సీతా నాగలక్ష్మి ప్రసాద శర్మ ప్రాథమిక విద్యాభ్యాసం హైదరాబాద్ లో పూర్తి కాగా వేద విద్యను తిరుపతిలో కొనసాగించి గత 5 సంవత్సరాలుగా శృంగేరిలోని శాస్త్ర, తర్క, మీమాంస వేదాంత శాస్త్రాల్లో నిష్ణాతులయ్యారు .. జగద్గురువుల వద్ద శిష్యరికం చేసి వారి ఆశీరానుగ్రహానికి పాత్రులయ్యారు . శృంగేరి శారదా పీఠాధీశ్వరులుగా 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరిగిన విశేష గురువందన ఉత్సవంలో శ్రీ శ్రీ శ్రీ భారతి తీర్థ మహాస్వామి శృంగేరి పీఠానికి ఉత్తరపీఠాధికారిగా వేంకటేశ్వర ప్రసాద శర్మను ప్రకటించారు.

కుటుంబం

[మార్చు]

వెంకటేశ్వర ప్రసాద్ శర్మ గారి తల్లిదండ్రులు సీతానాగలక్ష్మీ, శివసుబ్రహ్మణ్య అవధాని. ఈయన సోదరుడు కుప్పా వేంకట కౌండిన్యశర్మ ముంబయిలో ఇంజనీరుగా పనిచేస్తున్నారు. ఈయన అక్క శ్రీకృష్ణప్రియ అమెరికాలో ఉంటున్నారు. ఈయన తాత, అవ్వలు కుప్పా రామగోపాల వాజపేయయాజి, కల్పకాంబ సోమపీఠిని.

బాల్యం

[మార్చు]

కుప్పా వేంకటేశ్వర ప్రసాద శర్మ తిరుపతిలో శర్మ పుట్టాడు. అప్పటికి తండ్రి శివ సుబ్రహ్మణ్య అ తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో వేద పారాయణదారుగా ఉన్నారు . శ్రీగోవింద రాజస్వామి జన్మనక్షత్రమైన ఉత్తరానక్షత్రంలో పుట్టడం, అదీ శనివారం కావడంతో తనయుడికి ఆ స్వామివారి పేరే పెట్టుకున్నారు శివ సుబ్రహ్మణ్య అవధాని. శర్మ పుట్టకముందు ఆయన తిరుమల ఆలయంలో వేద పారాయణదారుగా ఉండేవారు. తమ తల్లిదండ్రులకు మూడో సంతానం. ఎల్‌కేజీ నుంచి రెండో తరగతి వరకు సికింద్రాబాద్ సైనిక్‌పురిలోని భవాన్స్ శ్రీరామకృష్ణ విద్యాలయలో చదివారు. తర్వాత తండ్రి అతడిని స్కూల్ మాన్పించి తాతగారు కుప్పారామగోపాల వాజపేయయాజి దగ్గర కృష్ణ యజుర్వేదం అధ్యయనం చేయించారు. అలా శర్మకు తాతగారే తొలిగురువు. తొమ్మిదేళ్లలో శర్మ కృష్ణయజుర్వేదం పూర్తి చేశారు. అనంతరం శృంగేరీలో చేరారు. అక్కడ ఐదేళ్లపాటు సంస్కృత సాహిత్యం, తర్కశాస్త్రం అభ్యసించారు. శర్మ ప్రస్తుతం వేదాంత శాస్త్రం చదువుతున్నారు

నేపథ్యం

[మార్చు]

సుమారు పన్నెండొందల సంవత్సరాల కిందట దక్షిణ భారతీయుల ఫుణ్యఫలంగా కేరళలోని కాలడి సమీపాన పూర్ణానది తీరంలో శంకరులుగా అవతరించారు శంకర భగవత్పాదులు. అందుకే ఆయన ఆది శంకరులు అయ్యారు. ఆయన తన ఎనిమిదో యేటనే చతుర్వేదాలను ఔపోసన పట్టారు. తాను భౌతికంగా ఉన్న 32 ఏళ్లలో 12 ఏళ్ల పాటు సమస్త వైదిక విద్యలు అధ్యయనం చేశారు. పదహారేళ్లకే శంకరభాష్యాలు (ప్రస్థానత్రయం) రాశారు. మిగిలిన పదహారేళ్లకే దేశమంతా విజయ యాత్ర చేశారు. ‘అద్వైతం’ అనే వేద ధర్మాన్ని స్థాపించారు. నలుగురు శిష్యులను తయారు చేశారు. ఆ నలుగురు శిష్యులతో ప్రపంచ యాత్ర చేస్తూ శంకరులవారు శృంగేరి లోని తుంగానది తీరంలోకి వచ్చారు. అక్కడ ఆశ్చర్యకమైన సంఘటన చూశారు. ఒక కప్ప ప్రసవిస్తోంటే దానికి పాము తన పడగ నీడ పడుతోంది. సహజవైరం కలిగిన జంతువులే అలా మిత్రబంధంతో ఉండే స్థల మహత్యాన్ని గుర్తించారు. అందుకే మొదటి పీఠాన్ని ఇక్కడే స్థాపించాలని సంకల్పించారు. తన శిష్యపరంపరలో మొదటి పీఠాధిపతిగా సురేశ్వరాచార్యులవారిని నియమించారు. సాక్షాత్తు సరస్వతీదేవిని శారదాదేవిగా ప్రతిష్ఠింపచేశారు. ఆ పరంపరలో ప్రస్తుతం శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ మహాస్వామి వారు 36వ పీఠాధిపతి. ఆయనే ఇప్పుడు ఉత్తరపీఠాధికారిగా వేంకటేశ్వర ప్రసాద శర్మను ప్రకటించారు.[1]

మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]