Jump to content

కూచాడి శ్రీహరి రావు

వికీపీడియా నుండి
కే. శ్రీహరి రావు

వ్యక్తిగత వివరాలు

జననం 1960
దిమ్మదుర్తి, మామడ మండలం,నిర్మల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ జనతా పార్టీ
తల్లిదండ్రులు కె. ప్రకాష్ రావు
జీవిత భాగస్వామి శ్రీదేవి
సంతానం స్నేహ రావు, మాధురి రావు

కూచాడి శ్రీహరి రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో నిర్మల్ శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

కే. శ్రీహరి రావు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ అహోదాల్లో పనిచేసి 1995లో మామడ మండలాధ్యక్షుడిగా గెలిచాడు. ఆయన 2001లో మామడ జడ్పీటిసిగా ఎన్నికైన అనంతరం జడ్పీలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్‌గా, 2002లో ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, 2005లో పీసీసీ సభ్యుడిగా వివిధ హోదాల్లో పనిచేశాడు. శ్రీహరి రావు 2007లో తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.

శ్రీహరి రావు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో నిర్మల్ శాసనసభ నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో చేసి ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత 2010 నుండి 2013 వరకు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి తెలంగాణ  ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత  2014లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.

శ్రీహరి రావు 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆయన 2023 శాసనసభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి జూన్ 14న రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[2][3] ఆయన 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో నిర్మల్ శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు[4].

ఆస్తులు-కేసులు

[మార్చు]
  • 2023 ఎన్నికల అఫిడివిట్ ప్రకారం ఆస్తులు 7,88,53,722 రూపాయలు.[5]
  • ఇతనిపై ఎలాంటి కేసులు లేవు.[5]

మూలాలు

[మార్చు]
  1. TV9 Telugu (15 October 2023). "తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. పోటీలో నిలిచేది వీరే." TV9 Telugu. Archived from the original on 10 November 2023. Retrieved 10 November 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Sakshi (15 June 2023). "కేసీఆర్ కు బిగ్ షాక్... కాంగ్రెస్ లో చేరిన శ్రీహరి రావు". Archived from the original on 24 December 2023. Retrieved 24 December 2023.
  3. A. B. P. Desam (14 June 2023). "కాంగ్రెస్ లో చేరిన శ్రీహరి రావు, నోముల ప్రకాష్ గౌడ్ - బలమైన నేతలు చేరుతున్నారన్న రేవంత్ ర". Archived from the original on 24 December 2023. Retrieved 24 December 2023.
  4. Eenadu (10 November 2023). "పట్టు వదలని విక్రమార్కులు". Archived from the original on 10 November 2023. Retrieved 10 November 2023.
  5. 5.0 5.1 "K. Srihari Rao(Indian National Congress(INC)):Constituency- NIRMAL(NIRMAL) - Affidavit Information of Candidate:". www.myneta.info. Retrieved 2023-11-26.