కూచిపూడి సాంబశివరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కూచిపూడి సాంబశివరావు

రాష్ట్ర గ్రంధాలయ సంస్థ ఛైర్మన్
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2004 - 2009
నియోజకవర్గం తాడికొండ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం జులై 23
ప్యాపర్రు, అమృతలూరు మండలం, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
మరణం 2020 మార్చి 2
గుంటూరు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి విజయ
నివాసం గుంటూరు
వృత్తి రాజకీయ నాయకుడు

కూచిపూడి సాంబశివరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్‌గా పని చేశాడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

కూచిపూడి సాంబశివరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, బాపట్ల జిల్లా, అమృతలూరు మండలం, ప్యాపర్రు గ్రామంలో జన్మించాడు. ఆయన నాగార్జున యూనివర్సిటీ నుండి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

కూచిపూడి సాంబశివరావు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఆయన 1985, 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాడికొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారుడు. సాంబశివరావుకు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన 1989, 2004, 2009 ఎన్నికల్లో పార్టీ టికెట్‌ దక్కలేదు. వైఎస్ చేపట్టిన పాదయాత్రలోనూ పాల్గొన్న ఆయనకు 2004లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 2005లో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నియమితుడయ్యాడు. సాంబశివరావు వైయస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగి 2019లో టీడీపీలో చేరాడు.

మరణం

[మార్చు]

సాంబశివరావు అనారోగ్యంతో బాధపడుతూ గుంటూరులోని తన నివాసంలో 2020 మార్చి 2న మరణించాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. Andhra Jyothy (2 March 2020). "కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కన్నుమూత" (in ఇంగ్లీష్). Archived from the original on 6 June 2022. Retrieved 6 June 2022.