కూపన్ మాల్
కూపన్ మాల్, అనేది ఫూల్ చంద్ ఎక్స్ పోర్ట్సులిమిటెడ్కి చెందిన బెంగళూరు లోని ప్రతీక్ అపారెల్సుచే నిర్వహింపబడుతున్న బ్రాండెడ్ వస్త్రాలు విక్రయించే ఒక షాపింగ్ మాల్. పురుషులకు, స్త్రీలకు, పిల్లలకు వస్త్రాలనే కాకుండా పాద రక్షలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర వస్తువులను ఇందులో విక్రయిస్తుంది.ఇది బెంగుళూరులో ప్రారంభించిన తన మొదటి లైఫ్ స్టైల్ మాల్.దీనిని 2013 జూన్ లో ప్రారంభించబడింది.ఫూల్‌చంద్ గ్రూపు కంపెనీల వస్త్ర తయారీ విభాగమైన బెంగళూరుకు చెందిన ప్రతీక్ అపెరెల్సు బెంగుళూరులో తన మొదటి లైఫ్ స్టైల్ మాల్ 'కూపన్' ను ప్రారంభించడంతో వ్యవస్థీకృత రిటైల్ వ్యాపారంలోకి అడుగుపెట్టింది.దీనిని హోసూర్ రోడ్‌లోని మొదటి స్టోర్ నాలుగు అంతస్తుల్లో మొత్తం 50,000 అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబడింది. వచ్చే ఏడాదిలోపు దేశవ్యాప్తంగా కనీసం 12 మాల్సును రిటైల్ ఆర్మ్ ప్రతీక్ లైఫ్‌స్టైల్ ద్వారా ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా కంపెనీ ప్రతినిధులు ఈ సందర్బంగా చెప్పారు.ఇంకా ప్రతీక్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ అగర్వాల్ గత ఒక దశాబ్ద కాలంగా దుస్తులు, ఫ్యాషన్ రంగంలో ఉన్నట్లుగానూ,ఇప్పుడు వారు వారి స్వంత బ్రాండెడ్ రిటైల్ వ్యాపారంలోకి ప్రవేశించినట్లు తెలిపాడు.[1]
కూపన్ మాల్ లు ఉండే నగరాలు
[మార్చు]- బెంగళూరు (హొసూర్ రోడ్డు)
- హైదరాబాదు (ప్యారడైజ్ సర్కిల్, అబిడ్స్)
- ఛత్తీస్ ఘడ్ లోని రాయ్ పూర్
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Reporter, B. S. (2007-06-28). "Prateek Apparels enters retail". Business Standard India. Retrieved 2020-08-16.