కూరేశులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కూరేశుడు లేదా కూరేశులు విశిష్టాద్వైత సిద్ధాంత ప్రవర్తకుల్లో ప్రముఖులుగా పేరొందిన రామానుజుల శిష్యులలో సర్వప్రథములు. వీరు కంచి సమీపంలోని కూర అనే గ్రామంలో సా.శ.1008 సంవత్సరంలో పుష్యమాసం హస్తా నక్షత్రంలో అనంతభట్టార్యులకు కుమారులుగా అవతరించారు. అనంతభట్టాచార్యులు కూర గ్రామాధిపతి, గొప్ప సంపన్నులు. కూరేశులు బాల్యదశలోనే తన ప్రతిభా విశేషాన్ని వ్యక్తం చేసి కాలక్రమేణా పెద్దవాడై, సకల విద్యలను అనతికాలంలోనే అభ్యసించారు. వ్యాకరణ శాస్త్రంలో వీరికి గల విశేష పాండిత్యం వల్ల 'నడయాడుమ్ పతంజలి' (నడిచే పతంజలి) అనే బిరుదు వచ్చింది. తండ్రి తదనంతరం కూర గ్రామాధిపత్యాన్ని చక్కగా నిర్వహిస్తున్న ఆయన ఆండాళ్ అనే బ్రాహ్మణ కన్యను వివాహం చేసుకున్నారు. కూరేశులకు క్రమంగా ఇహలోక సుఖాలపై వైరాగ్యం ఎక్కువై అపారమైన ఐశ్వర్యాన్ని, అధికారాన్ని తృణప్రాయంగా త్యజించి, సతీమణితో కలసి శ్రీరంగాన్ని చేరి, అక్కడ శ్రీరామానుజాచార్యులను ఆశ్రయించి వారి అంతరంగ శిష్యులైనారు.[1]

మూలాలు

[మార్చు]
  1. కూరేశులు, ఈ.ఎ.ఆర్.రామన్, సప్తగిరి ఫిబ్రవరి 2007 పత్రికలో ప్రచురించిన వ్యాసం.
"https://te.wikipedia.org/w/index.php?title=కూరేశులు&oldid=3496388" నుండి వెలికితీశారు