Jump to content
వికీ పాఠకులే వికీ రచయితలు!
వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.

కూసంపూడి శ్రీనివాస్

వికీపీడియా నుండి

కూసంపూడి శ్రీనివాస్ ప్రముఖ వ్యాస రచయిత, రాజకీయ విశ్లేషకుడు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి.


జీవిత విశేషాలు

కూసంపూడి శ్రీనివాస్ గారిది పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి స్వగ్రామం.  తల్లితండ్రులు వెంకటరత్నం, వెంకటలక్ష్మి గార్లు. 2000లో సరస్వతి గారితో వివాహం జరిగింది. వీరికి జాహ్నవి శ్రీవల్లి ప్రవల్లిక, నిహారిక అనే ఇద్దరు కుమార్తెలు.


రాజకీయ జీవితం

కూసంపూడి శ్రీనివాస్ గారు 2001 సం.లో జరిగిన అత్తిలి గ్రామ పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు . ఆ తరువాత వివిధ కారణాల రీత్యా హైదరాబాద్ లో స్థిర పడ్డారు. ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే 2006 నుండి సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఉద్యమ సమయంలో అనేక సార్లు అరెస్ట్ అయ్యారు. వారు స్థాపించిన సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి సంస్థనే రాజకీయ పార్టీగా రిజిస్టర్ చేయించి 2014 సార్వత్రిక ఎన్నికల్లో కూకట్ పల్లి నియోజక వర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. విజయం సాధించక పోయినా గౌరవ ప్రదమైన ఓట్లు సాధించారు . ఎన్నికల తరువాత జయ ప్రకాష్ నారాయణ గారి ఆహ్వానం మేరకు లోక్ సత్తా పార్టీలో చేరి ఆ పార్టీ అధికార ప్రతినిధి గా పనిచేశారు. జేపీ గారు లోక్ సత్తా పార్టీ ఇక రాజకీయంగా కాక ఉద్యమ సంస్థగా పనిచేస్తుందని ప్రకటించిన తరువాత అన్ని ఛానెల్స్ లకు రాజకీయ విశ్లేషకు డిగా చర్చల్లో పాల్గొన్నారు. 2019 ఎన్నికల తరువాత సెప్టెంబర్ 4, 2019న జనసేన పార్టీలో చేరి, ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు.     


పాత్రికేయ జీవితం

2013 నుండి రాజకీయ, సామాజిక అంశాలపై వ్యాసాలు రాయడం మొదలు పెట్టారు. అన్ని ప్రధాన తెలుగు పత్రికలలో వీరి వ్యాసాలు ప్రచురితం అయ్యాయి. ఇప్పటివరకు దాదాపు 250కి పైగా వ్యాసాలు రాశారు. వాటిలో ప్రధానంగా రిజర్వేషన్లలో సంస్కరణలు, నయీమ్ నవీన పిండారీలు, అత్యాచారాలు ఆగుతాయా?, మానవ వనరులతోనే ఆర్థికాభివృద్ధి, యాత్రలు... అధికారానికి మాత్రలా?, రాయలసీమ ఆత్మఘోష, తదితర వ్యాసాలు బహుప్రాచుర్యం పొందాయి.