కృతిక జయకుమార్
Jump to navigation
Jump to search
కృతిక జయకుమార్ | |
---|---|
జననం | కృతిక ఏప్రిల్ 30, 1997 |
వృత్తి | నటి, శాస్త్రీయ నృత్యకారిణి |
క్రియాశీల సంవత్సరాలు | 2014–ప్రస్తుతం |
తల్లిదండ్రులు |
|
కృతిక జయకుమార్ దక్షిణ భారతదేశ చలనచిత్ర నటి, శాస్త్రీయ నృత్యకారిణి.[1] 2014లో వచ్చిన దృశ్యం సినిమాలోని అంజు పాత్రతో సినిమారంగంలోకి ప్రవేశించింది.
జననం - విద్యాభ్యాసం
[మార్చు]కృతిక 1997, ఏప్రిల్ 30న బిఆర్ జయకుమార్, పద్మిని దంపతులకు కర్నాటకలోని బెంగళూరులో జన్మించారు. బెంగళూరులోని క్లారెన్స్ హైస్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తిచేసిన కృతిక, మౌంట్ కార్మెల్ కళాశాలలో డిగ్రీ పూర్తిచేసింది.
కళారంగం
[మార్చు]ఏడేళ్ల వయస్సు నుండే భరతనాట్యం చేయడం ప్రారంభించిన కృతిక, బెంగుళూరులో గురు శ్రీ మిథున్ శ్యామ్ ఆధ్వర్యంలో శిక్షణ పొందింది.
సినిమారంగం
[మార్చు]కృతిక తిరువనంతపురంలో ఒక ప్రదర్శన ఇచ్చినపుడు, మలయాళ చిత్ర దర్శకుడు బాల కిరియాత్ చూసి సినిమారంగంలోకి రావాలని సూచించాడు. ఆ తరువాత ఆడిషన్ ద్వారా మలయాళ చిత్రం దృశ్యం తెలుగు రీమేక్ దృశ్యం సినిమాలో వెంకటేష్ కుమార్తె పాత్రకు ఎంపికైంది. ఈ చిత్రం నటిగా మంచి గుర్తింపును ఇచ్చింది.[2]
నటించిన చిత్రాలు
[మార్చు]సంవత్సరం | చిత్రంపేరు | పాత్రపేరు | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2014 | దృశ్యం | అంజు | తెలుగు | |
2015 | బాక్సర్ | లక్ష్మీ | కన్నడ | |
2015 | వినవయ్య రామయ్య[3] | జానకి | తెలుగు | |
2016 | రోజులు మారాయి | ఆద్య | ||
2016 | ఇంట్లో దెయ్యం నాకేం భయం[4] | ఇందుమతి | ||
2019 | కవచ[5] | రేవతి | కన్నడ | |
TBA | సంతన దేవన్ | తమిళం | నిర్మాణం |
మూలాలు
[మార్చు]- ↑ The Times of India, Entertainment (25 March 2019). "My dream of acting with Shivarajkumar is fulfilled: Kruthika Jayakumar" (in ఇంగ్లీష్). Archived from the original on 11 మే 2019. Retrieved 30 January 2020.
- ↑ Rajendra, Ranjani (10 July 2014). "Films by chance". The Hindu. Archived from the original on 11 May 2015. Retrieved 30 January 2020.
- ↑ ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి-రివ్యూ (19 June 2015). "వినవయ్యా రామయ్య". www.andhrajyothy.com. Archived from the original on 30 జనవరి 2020. Retrieved 30 January 2020.
- ↑ "Intlo Deyyam Nakem Bhayam (Cast & Crew)". Telugu Mirchi.com. Archived from the original on 2020-01-31. Retrieved 2020-01-31.
- ↑ The New Indian Express, Entertainment (1 April 2019). "I want to make a lasting impression with my roles: Kruthika Jayakumar". Archived from the original on 1 ఏప్రిల్ 2019. Retrieved 30 January 2020.