Jump to content

కృనాల్ పాండ్యా

వికీపీడియా నుండి
(కృనాల్‌ పాండ్యా నుండి దారిమార్పు చెందింది)
కృనాల్‌ పాండ్యా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కృనాల్‌ హిమాన్షు పాండ్యా
పుట్టిన తేదీ (1991-03-24) 1991 మార్చి 24 (వయసు 33)
బరోడా, గుజరాత్ రాష్ట్రం
బ్యాటింగుఎడమచేతి బ్యాట్స్ మెన్
బౌలింగుఎడమచేతి స్పిన్ బౌలింగ్
బంధువులుహార్దిక్ పాండ్యా (తమ్ముడు )
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 233)2021 మార్చి 23 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే2021 మార్చి 28 - ఇంగ్లాండ్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.36
తొలి T20I (క్యాప్ 78)2018 4 నవంబరు - వెస్ట్ ఇండీస్ తో
చివరి T20I2019 నవంబరు 7 - బంగ్లాదేశ్ తో
T20Iల్లో చొక్కా సంఖ్య.24
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2012–presentబరోడా క్రికెట్ టీం
2016 – ప్రస్తుతంముంబై ఇండియన్స్ (స్క్వాడ్ నం. 24)
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డే ఇంటర్నేషనల్ ట్వంటీ ట్వంటీ ఇంటర్నేషనల్ FC లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 3 18 8 67
చేసిన పరుగులు 95 121 470 2,041
బ్యాటింగు సగటు 95.00 24.20 31.33 38.50
100లు/50లు 0/1 0/0 2/2 2/12
అత్యుత్తమ స్కోరు 58* 26* 160 133*
వేసిన బంతులు 60 398 683 3,084
వికెట్లు 1 14 14 81
బౌలింగు సగటు 59.00 38.42 25.85 31.49
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0 2
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 1/59 4/36 4/40 6/41
క్యాచ్‌లు/స్టంపింగులు 0/0 7/0 4/0 23/0
మూలం: ESPNcricinfo, 28 మార్చ్ 2021

కృనాల్‌ పాండ్యా (జ. మార్చి 24, 1991) బరోడా క్రికెట్ టీంకు చెందిన భారత ఆటగాడు . ఇతను ఎడమ చేతి ఆటగాడు, బౌలర్. ఆయన 2018లో టీ-20 , 2021లో వన్డేల్లో తొలిసారి భారత జట్టు తరపున ఆడాడు.[1] కృనాల్‌ పాండ్యా బరోడా క్రికెట్ జట్టు, ఐ.పి.ఎల్ లో ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు.[2] భారత పర్యటనలో ఉన్న ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో అరంగేట్రం చేసిన కృనాల్‌ పాండ్యా 31 బంతుల్లో 58 నాటౌట్ (7 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి, అరంగేట్రంలో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. తొలి వన్డే మ్యాచ్‌లోనే అర్ధసెంచరీ నమోదు చేసిన 15వ భారత బ్యాట్స్‌మెన్‌గా, 7వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అర్ధ సెంచరీ చేసిన మూడో భారత ఆటగాడిగా కూడా రికార్డు నమోదు చేశాడు. [3][4]

ఇతని తమ్ముడు హార్దిక్ పాండ్యా కూడా భారతదేశం తరపున క్రికెట్ ఆడుతున్నాడు.[5]

క్రికెట్

[మార్చు]

రంజీ

[మార్చు]

పాండ్యా 2016, అక్టోబరు 6న 2016–17 రంజీ ట్రోఫీ టోర్నమెంట్‌లో బరోడా తరఫున క్రికెట్ లోకి ఆరంగ్రేటం చేశాడు.[6] తరువాతి కొద్ది నెలల్లో, అతను 2016-17 విజయ్ హజారే ట్రోఫీలో బరోడాకు ముఖ్య బ్యాట్ మెన్, బౌలర్ గా ఎదిగాడు. 8 మ్యాచ్‌లలో 366 పరుగులు చేశాడు, సగటున 45.75, స్ట్రైక్ రేట్ 81.33. ఇందులో మూడు అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. అత్యధిక స్కోరు 78. బౌలింగ్‌లో 8 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు సాధించాడు, ఎకానమీ రేటు 4.82, సగటు 25.09, స్ట్రైక్ రేట్ 31.10 గా ఉంది. ఎనిమిది మ్యాచ్‌ల్లో 4/20 ఉత్తమ బౌలింగ్ స్కోరు. 2017లో దక్షిణాఫ్రికా ఎ, ఆఫ్ఘనిస్తాన్ ఎ, ఇండియా ఎ ట్రై-సిరీస్ విజయంలో పాల్గొన్నాడు.

అంతర్జాతీయం

[మార్చు]

2021, మార్చిలో, ఇంగ్లాండ్‌తో జరిగిన అంతర్జాతీయ వన్డే (వన్డే) జట్టులో చోటు దక్కించుకున్నాడు.[7] 2021, మార్చి 23న భారతదేశం తరపున తన తొలి వన్డే మ్యాచ్ ను ఆడి 58 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.[8] తొలి వన్డే మ్యాచ్‌లోనే 26 బంతుల్లోనే 50 పరుగులు సాధించిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు.[9]

వివాహం

[మార్చు]

కృనాల్‌ పాండ్యాకు పాంఖురి శర్మ తో 2017, డిసెంబరు 27న న వివాహం జరిగింది.[10][11]

మూలాలు

[మార్చు]
  1. "'Hero' Krunal Pandya's carpe diem moment on debut". Retrieved ఏప్రిల్ 2 2021. {{cite web}}: Check date values in: |access-date= (help)
  2. "IPL 2015 - Hardik Pandya is a man for the future". IBN Live. Archived from the original on 2015-07-09. Retrieved ఏప్రిల్ 2 2021. {{cite web}}: Check date values in: |access-date= (help)
  3. Sakshi, Sakshi (మార్చి 23 2021). "Krunal Pandya: అరంగేట్రంలోనే ప్రపంచ రికార్డు." Sakshi. Archived from the original on ఏప్రిల్ 2 2021. Retrieved ఏప్రిల్ 2 2021. {{cite news}}: Check date values in: |accessdate=, |date=, and |archivedate= (help)
  4. "'This one is for my dad': Krunal Pandya breaks down in tears after smashing fastest 50 by ODI debutant". The Indian Express. Retrieved ఏప్రిల్ 2 2021. {{cite web}}: Check date values in: |access-date= (help)CS1 maint: url-status (link)
  5. "Hardik Pandya's Throwback Picture With Brother Krunal Oozes "Desi Swag"".
  6. "Ranji Trophy, Group A: Baroda v Gujarat at Jaipur, Oct 6-9, 2016". ESPN Cricinfo. Retrieved ఏప్రిల్ 2 2021. {{cite web}}: Check date values in: |access-date= (help)
  7. "Prasidh Krishna called up for ODI series against England". ESPN Cricinfo. Retrieved ఏప్రిల్ 2 2021. {{cite web}}: Check date values in: |access-date= (help)
  8. "1st ODI (D/N), Pune, Mar 23 2021, England tour of India". ESPN Cricinfo. Retrieved ఏప్రిల్ 2 2021. {{cite web}}: Check date values in: |access-date= (help)
  9. "ఇండియా vs England: Krunal Pandya sets new world record with 26-ball 50 on ODI debut". ఇండియా Today. Retrieved ఏప్రిల్ 2 2021. {{cite web}}: Check date values in: |access-date= (help)
  10. Mukherjee, Shubro. "Pankhuri Sharma reveals how Krunal Pandya proposed her in front of Mumbai Indians team". CricketTimes.com. Retrieved ఏప్రిల్ 2 2021. {{cite news}}: Check date values in: |access-date= (help)
  11. "Pankhuri Sharma turns 29: A look at Krunal Pandya's stunning wife". mid-day. Retrieved ఏప్రిల్ 2 2021. {{cite web}}: Check date values in: |access-date= (help)