కృష్ణంరాజుపల్లె
కృష్ణంరాజుపల్లె | |
|---|---|
గ్రామం | |
![]() | |
| అక్షాంశ రేఖాంశాలు: 15°21′19.116″N 78°57′58.104″E / 15.35531000°N 78.96614000°E | |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | మార్కాపురం |
| మండలం | గిద్దలూరు |
| అదనపు జనాభాగణాంకాలు | |
| • లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
| ప్రాంతపు కోడ్ | +91 ( 08405 |
| పిన్‌కోడ్ | 523357 |
కృష్ణంరాజుపల్లె మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.ఈ గ్రామం పొదలకొండపల్లి గ్రామ పంచాయతీలోని ఒక శివారు గ్రామం. ఈ గ్రామం పొదలకుంటపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది. ఇది ఆంధ్ర ప్రాంతానికి చెందినది. జిల్లా కేంద్రం ఒంగోలు నుండి సుమారు 143 కి.మీ. పశ్చిమ దిశలో, రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి సుమారు 267 కి.మీ. దూరంలో ఉంది.[1]
కృష్ణంరాజుపల్లి గ్రామపు పిన్ కోడ్ 523357. ఈ గ్రామానికి సమీప తపాలా కార్యాలయం గిద్దలూరు పశ్చిమ తపాలా కార్యాలయం.
భౌగోళిక స్థితి
[మార్చు]కృష్ణంరాజుపల్లి గ్రామానికి తూర్పున కొమరోలు మండలం, ఉత్తరాన రాచర్ల మండలం, తూర్పున బేస్తవారిపేట మండలం, దక్షిణాన కలసపాడు మండలం ఉన్నాయి.
ఈ గ్రామానికి సమీప పట్టణాలు:
- నంద్యాల
- చాపిరేవుల
- మార్కాపురం
- బంగానపల్లె
జనాభా వివరాలు
[మార్చు]గ్రామంలో ప్రధానంగా తెలుగు భాష మాట్లాడబడుతుంది.
లభ్యమైన గణాంకాల ప్రకారం:
- మొత్తం జనాభా : 2,551
- పురుషులు : 1,355
- మహిళలు : 1,196
- గృహాల సంఖ్య : 548
- మొత్తం విస్తీర్ణం : 895 హెక్టార్లు
రవాణా సౌకర్యాలు
[మార్చు]రహదారి మార్గం
[మార్చు]మార్కాపురం కృష్ణంరాజుపల్లికి సమీప పట్టణం. మార్కాపురం నుండి కృష్ణంరాజుపల్లి దూరం సుమారు 75 కి.మీ. కాగా, రహదారి సౌకర్యం అందుబాటులో ఉంది.
రైలుమార్గం
[మార్చు]కృష్ణంరాజుపల్లికి సమీప రైల్వే స్టేషన్లు:
- గిద్దలూరు రైల్వే స్టేషన్
- కృష్ణంసెట్టి పల్లె రైల్వే స్టేషన్
అలాగే మార్కాపురం సమీపంలోని మార్కాపురం రోడ్ రైల్వే స్టేషన్ కూడా ప్రయాణికులకు ఉపయోగపడుతుంది. అక్కడి నుండి రహదారి మార్గంలో గ్రామానికి చేరుకోవచ్చు.
బస్సు సౌకర్యం
[మార్చు]కృష్ణంరాజుపల్లికి సమీపంలోని APSRTC బస్ స్టేషన్లు:
- గిద్దలూరు బస్ స్టేషన్
- ముండ్లపాడు బస్ స్టేషన్
- దిగువమెట్ట బస్ స్టేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల నుండి ఈ ప్రాంతానికి బస్సు సౌకర్యాలను నిర్వహిస్తుంది.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]శ్రీరామాలయం:- ఈ ఆలయ ద్వితీయ వర్షికోత్సవం సందర్భంగా, 2015-మే నెల-22వ తేదీ శుక్రవారంనాడు, ఎడ్ల బలప్రదర్శన నిర్వహించి, గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేసెదరు.[2]
మూలాలు
[మార్చు]- ↑ "Krishnamrajupalli Village". www.onefivenine.com. Retrieved 2026-06-03.
- ↑ ఈనాడు ప్రకాశం; 2015,మే నెల-22వతేదీ; 3వపేజీ.
