కృష్ణలాల్ శ్రీధరణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కృష్ణలాల్ శ్రీధరణి
జననం(1911-09-16)1911 సెప్టెంబరు 16
మరణం1960 జూలై 23(1960-07-23) (వయసు 48)
ఢిల్లీ, భారతదేశం
జాతీయతభారతీయుడు
విద్యపీహెచ్‌డీ
వృత్తికవి, నాటక రచయిత, పాత్రికేయుడు
జీవిత భాగస్వామి
సుందరి కె. శ్రీధరణి
(m. 1911)
పురస్కారాలురంజిత్రం సువర్ణ చంద్రక్ (1958)

కృష్ణలాల్ శ్రీధరణి ( 1911 సెప్టెంబరు 16 – 1960 జూలై 23) భారతీయ కవి, నాటక రచయిత, పాత్రికేయుడు. ఆయన భారతదేశం, యుఎస్ లోని వివిధ సంస్థలలో సామాజిక శాస్త్రం, ఆర్థికశాస్త్రం, జర్నలిజం చదివారు. భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని ఖైదు చేయబడ్డాడు, ఆ సమయంలో నాటకాలు, కవిత్వం రాయడం ప్రారంభించాడు. అతను ఆంగ్లంలో అనేక నాన్-ఫిక్షన్ పుస్తకాలను కూడా వ్రాశాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

శ్రీధరణి 1911 సెప్టెంబరు 16న భావ్ నగర్ సమీపంలోని ఉమ్రాలాలో జన్మించాడు. అతను తన బాల్యాన్ని జునాగఢ్లో గడిపాడు. [1] ఆయన ప్రాథమిక విద్యను ఉమ్రాలాలో పూర్తి చేసి, మాధ్యమిక విద్యను దక్షిణమూర్తి వినయ్ మందిర్, భావ్ నగర్లో పూర్తి చేశారు. [2] 1929లో గుజరాత్ విద్యాపీఠ్ లో చేరి 1930 దండి మార్చిలో యువకుడిగా పాల్గొన్నాడు. [2] ధరాశన సత్యాగ్రహానికి వెళుతున్నసమయంలో కరాది సమీపంలో అతన్ని అరెస్టు చేశారు. సబర్మతి, నాసిక్ జైళ్లలో కొంత సమయం గడిపాడు. 1931లో శాంతినికేతన్ (విశ్వ-భారతి విశ్వవిద్యాలయం) లో చేరి 1933లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. [1] 1934లో జేమ్స్ ప్రాట్, రవీంద్రనాథ్ ఠాగూర్ ల సలహా మేరకు అమెరికా వెళ్ళాడు. [3] అతను 1935 లో న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుండి సోషియాలజీ అండ్ ఎకనామిక్స్ లో మాస్టర్స్ పూర్తి చేశాడు. అతను కొలంబియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ జర్నలిజం నుండి 1936లో ఎంఎస్, 1940లో పిహెచ్ డి పూర్తి చేశాడు. [1]

అతను 1945 లో అమృతబజార్ పత్రిక కోసం రాయడం ప్రారంభించాడు, 1946 లో భారతదేశానికి తిరిగి వచ్చాడు. ఆయన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో కొంతకాలం పనిచేశారు. నర్తకి, ప్రదర్శన కళాకారిణి అయిన సుందరిని వివాహం చేసుకున్నాడు. 1946లో గుజరాతీ సాహితపరిషత్ చరిత్ర, అర్థశాస్త్ర విభాగానికి అధ్యక్షత వహించాడు.

అవార్డులు[మార్చు]

ఆయనకు 1958లో రంజిత్రం సువర్ణ చంద్రక్ పురస్కారం లభించింది. [1]

మరణం[మార్చు]

1960 జూలై 23న ఢిల్లీలో గుండెపోటుతో మరణించాడు. [2]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 Lal, Mohan (1992). Encyclopaedia of Indian Literature: Sasay to Zorgot (in ఇంగ్లీష్). Sahitya Akademi. ISBN 978-81-260-1221-3.
  2. 2.0 2.1 2.2 "કૃષ્ણલાલ શ્રીધરાણી, ગુજરાતી સાહિત્ય પરિષદ - Krishnalal Shridhrani, Gujarati Sahitya Parishad". www.gujaratisahityaparishad.com. Retrieved 2021-10-20.
  3. Shukla, Sandhya Rajendra (2003). India Abroad: Diasporic Cultures of Postwar America and England (in ఇంగ్లీష్). Princeton University Press. ISBN 978-0-691-09266-9.

బాహ్య లింకులు[మార్చు]