కృష్ణవేణి లక్ష్మణన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కృష్ణవేణి లక్ష్మణన్
వ్యక్తిగత సమాచారం
జననం(1942-06-20)1942 జూన్ 20
మరణం2004 ఆగస్టు 29(2004-08-29) (వయసు 62)
సంగీత శైలినాట్యం
వృత్తిభరతనాట్యం కళాకారిణి

కృష్ణవేణి లక్ష్మణన్ భరతనాట్య కళాకారిణి, నృత్య దర్శకురాలు, నాట్యగురువు.

విశేషాలు[మార్చు]

ఈమె 1942 జూన్ 20న జన్మించింది.[1] ఈమె చెన్నైలోని కళాక్షేత్ర నుండి 1959 భరతనాట్యంలో డిప్లొమా చదివి ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణురాలైంది. తిరిగి 1962లో కళాక్షేత్ర నుండే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలయ్యింది. 1960లో ఈమె తన మొట్టమొదటి ప్రదర్శనను నిర్వహించింది. ఈమెకు భరతనాట్యంతో పాటు కూచిపూడి, కథాకళి, మోహినీయాట్టం, జానపద నృత్యాలలో ప్రవేశం ఉంది. ఈమె కళాక్షేత్రకు 1998 నుండి 2000 వరకు ప్రిన్సిపాల్‌గా వ్యవహరించింది.ఈమె కుమార్తె గాయత్రి కృష్ణవేణి లక్ష్మణన్ కూడా నాట్య కళాకారిణి.

పురస్కారాలు[మార్చు]

ఈమెకు అనేక పురస్కారాలు లభించాయి. వాటిలో కొన్ని:

మరణం[మార్చు]

ఈమె 2004 ఆగస్టు 29వ తేదీన మరణించింది.

మూలాలు[మార్చు]

  1. web master. "Smt.Krishnaveni Lakshmanan". Krishnadhwani School of Natya. Gayatri Krishnaveni Lakshmanan. Retrieved 15 April 2021.