కృష్ణ చంద్ర డే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కృష్ణ చంద్ర డే
జననం(1893-08-24)1893 ఆగస్టు 24
మరణం1962 నవంబరు 28(1962-11-28) (వయసు 69)
వృత్తిసంగీత దర్శకుడు, సంగీతకారుడు, నటుడు, గాయకుడు, సంగీత ఉపాధ్యాయుడు
బంధువులుమన్నా డే (మేనల్లుడు)

కె. సి. డే అని పిలిచే కృష్ణ చంద్ర డే (ఆంగ్లం: Krishna Chandra Dey; 1893 ఆగష్టు 24 - 1962 నవంబరు 28), భారతీయ సంగీత దర్శకుడు, సంగీత స్వరకర్త, సంగీతకారుడు, గాయకుడు, నటుడు, సంగీత ఉపాధ్యాయుడు. ఆయన ఒక అంధ గాయకుడు.

ఆయన కలకత్తాలో (ప్రస్తుతం కోల్‌కతా) జన్మించాడు. అతని తండ్రి పేరు శిబ్‌చంద్ర డే. ఆయన ఎస్.డి. బర్మన్ కి సంగీత గురువు. 1906లో, పద్నాలుగేళ్ల వయసులో, ఆయన కంటి చూపును కోల్పోయి పూర్తిగా అంధుడైనాడు. అనేక ఉన్నత కుటుంబాలచే పోషించబడ్డాడు. ఆయన వివిధ థియేటర్ గ్రూపుల కోసం పనిచేశాడు. 1940 వరకు కోల్‌కతాలోని న్యూ థియేటర్స్ కోసం పనిచేశాడు. ఆయన కీర్తన పాటలకు బాగా ప్రాచూర్యంచెందాడు.

ఆయన తరచుగా జల్సా ఆఫ్ రాజ్‌బారీ ఆఫ్ సోవాబజార్, మిత్రా హౌస్ ఆఫ్ బీడన్ స్ట్రీట్ వంటి అనేక వాటిలో పాడాడు. ఆయన దాదాపు 600 పాటలను రికార్డ్ చేసాడు, అందులో ఎక్కువగా బెంగాలీ, హిందీ, ఉర్దూ, గుజరాతీ, 8 నాట్స్ అంటే ముస్లిం మతపరమైన పాటలు ఉన్నాయి.

ఆయన 1932 నుండి 1946 వరకు సినిమాలకు పాటలు ఆలపించాడు. అలాగే, సంగీతం అందించాడు. నటించాడు కూడా. సినిమాల్లో మరింత రాణించేందుకు 1942లో ఆయన కలకత్తా నుంచి బొంబాయి (ప్రస్తుతం ముంబై) చేరాడు.[1]

ఆయన 1962 నవంబరు 28న కోల్‌కతాలో మరణించాడు. నేపథ్య గాయకుడు మన్నా డే అతని మేనల్లుడు.

మూలాలు[మార్చు]

  1. Land and people of Indian states and union territories, p. 517, గూగుల్ బుక్స్ వద్ద