కెమెరా నిర్వాహకుడు
Jump to navigation
Jump to search

1926లో బ్రన్దేన్బుర్గ్ గేట్ పైన ఒక కెమెరామ్యాన్
కెమెరామెన్ లేక కెమెరా ఆపరేటర్ లేక కెమెరా నిర్వాహకుడు అని పిలవబడే ఇతను ఫోటోగ్రాఫర్ గాను లేక వీడియోగ్రాఫర్ గాను లేక రెండింటిని తన వృతిగా స్వీకరించి ఉంటాడు. ప్రత్యేకంగా లేక ప్రముఖంగా ఒక పనికి సంబంధించి సాంకేతికత ఆధారంగా ఆనగా టెలివిజన్ కోసం వీడియో చిత్రాలను చిత్రించే వారిని టెలివిజన్ వీడియోగ్రాఫర్ అని, సినిమా కోసం చిత్రాలను చిత్రీకరించే వారిని సినిమాటోగ్రాఫర్ అని పిలుస్తారు. కెమెరా నిర్వాహకుడు తీయవలసిన షాట్ లేక సన్నివేశమును చిత్రీకరించడానికి కెమెరాను వివిధ కోణాలలో మార్చుకోవలసి ఉంటుంది, ఇతను భౌతికంగా చిత్ర చిత్రీకరణ స్థానములో ఉండి తన కెమెరాను నిర్వహించవలసిన బాధ్యత ఉంటుంది. సాంకేతిక, సృజనాత్మక నిర్ణయాలను చేయడానికి, దర్శకుడు, ఛాయాగ్రహ దర్శకుడు, నటులు, సిబ్బందితో కలిసి పనిచేయడానికి, కథనాన్ని చిత్రీకరించడానికి కెమెరా నిర్వాహకుడు సహకరిస్తాడు.