కె.ఆర్.వేణుగోపాల్
Appearance
కె.ఆర్.వేణుగోపాల్ రిటైర్డు ఐఏఎస్ అధికారి.రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం, అంగన్‌వాడీ వంటి కార్యక్రమాల విజయవంతానికి కృషి చేశారు. మానసిక వికలాంగుల కోసం స్వచ్ఛంద సంస్థను,దళిత అధ్యయన కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు.అసిస్టెంట్- కలెక్టర్‌గా శిక్షణలో ఉన్నప్పుడే బదిలీకి గురయ్యారు. ప్రధానమంత్రి వి.పి. సింగ్ వద్ద అడిషనల్ సెక్రెటరీగా పనిచేశారు.
భావాలు
[మార్చు]- ఫైల్ అంటే ఒట్టి కాగితం కాదు. ప్రతి ఫైలు వెనుక ఒక మనిషి, అతనికి మరో ప్రత్యర్థి ఉంటాడు. అందుకే ప్రతి ఫైలూ ఒక యుద్ధభూమే! అవి కాగితాలు కాదు జీవితాలు.
- ప్రతి సంతకం వెనుక ఒక సంఘర్షణ ఉంటుంది. పక్కదారి పట్టించే కుయుక్తులు, ఒత్తిళ్లు ఎదురవుతాయి. వాటన్నిటినీ ఎదిరించడానికి ధైర్యం కావాలి. నిజాయితీ ఉన్న చోటే ధైర్యం.. ధైర్యం ఉన్నచోటే నిజాయితీ ఉంటాయి. ఇవి లేకపోతే నిష్పక్షపాతంగా వ్యవహరించలేరు.
- విధినిర్వహణలో నిజాయితీగా ఉంటే ఎటువంటి సమస్యలు ఎదురైనా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవు.
- రైతును రైతుగా చూడకుండా రాజకీయ వర్గానికి చెందిన వ్యక్తిగా చూడటం ద్వారా ఎన్నో అనర్థాలే జరిగిపోతున్నాయి.
- గోదావరి తీరప్రాంతంలో సమృద్ధిగా పంటలు పండే రాజమండ్రి ప్రాంతంలో బియ్యానికి కరువు రావడం ఏమిటి? దీనికంతటికీ కారణం మిల్లర్లు బియ్యాన్ని దాచిపెట్టడమే.
- ఎదుటి వాళ్లు ఎలా వ్యవహరించినా నీతి నిబద్ధతతో నిలిచే వారికి సమాజంలో ఎప్పుడూ ప్రేమాభిమానాలే లభిస్తాయి.
మూలాలు
[మార్చు]- https://web.archive.org/web/20131116124343/http://www.andhrajyothy.com/node/29168 ఆంధ్రజ్యోతి 16.11.2013