కె.ఆర్.శ్రీనివాస అయ్యంగారు
కె.ఆర్.శ్రీనివాస అయ్యంగారు | |
---|---|
జననం | 1908 ఏప్రిల్ 17 సత్తూరు, తమిళనాడు, భారతదేశం |
మరణం | 1999 ఏప్రిల్ 15 చెన్నై, తమిళనాడు, భారతదేశం |
నివాసం | చెన్నై |
పౌరసత్వం | భారతదేశం |
జాతీయత | భారతీయుడు |
రంగములు | ఆంగ్లం |
వృత్తిసంస్థలు | ఆంధ్ర విశ్వవిద్యాలయం |
ప్రసిద్ధి | ఆంగ్లంలో భారతీయ రచనలు |
ముఖ్యమైన పురస్కారాలు | సాహిత్య అకాడమీ ఫెలోషిప్ |
కొడగనల్లూర్ రామస్వామి శ్రీనివాస అయ్యంగార్ (1908–1999) కె.ఆర్.శ్రీనివాస అయ్యంగారు గా సుపరిచితుడు. అతను ఆంగ్లంలో భారతీయ రచయిత, ఆంధ్ర విశ్వవిద్యాలయం నకు మాజీ వైస్-ఛాన్సలర్. అతనికి 1985లో సాహిత్య అకాడమీ ఫెలోషిప్ లభించింది.
జీవిత విశేషాలు
[మార్చు]శ్రీనివాస అయ్యంగార్ 1908 ఏప్రిల్ 17 న జన్మించాడు. అతను 1947 లో ప్రారంభమైన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆంగ్ల విభాగంలో చేరాడు.[1] 1966 జూన్ 30 న, అతను ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ అయ్యాడు. 1968 నవంబరు 29 వరకు కొనసాగాడు. విశ్వవిద్యాలయంలో పురాతనమైన విభాగాలలో ఒకటి అయిన ఇంగ్లీష్ ఆధునిక యూరోపియన్ భాషల విభాగంగా మలచబడింది. తరువాత అతను 1969 నుండి 1977 వరకు సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షుడిగా, తరువాత 1977 నుండి 1978 వరకు దాని ఏక్టింగ్ ప్రెసిడెంటుగా పనిచేశాడు. అతను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యునిగా పనిచేసాడు. అతను సిమ్లాలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీ గవర్నర్ల బోర్డు సభ్యుడిగా 1970 నుండి 1979 వరకు పనిచేసాడు. అతను PEN, ఆల్ ఇండియా సెంటర్ ఎగ్జిక్యూటివ్ గా కూడా పనిచేసాడు. ఆంధ్ర, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాలు అతనికి డి. లిట్ డిగ్రీలు (హానరిస్ కాసా) ప్రదానం చేశారు. అతని రచన ఆన్ ది మదర్ 1980 లో సాహిత్య అకాడమీ వార్షిక అవార్డును అందుకుంది.[2]
అతను 1958 లో లీడ్స్ విశ్వవిద్యాలయంలో ఆంగ్లంలో భారతీయ రచనలపై ఉపన్యాసాలు ఇవ్వడానికి సిద్ధం చేశాడు, తరువాత ఇది ఇండియన్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్ అనే పుస్తకానికి ఆధారమైంది.
అక్టోబర్ 1972 లో అయ్యంగార్ సిమ్లాలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీలో శ్రీ అరబిందో రాసిన సావిత్రి (పుస్తకం) పై ఆరు ఉపన్యాసాలు ఇచ్చాడు: అవి ఈ క్రింది ఇతివృత్తాలను కలిగి ఉన్నాయి: యోగి, కవి; సావిత్రి లెజెండ్; అశ్వపతి ముందున్నవాడు; సావిత్రి అండ్ సత్యవాన్; సావిత్రి యోగ; డాన్ టు గ్రేటర్ డాన్.[3][2]
అయ్యంగార్ బ్రిటిష్, అమెరికన్, కామన్వెల్త్ సాహిత్యాలు, తులనాత్మక సౌందర్యం, భారతదేశం యొక్క ఆధ్యాత్మిక వారసత్వంపై విస్తృతంగా రచనలు చేసాడు. అతను 40 కి పైగా పుస్తకాలను రచించాడు.
రచనలు
[మార్చు]- లిట్టన్ స్ట్రాచీ (1938)
- ఇండో-ఆంగ్లియన్ లిటరేచర్ (1943)
- లిటరేచర్ అండ్ ఆథర్షిప్ ఇన్ ఇండియా (1943)
- ద ఇండియన్ కంట్రీబ్యూషన్ టు ఇంగ్లీషు లిటరేచర్ (1945)
- శ్రీ అరబిందో - బయగ్రఫీ (1945)[4]
- గెరాల్డ్ మాన్లీ హాప్కిన్స్ , (1948)
- ఆన్ ద మదర్ (1952)
- షేక్స్పియర్ (1964)
- ఎడ్యుకేషన్ అండ్ ద న్యూ ఇండియా (1967)
- ఇండియన్ రైటర్స్ ఇన్ కౌన్సిల్ [5]
- లీవ్స్ ఫ్ర్రం ఎ లాగ్: ప్రాగ్మెట్స్ ఆఫ్ అ జర్నీ .
- రవీంధ్రనాథ్ టాగూర్ (1965)
- మైన్లీ అకడమిచ్ టాక్స్ టు ద స్టూడెంట్స్ అండ్ టీచర్స్ (1968)
- గురునానక్ - ఎ హోమేజ్ (1973)
- ఇండియన్ రైటింగ్స్ ఇన్ ఇంగ్లీషు (1983)
- ఆస్ట్రేలియా హెలిక్స్ (1983)
- సీతాయన (1987)
- తిరుక్కురల్ కు ఆగ్ల అనువాదం (1988)
- సగ ఆఫ్ సెవెన్ మదర్స్ (1991)
- క్రిష్ణ-గీతం (1994)
మూలాలు
[మార్చు]- ↑ "Department of English at Andhra University". Archived from the original on 11 May 2009. Retrieved 19 August 2009.
- ↑ "Savitri: the light of the Supreme blog". Archived from the original on 28 July 2011. Retrieved 19 August 2009.
- ↑ Complete book of Sri Aurobindo Biography at scribd.
- ↑ Complete book of Indian Writers in Council at Google Books.