Jump to content

కె.ఎల్. చిషి

వికీపీడియా నుండి
కె.ఎల్. చిషి
7th నాగాలాండ్ ముఖ్యమంత్రి
In office
1990 మే 16 – 1990 జూన్ 19
అంతకు ముందు వారుఎస్సీ జమీర్
తరువాత వారువముజో ఫేసావో
నియోజకవర్గంఅటోయిజ్ శాసనసభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం (1944-01-01) 1944 జనవరి 1 (వయసు: 82)
నఘుటోమి, నాగాలాండ్
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామిఎరాలి స్వు
తండ్రిలుఖశే చిషి
నివాసంకోహిమా, నాగాలాండ్
చదువుగ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్
నైపుణ్యంరాజకీయ నాయకుడు, సామాజిక కార్యకర్త

కె.ఎల్. చిషి నాగాలాండ్ కు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి.

జననం

[మార్చు]

కె.ఎల్. చిషి 1944, జనవరి 1న నాగాలాండ్ లోని నఘుతోమిలో జన్మించాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

అతను భారతదేశంలోని నాగాలాండ్ రాష్ట్రంలో రాజకీయ పార్టీ అయిన నేషనలిస్ట్ డెమోక్రటిక్ మూవ్‌మెంట్ వ్యవస్థాపక చీఫ్ గా కూడా పనిచేశాడు. 1990లో నాగాలాండ్ ముఖ్యమంత్రిగా 28 రోజులపాటు పనిచేసిన చిషి ఆ తర్వాత పదవికి రాజీనామా చేశాడు. అతను భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిమాపూర్-I నియోజకవర్గం (దిమాపూర్) నుండి రాష్ట్ర ఎన్నికలలో (2008) విజయవంతంగా పోటీ చేశాడు. చిషి 2018 జనవరిలో భారతీయ జనతా పార్టీలో[1] చేరడానికి భారత జాతీయ కాంగ్రెస్‌ను విడిచిపెట్టాడు. 2019, మార్చి 14న భారత జాతీయ కాంగ్రెస్‌లో తిరిగి చేరాడు.

మూలాలు

[మార్చు]
  1. "Nagaland ex-CM KL Chishi joins BJP - Times of India". The Times of India. Retrieved 2018-07-03.